సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసిన ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వివేకా కేసును గతం లో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌ పై ఫిర్యాదు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.ఈ కేసు దర్యాప్తును సరైన రీతిలో చేపట్టలేదని.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు.ఈ నెల 19న సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు ఎంపీ లేఖ రాయగా.. తాజాగా బయటపడింది. లేఖ సారాంశం ఇది…  వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డితో పాటుగా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి తీరు పై అనుమానాలు […]

Share:

మాజీ మంత్రి వివేకా కేసును గతం లో విచారించిన ఎస్పీ రామ్‌సింగ్‌ పై ఫిర్యాదు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.ఈ కేసు దర్యాప్తును సరైన రీతిలో చేపట్టలేదని.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు.ఈ నెల 19న సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌సూద్‌కు ఎంపీ లేఖ రాయగా.. తాజాగా బయటపడింది.

లేఖ సారాంశం ఇది…

 వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డితో పాటుగా అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి తీరు పై అనుమానాలు ఉన్నాయన్నారు. పక్షపాత వైఖరితో రామ్‌సింగ్ దర్యాప్తు చేశారని ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ల ఆధారంగా లేఖ రాశారు. వివేకా రెండో వివాహం బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు లేఖ లో ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్‌సింగ్ విచారణ జరిపారని అన్నారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చనే కోణంలో విచారణ జరగలేదన్నారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరూ చెప్పారని అడిగారు.  

ఈ కేసులో రామ్‌సింగ్‌ పర్యవేక్షణ మాత్రమే చేపట్టాలని.. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా దర్యాప్తు చేశారని తెలిపారు. సునీత రెడ్డితో కుమ్మక్కై.. ఈ కేసులో తనతో పాటు తమ తండ్రి భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సాక్ష్యులను ఆయన బెదిరించారని పేర్కొన్నారు. తన పేరు చెప్పాలంటూ పీఏ కృష్ణారెడ్డిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని అన్నారు. రామ్‌సింగ్ వేధింపులు భరించలేక కృష్ణారెడ్డి, కడప ఎస్పీ పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేసిన విషయాన్ని లేఖ లో గుర్తుచేశారు. పలువురు సాక్ష్యాలు చెప్పిన స్టేట్‌మెంట్లను రామ్‌సింగ్ పూర్తిగా మార్చి రాశారని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. 

అలాగే పులివెందుల మాజీ సీఐ శంకరయ్య చెప్పని మాటలను రామ్‌సింగ్‌ సాక్ష్యంగా చూపారన్నారు. అభిషేక్‌రెడ్డి వాంగ్మూలాన్ని వక్రీకరించారని.. అలాగే ఈ కేసులో ఏ-2 సునీల్‌ యాదవ్‌ వివేకా హత్య జరిగిన రోజు తన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేకవుట్‌ ద్వారా నిర్ధారించామని సీబీఐ పేర్కొనడం పూర్తిగా అబద్ధమన్నారు. దీనిని రామ్‌సింగే సృష్టించారని.. షేక్‌ షమీమ్‌ తో వివేకా రెండో పెళ్లి సంగతిని కావాలనే పక్కన బెట్టారని తెలిపారు. అంతేకాదు కీలక డాక్యుమెంట్లను దక్కించుకోవడానికే ఈ హత్య చేసినట్లు ఏ-4 దస్తగిరి స్వయంగా చెప్పారన్నారు.

హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా సీబీఐ ఆలస్యం చేసిందన్నారు అవినాష్ రెడ్డి. అదేవిధంగా దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అటు సీబీఐ కానీ.. సునీత కానీ వ్యతిరేకించలేదని అన్నారు. విచారణలో రామ్‌సింగ్ చేసిన తప్పులను సవరించాలని కోరారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని విన్నవించారు.

కాగా.. కర్ణాటక క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ ఇటీవలె సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతంలో పనిచేసిన రామ్ సింగ్ స్థానంలో ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. కొత్త డైరెక్టర్ రావడంతో గతంలో జరిగిన విచారణ తీరును అవినాష్ రెడ్డి వివరించారు. రామ్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. వివేకా హత్య కేసు మొత్తం పక్కదారి పట్టిందన్నారు. 

సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల పై అభ్యంతరాలు తెలిపారు అవినాష్ రెడ్డి.రామ్‌సింగ్‌ తన దర్యాప్తులో చాలా అంశాలను వదిలిపెట్టారని.. ఈ కేసు దర్యాప్తులో అనేక అనుమానాలున్నాయని, వాటి పై పునఃపరిశీలించాలని కోరారు.