చంద్రుడు మీద ప్రకంపనలు!

భారతదేశ ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-3 లాండర్ విక్రమ్ ప్రస్తుతం చంద్రుడు సౌత్ పోల్ మీద తన పనిని ప్రారంభించింది. ముఖ్యంగా దక్షిణ ధృవం మీద పరిశోధన చేస్తున్న క్రమంలో చంద్రుడు మీద ఆగస్టు 26న ప్రకంపనలు ఏర్పడినట్లు, ఇస్రోకి ఇన్ఫర్మేషన్ పంపించింది లాండర్.  చంద్రుడు మీద ప్లాస్మా, సల్ఫర్:  విక్రమ్ లో ఒక భాగంగా ఉన్న రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్ మరియు అట్మాస్పియర్ – లాంగ్‌ముయిర్ ప్రోబ్ (RAMBHA-LP)ఆన్‌బోర్డ్ చంద్రయాన్-3, […]

Share:

భారతదేశ ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-3 లాండర్ విక్రమ్ ప్రస్తుతం చంద్రుడు సౌత్ పోల్ మీద తన పనిని ప్రారంభించింది. ముఖ్యంగా దక్షిణ ధృవం మీద పరిశోధన చేస్తున్న క్రమంలో చంద్రుడు మీద ఆగస్టు 26న ప్రకంపనలు ఏర్పడినట్లు, ఇస్రోకి ఇన్ఫర్మేషన్ పంపించింది లాండర్. 

చంద్రుడు మీద ప్లాస్మా, సల్ఫర్: 

విక్రమ్ లో ఒక భాగంగా ఉన్న రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్ మరియు అట్మాస్పియర్ – లాంగ్‌ముయిర్ ప్రోబ్ (RAMBHA-LP)ఆన్‌బోర్డ్ చంద్రయాన్-3, దక్షిణ ధ్రువ ప్రాంతంలోని చంద్రుడు మీద ప్లాస్మా అంటే అయోనైజ్డ్ గ్యాస్ ఉన్నట్లు కనుగొన్నట్లు ఇస్రో వెల్లడించింది. 

ప్రగ్యాన్‌లోని ఉన్న మైక్రో డివైస్ చంద్ర దక్షిణ ధ్రువంలో సల్ఫర్ ఆనవాళ్లు కనిపించినట్లు ఇస్రో తెలిపింది. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోప్ (APXS) ఈ వారం ప్రారంభంలో విక్రమ్ గుర్తించిన సల్ఫర్‌తో పాటు ఇతర మైక్రో పార్టికల్స్ ఉన్నట్లు తేల్చింది ఇస్రో.అయితే సల్ఫర్ ఉన్నచోట కచ్చితంగా ఇతర మెటల్స్ ఉండొచ్చని.. లేదంటే అది ఏదైనా అగ్నిపర్వతానికి సంబంధించింది ఉండొచ్చని, లేదంటే ఆ సల్ఫర్ కేవలం ఉల్కాపాతం కారణంగానే చంద్రుడు మీద ఉందా అనే దాని మీద, ఇస్రో మరింత రీసెర్చ్ చేసేందుకు ముందుకు సాగుతోంది. 

దక్షిణ ధ్రువం ప్రత్యేకతలు: 

1960 సంవత్సరంలో చంద్రుడు మీద కలెక్ట్ చేసిన కొన్ని శాంపిల్స్ అనేవి పరీక్ష చేశారు. పరీక్ష చేసిన తర్వాత అందులో హైడ్రోజన్ నిలువలు ఉన్నట్లు తేలింది. అంటే కచ్చితంగా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి వనరులు తప్పకుండా ఉంటాయని నిర్ధారించారు. అయితే అప్పటి నుంచి చంద్రుడు మీదకు ముఖ్యంగా దక్షిణ ధ్రువం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టాయి ప్రపంచ దేశాలు. 

ముఖ్యంగా చంద్రుడు మీద నీటి వనరులు ఉన్నట్లయితే, ఆ వనరులను ఉపయోగించుకుని మరో గ్రహం గా పిలువబడుతున్న మార్స్ ప్రయాణం సులభతరం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం పరిశోధకుల ముఖ్య ఆలోచన. 

చంద్రయాన్-3: 

ఇస్రో ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ఇప్పటికే సగం పని పూర్తి చేసుకుందని చెప్పుకోవాలి. ఆగస్టు 5కి ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 చంద్రుడి యొక్క కక్ష్య(ఆర్బిట్)లోకి ప్రవేశించి మొదటి విజయాన్ని సాధించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మెల్లమెల్లగా చంద్రుడికి దగ్గరవుతూ చివరి కక్ష్య (ఆర్బిట్)లోకి ప్రవేశించడమే కాకుండా ఆగస్టు 23 సాయంత్రం సమయంలో, చంద్రుడు మీద అడుగు పెట్టబోతోంది చంద్రయాన్-3. 

ఆగస్టు 23న చంద్రుడు మీద చంద్రయాన్-3 అడుగుపెట్టే క్షణాలు దగ్గర పడుతున్నాయి. భారతదేశం యావత్తు కూడా చంద్రయాన్-3 చంద్రుడు మీద సురక్షితంగా అడుగు పెట్టాలని తమ వంతు ప్రార్థనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి లూనార్ లాండర్ పనితీరు సవ్యంగానే ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకో కొన్ని గంటలలోనే, సాయంత్రం సమయం నాటికి చంద్రుడు మీద, చంద్రయాన్-3 లాండర్ సురక్షితంగా, విజయవంతంగా అడుగుపెట్టే అవకాశం ఉంది అని ఇస్రో తెలియజేస్తుంది.

ఆదిత్య L1 లాంచ్ కి సర్వం సిద్ధం: 

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L లాంచ్ కి గురువారం కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి రాకెట్, సాటిలైట్ సిద్ధంగా ఉన్నాయని, ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్‌ను పూర్తి చేస్తామన్నారు ఇస్రో సిబ్బంది.