నుహ్ అల్లర్ల కీలక సూత్రధారి అరెస్ట్

హర్యానాలోని నుహ్ లో కొద్ది రోజుల క్రితం అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను అదుపు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. అయినా కానీ ప్రభుత్వం ఎలాగోలా అక్కడి అల్లర్లను శాంతింపజేసింది. ఈ అల్లర్లను కంట్రోల్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నుహ్ లో చాలా రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ చేసింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. […]

Share:

హర్యానాలోని నుహ్ లో కొద్ది రోజుల క్రితం అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లను అదుపు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. అయినా కానీ ప్రభుత్వం ఎలాగోలా అక్కడి అల్లర్లను శాంతింపజేసింది. ఈ అల్లర్లను కంట్రోల్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నుహ్ లో చాలా రోజుల పాటు ఇంటర్నెట్ బంద్ చేసింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు వర్గాల మధ్య మత హింస కారణంగానే ఈ అల్లర్లు జరిగాయని అంతా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ అల్లర్ల వెనుక మాస్టర్ మైండ్ గురించి రాజకీయ పార్టీలు ఆరోపణలు కూడా చేసుకున్నాయి. ఈ ఆంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. దాంతో అక్కడి ప్రభుత్వం ఈ ఇష్యూ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి అల్లర్లను కంట్రోల్ చేసింది. ఈ అల్లర్లు జరిగి దాదాపు నెలకు పైనే అవుతున్నా కానీ ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలం అవుతూనే ఉన్నారు. దీంతో అక్కడి పోలీసుల మీద అనేక మంది విమర్శలు చేశారు. అయినా కానీ ఏ మాత్రం వెనక్కు తగ్గని పోలీసులు మాస్టర్ మైండ్ ను అరెస్ట్ చేసి చూపించారు.

మఫ్టీలో వచ్చి.. 

ఈ అల్లర్లను ప్రేరేపించాడని భావిస్తున్న భజరంగ్ దళ్ సభ్యుడు మోను మనేసర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మోను మనేసర్ మరో పేరు మోహిత్ యాదవ్. ఇటీవల నుహ్‌ లో జరిగిన మత హింసకు సంబంధించి ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు మంగళవారం హర్యానా పోలీసులు ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. అదుపులోకి తీసుకున్నపుడు పోలీసులు డ్యూటీ డ్రెస్ లో కాకుండా సాధారణ దుస్తులు ధరించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి అరెస్ట్ కు సంబంధించి హర్యానా పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో అతడి అరెస్ట్ వార్త నిజమా? కాదా? అని అంతా అనుకుంటున్నారు. వీడియో సాక్ష్యం ఉండడంతో అంతా నమ్ముతున్నారు. అయితే ఇతడి అరెస్ట్ కు సంబంధించి భజరంగ్ దళ్ మాత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లో ఇది జరిగిందని తెలిపింది. 

వారికి కూడా కావాలి… 

మోను మనేసర్ కేవలం హర్యానా పోలీసులకు మాత్రమే కాదు… రాజస్థాన్ పోలీసులకు కూడా అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. దీంతో ఇప్పుడు సీన్ లోకి రాజస్థాన్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్ లో జరిగిన ఓ హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి కోసం హర్యానా పోలీసులు మాత్రమే కాకుండా రాజస్థాన్ పోలీసులు కూడా తీవ్రంగా వెతుకుతున్నారు. రాజస్థాన్ లోని భివానీలో ఇద్దరు పశువుల వ్యాపారులను చంపిన కేసులో అతడు మోస్ట్ వాంటెడ్. రాజస్థాన్ పోలీసులు గత ఐదు నెలల నుంచి వెతుకుతున్నా కానీ అతడు వారికి చిక్కలేదు. 

సమాచారం అందింది.. 

మోను మనేసర్ ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని భరత్‌పూర్ ఎస్పీ మృదుల్ కచావా తెలిపారు. తాము హర్యానా పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. హర్యానా పోలీసుల పని పూర్తవగానే తమ పనిని తాము ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు. నుహ్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. చాలా రోజుల పాటు నుహ్ రావణ కాష్టంలా రగిలిపోయింది. ఇక చివరికి అక్కడ శాంతిని స్థాపించారు. ఈ ప్రాంతం మీద ఇటు గవర్నమెంట్ తో పాటు అటు ప్రతి పక్షాలు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. దీంతో ఈ ప్రాంతం కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచింది. మరి మోను ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఈ రోజు ప్రకటిస్తారో? లేకపోతే సైలెంట్ గా తమ పని తాము కానిస్తారో నేడు తేలిపోనుంది.