సోమ్‌నాథ్ ఆలయంలొ ముఖేష్ అంబానీ 

మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి చేరుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ మహాదేవునికి రుద్రాభిషేకం చేశారు. అంతేకాకుండా, సోమనాథ్ ఆలయ ట్రస్టుకు ముఖేష్ అంబానీ రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ముఖేష్ అంబానీ సోమనాథ్ ఆలయ ట్రస్టుకు ₹1.51 కోట్లు విరాళం భారతీయ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన తీసుకొచ్చిన జియో టెలికం ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో మనం […]

Share:

మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయానికి చేరుకుని తన కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ మహాదేవునికి రుద్రాభిషేకం చేశారు. అంతేకాకుండా, సోమనాథ్ ఆలయ ట్రస్టుకు ముఖేష్ అంబానీ రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు.

సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ముఖేష్ అంబానీ

సోమనాథ్ ఆలయ ట్రస్టుకు ₹1.51 కోట్లు విరాళం

భారతీయ కుబేరుల్లో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన తీసుకొచ్చిన జియో టెలికం ఎన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక గొప్ప మనసున్న బిజినెస్​మ్యాన్ ఆయన. ఆయన ప్రతి దానిని చాలా కొత్తగా ఆలోచిస్తారు. ఆయన సతీమణి నీతా అంబానీతో సహా.. ఆయన ఇద్దరు కుమారులు కూడా బిజినెస్​లోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని రకాల బిజినెస్​లు ఆయనకు ఉన్నాయో లెక్కించడం కష్టం. అంతటి భారీ కోటీశ్వరుడైన ముఖేష్ అంబానీకి దైవభక్తి కూడా ఎక్కువే. మహాశివరాత్రి సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు, రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీతో కలిసి గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ ప్రార్థనలు చేశారు. వారికి సోమ్‌నాథ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పీ.కే. లాహిరి, సెక్రటరీ యోగేంద్ర దేశాయ్ స్వాగతం పలికారు.

అనంతరం తండ్రీకొడుకులు సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు, అభిషేకం చేయించుకున్నారు. ఆలయ పూజారి వారికి ప్రసాదం, గంధపు పేస్ట్‌ను బహుకరించారు. పవిత్రమైన పండుగ సందర్భంగా అంబానీ సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు రూ.1.51 కోట్ల విరాళాన్ని అందించారు. ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది గుజరాత్‌లోని గిర్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో పురాతన ఓడరేవు వెరావల్ సమీపంలో ఉంది. 

కొత్త బిజినెస్​లోకి 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ బీసీసీఐ రాతే మార్చేసింది. బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఈ లీగ్ మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్నాళ్ల పాటు కేవలం మెన్స్ లీగ్​నే నిర్వహించిన బీసీసీఐ ఇక ఇప్పుడు వుమెన్స్ లీగ్​కు కూడా ప్రారంభించనుంది. వుమెన్స్ ఐపీఎల్ బిడ్లను ఆహ్వానించగా.. ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఐదు సంస్థలకు బీసీసీఐ ప్రాంచైజీలను అప్పజెప్పింది. వీటిలో ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఒకటి. ముంబై జట్టును నీతా అంబానీ చూసుకుంటారు. ఇక పురుషుల జట్టు ఇప్పటి వరకు లీగ్​లో అత్యధిక విజయవంతంగా ఉంది. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ట్రోఫీలను కైవసం చేసుకుంటుంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఇండియన్ జాతీయ జట్టుకు కెప్టెన్​గా ఉన్నాడు. వుమెన్స్ టీమ్​కు కూడా జాతీయ జట్టు కెప్టెన్ అయిన హర్మన్​ప్రీత్​ కౌర్​ను రూ. 1.8 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు ఆమెకే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.  ముంబైకి ఫ్యాన్ బేస్ కూడా గట్టిగానే ఉంది. దేశవ్యాప్తంగా చాలా మంది ముంబై ఇండియన్స్ అంటే పడి చస్తారు. కానీ ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు పోయినసారి సీజన్​లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. మరి ఈ సీజన్​లో ఎలా సత్తా చాటుతుందో చూడాలి.