సూర‌త్‌లో పీఎం మిత్ర పార్క్

ఇటీవల సూరత్ లో జరిగిన సమావేశంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్ అలాగే అప్పారెల్ పార్క్ సంబంధించి స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ల మధ్య MOU ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా ఈ పీఎం మిత్ర పార్క్ సుమారు 1,141 ఎకరాల ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు.  మరిన్ని వివరాలు:  ఇటీవల సూరత్ లో జరిగిన సమావేశంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్ అలాగే అప్పారెల్ పార్క్ సంబంధించి స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ల మధ్య MOU […]

Share:

ఇటీవల సూరత్ లో జరిగిన సమావేశంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్ అలాగే అప్పారెల్ పార్క్ సంబంధించి స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ల మధ్య MOU ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా ఈ పీఎం మిత్ర పార్క్ సుమారు 1,141 ఎకరాల ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. 

మరిన్ని వివరాలు: 

ఇటీవల సూరత్ లో జరిగిన సమావేశంలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్సటైల్ అలాగే అప్పారెల్ పార్క్ సంబంధించి స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ల మధ్య MOU ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమానికి చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్, యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ గోయల్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టెక్స్టైల్స్ అండ్ రైల్వే దర్శన జార్దోష్, నవసారి ఎంపి సి ఆర్ పట్టీల్, గుజరాత్ మినిస్టర్లు మరియు సూరత్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అందిన సమాచారం ప్రకారం, ఈ పీఎం మిత్ర పార్క్ సుమారు 1,141 ఎకరాల ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నారు. 

సీఎం మాటల్లో: 

అయితే మిత్ర పార్క్ ఏర్పాటు కోసం సర్వం సిద్ధం చేసినప్పటికీ, ముందుగా ఈ పార్క్ కోసం ఏర్పాటు చేసిన ల్యాండ్ కోసం అనేకమైన అప్లికేషన్స్ వచ్చాయంటూ, సుమారు వేయకపోయినా అప్లికేషన్స్ వచ్చాయంటే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ల్యాండ్ డిమాండ్ సుమారు నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు సీఎం పటేల్ మాట్లాడుతూ వెల్లడించారు. 

అంతేకాకుండా తను ముందుగానే నవసారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో మాట్లాడినట్లు, అంతేకాకుండా ఈ పార్క్ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఇంకేమైనా ల్యాండ్ కావాలా అని అడిగినట్లు కూడా పటేల్ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి, పీఎం నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం బట్టి మన భారతదేశం ఒక గ్లోబల్ లీడర్ గా ఎదగాలని టెక్స్టైల్ ప్రొడక్షన్ లో ముందంజలో ఉండాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ పార్కు ద్వారా అనేకమైన గ్రామీణ ప్రజలకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. 

అయితే యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ టెక్స్టైల్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మాట్లాడుతూ కూడా, తన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పార్క్ గురించి ముందే ఆలోచన చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ, కేవలం 9 సంవత్సరాల లో ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్థిక రాజ్యంగా భారతదేశం ఎదిగిందని త్వరలోనే ఇంకా ముందు అందులో ఉంటామని చెప్పుకొచ్చారు. 

పార్కు యొక్క ముఖ్య ఉద్దేశం: 

నిజానికి నరేంద్ర మోదీ ఆలోచన చేసినట్లు, తనదైన శైలిలో సెంట్రల్ అలాగే స్టేట్ గవర్నమెంట్ లకు మధ్య ఒప్పందం కుదుర్చుకొని ప్రస్తుతం పీఎం మిత్ర పార్క్ నిర్వహించే పనిలో పడ్డారు అధికారులు. ప్రస్తుతం  టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక చోటికి చేరేందుకు అలాగే అభివృద్ధి పరంగా టెక్స్టైల్ రంగంలో ముందంజకు వెళ్లడానికి, మిత్ర పార్క్ చాలా సహాయపడుతుంది అంటున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు భారతదేశంలో యువతకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు అధికారులు. మరి ఇది ఎంతవరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందంజలో ఉంటుందో చూడాల్సి ఉంది.