రాత్రంతా పార్లమెంట్ ఆవరణలో ఎంపీల నిరసన

మణిపూర్ హింసాకాండ పార్లమెంటును కుదిపేస్తోంది. హింసాకాండ .అల్లర్లు, ఘటనలతో మణిపూర్ నీ కుదిపేస్తుంటే  ప్రధాని మోడీ కనీసం మాట్లాడటం లేదని విపక్షాలు ఆగ్రహం నీ వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మోడీ తక్షణమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి. మణిపూర్ మంటలతో సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయినా.. ఒక్క రోజు […]

Share:

మణిపూర్ హింసాకాండ పార్లమెంటును కుదిపేస్తోంది. హింసాకాండ .అల్లర్లు, ఘటనలతో మణిపూర్ నీ కుదిపేస్తుంటే  ప్రధాని మోడీ కనీసం మాట్లాడటం లేదని విపక్షాలు ఆగ్రహం నీ వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై మోడీ తక్షణమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి. మణిపూర్ మంటలతో సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయినా.. ఒక్క రోజు కూడా సజావుగా సాగలేదు. మైతీ, కుకీల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌పై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట సోమవారం రాత్రి విపక్ష ఎంపీలు కొందరు నిరసనకు దిగారు. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో సభలు హోరెత్తాయి.మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. ‘ఇండియా ఫర్‌ మణిపుర్‌’అని రాసిఉన్న ప్లకార్డులతో సోమవారం రాత్రి 11 గంటల నుంచి నిరసనకు దిగారు.

మూడో రోజైన సోమవారం కూడా సమావేశాలు సజావుగా సాగలేదు …

మణిపూర్ అంశంపై ఉభయ సభల్లోనూ ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలన్న విపక్ష కూటమి ఇండియా డిమాండ్‌‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో మూడో రోజైన సోమవారం కూడా సమావేశాలు సజావుగా సాగలేదని పేర్కొంది. కాగా, మణిపూర్‌ ఘటనలపై చర్చించాలని లోక్‌సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మణిపూర్‌ అంశంపై ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వాలని ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ డిమాండ్‌ చేశారు.

ఆయనకు మద్దతుగా విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్‌ ఓంబిర్లా స్పందిస్తూ.. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే కేంద్రం తరఫున ఎవరూ సమాధానం ఇవ్వాలనేది మీరు ఆదేశించలేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు సరికదా.. స్వరం మరింత పెంచి నినాదాలు చేశారు.

ఇండియా ఫర్‌ మణిపూర్‌ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీలు కూడా ఎదురుదాడికి దిగారు. పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అన్నింటికంటే ముఖ్యమైన అంశంపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ప్రతిపక్షం కూడా ప్రభుత్వంపై అదే ఆరోపణలు చేసింది.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వం అసభ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని సభకు వచ్చి ప్రకటన చేయాలన్నదే మా డిమాండ్. ఆ ప్రకటనపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. మీరు బయట మాట్లాడుతున్నారు కానీ లోపల కాదు, ఇది పార్లమెంటును అవమానించడమే. ఇది తీవ్రమైన విషయం’ అని ఆయన అన్నారు.

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో మహిళలపై హింసకు సంబంధించిన సమస్యలపై ప్రతిపక్ష నాయకులు మౌనంగా ఉన్నారని, చర్చ నుంచి పారిపోయారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు.

ప్రతిపక్షాలు సాకులు చెప్పవద్దని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. వర్షాకాల సమావేశానికి ముందే మణిపూర్‌పై సున్నితత్వం మరియు దృఢత్వంతో ప్రధానమంత్రి ఒక ప్రకటన చేసారు. పార్లమెంటులో మణిపూర్ సమస్య పై చర్చను ప్రారంభించలేదు అని చెప్పడం తప్పు” అని సింగ్ అన్నారు.