జ్ఞానవాపీ మసీదు సర్వే పూర్తి చేసేందుకు ASIకి  మరింత సమయం కావాలి

జ్ఞానవాపీ మసీదులో సర్వే పూర్తి చేసేందుకు వారణాసి కోర్టు నాలుగు వారాల గడువును భారత పురావస్తు శాఖకు శనివారంతో ముగియడంతో, ఏఎస్ఐ  కోర్టు నుండి మరింత సమయం కోరవచ్చని మరియు ప్రాథమికంగా సమర్పించ వచ్చని హిందూ న్యాయవాదుల తరపు న్యాయవాదులు తెలిపారు.  ఈ సందర్భంగా హిందూ తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠి మాట్లాడుతూ, సర్వే ఇంకా పూర్తి కాలేదని తాము భావిస్తున్నామని అన్నారు. ఏఎస్ఐ ప్రాథమిక నివేదిక ఇవ్వవచ్చు కానీ సర్వే అసంపూర్తిగా ఉన్నందున వారు ఇంకా […]

Share:

జ్ఞానవాపీ మసీదులో సర్వే పూర్తి చేసేందుకు వారణాసి కోర్టు నాలుగు వారాల గడువును భారత పురావస్తు శాఖకు శనివారంతో ముగియడంతో, ఏఎస్ఐ  కోర్టు నుండి మరింత సమయం కోరవచ్చని మరియు ప్రాథమికంగా సమర్పించ వచ్చని హిందూ న్యాయవాదుల తరపు న్యాయవాదులు తెలిపారు.  ఈ సందర్భంగా హిందూ తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠి మాట్లాడుతూ, సర్వే ఇంకా పూర్తి కాలేదని తాము భావిస్తున్నామని అన్నారు. ఏఎస్ఐ ప్రాథమిక నివేదిక ఇవ్వవచ్చు కానీ సర్వే అసంపూర్తిగా ఉన్నందున వారు ఇంకా తుది నివేదికను సమర్పించకూడదు. 

మధ్యాహ్న భోజనం తర్వాత, కోర్టు ఈ విషయాన్ని వింటుందని, ఏఎస్ఐ కోర్టు నుండి మరింత సమయం కోరే అవకాశం ఉందని త్రిపాఠి చెప్పారు. మరో వైపు హిందూ వ్యాజ్యాల తరపున వాదిస్తున్న న్యాయవాది శుభాష్ నందన్ చతుర్వేది మాట్లాడుతూ.. సర్వే పూర్తి చేసేందుకు వారణాసి జిల్లా కోర్టు ఏఎస్ఐకి ఇచ్చిన నాలుగు వారాల గడువు శనివారంతో ముగుస్తుంది. సర్వే ఇంకా పూర్తి కాలేదని మేము భావిస్తున్నాము మరియు తేదీని పొడిగించమని ఏఎస్ఐ అభ్యర్థించవచ్చని అతను చెప్పాడు.

హిందూ సంఘాలు శివలింగం ఉందని వాదిస్తోన్న వజుఖానా మినహా జ్ఞానవాపీ మసీదు ప్రాంగణం మొత్తాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని గత నెలలో వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలు వెలువరించింది. అయితే, ఈ ఉత్తర్వులపై ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టును అత్యవసరంగా ఆశ్రయించాయి. అయితే, ఓ వైపు ఏఎస్ఐ సిబ్బంది మసీదు ప్రాంగణంలో గత నెలలో సర్వే మొదలు పెట్టేశారు. ఈ సమయంలో సర్వేపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది.

వారణాసిలోని జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వేపై సర్వోన్నత న్యాయస్థానం జులై 26 సాయంత్రం 5 గంటల వరకూ స్టే విధించింది. మసీదు ప్రాంగణంలో సర్వేకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం జ్ఞానవాపీ మసీదుకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం చేరుకుని ప్రక్రియ మొదలుపెట్టింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మసీదు కమిటీ.. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను రద్దుచేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. రెండు రోజుల పాటు స్టే విధించింది. అంతేకాదు, కింద కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

కాగా, కేంద్ర తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా..‘ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వే వారణాసిలోని జ్ఞానవాపీ  మసీదు నిర్మాణాన్ని ఏ విధంగానూ మార్చదని తెలిపారు. ఒక్క ఇటుక కూడా తొలగించడం జరగదు.. ఇందుకు ప్రణాళిక లేదు. పిటిషనర్లు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసంర లేదు. అక్కడ తవ్వకాలు జరగడం లేదు.. కేవలం ప్రాంగణం చుట్టుకొలతలు, ఫోటోగ్రఫీ వంటివి మాత్రమే జరుగుతాయి’ అని నొక్కి చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఏఎస్‌ఐ తవ్వకాలు చేపట్టే ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది.. వచ్చే సోమవారం వరకు ఒక వారం పాటు ఈ దశలో ఎటువంటి తవ్వకాలు జరగలేదని మేము స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాం’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం సమర్పించిన రికార్డులను పరిగణనలోకి తీసుకున్నారు.

ఇక, జ్ఞానవాపీ మసీదు ప్రాంగణం మొత్తాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వేకు వారణాసి జిల్లా కోర్టు గత నెలలో అనుమతించింది. ఈ సర్వే నివేదికను ఆగస్టు 4లోగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణంపై శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన కోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగంణంలో పురాతన హిందూ దేవాలయం గుర్తులు ఉన్నాయని.. ఆ ప్రదేశంలో స్వయంభూ జ్యోతిర్లింగం లక్షల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని పిటిషనర్లు వాదించారు. కొందరు మతోన్మాదులు ఆలయాన్ని కూల్చి.. దానిపై మసీదు నిర్మించారని ఆరోపించారు. కాగా, గతేడాది మసీదు ప్రాంగణంలో శివలింగం వంటి ఆకారం బయటపడిన విషయం తెలిసిందే.