Uttar Pradesh: 40 కిమీ ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గొన్న కోతి

ప్రేమ, అనురాగం..అప్యాయత మనుషుల్లో కంటే జంతువుల్లోనే ఎక్కువ ఉంటుందని ఓ కోతి(Monkey) నిరూపించింది. తనకు అన్నం పెట్టిన యజమాని చనిపోతే..ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 40 కిలో మీటర్లు ప్రయాణించింది. అంత్యక్రియల్లో(funeral) పాల్గొని..తన యజమానికి అంతిమ వీడ్కోలు పలికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.  శవం ముందు కూర్చోని.. యూపీలోని అమ్రోహ(Amroha)లో  రామ్ కున్వర్(Ram Kunwar) అనే వ్యక్తి..రెండు నెలల క్రితం ఓ కోతితో స్నేహం చేశాడు. ఆ కోతి(Monkey) […]

Share:

ప్రేమ, అనురాగం..అప్యాయత మనుషుల్లో కంటే జంతువుల్లోనే ఎక్కువ ఉంటుందని ఓ కోతి(Monkey) నిరూపించింది. తనకు అన్నం పెట్టిన యజమాని చనిపోతే..ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 40 కిలో మీటర్లు ప్రయాణించింది. అంత్యక్రియల్లో(funeral) పాల్గొని..తన యజమానికి అంతిమ వీడ్కోలు పలికింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

శవం ముందు కూర్చోని..

యూపీలోని అమ్రోహ(Amroha)లో  రామ్ కున్వర్(Ram Kunwar) అనే వ్యక్తి..రెండు నెలల క్రితం ఓ కోతితో స్నేహం చేశాడు. ఆ కోతి(Monkey) కూడా రామ కున్వర్ ప్రేమ, అప్యాయతన చూసి మురిసిపోయింది. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడకు వెళ్లేది. రామ్ కున్వర్(Ram Kunwar) కూడా కోతికి రొట్టెలు తినిపించేవాడు. కన్నబిడ్డ లాగ సాదుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా కోతితో రామ్ కున్వర్ ఆడుకున్నాడు. అయితే అక్టోబర్ 10వ తేదీన రామ్ కున్వర్ అనార్యోగంతో చనిపోయాడు. ఈ వార్త విన్న కోతి(Monkey) గుండె పగిలింది. తన యజమాని చనిపోవడంతో కన్నీరు పెట్టుకుంది. శవం ముందు కూర్చోని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఏడ్చింది.

అంత్యక్రియల కోసం 40 కి. మీ ప్రయాణం..

రామ్ కున్వర్ మృతదేహానికి తిగ్రి ధామ్(Tigri Dham)లో  అంత్యక్రియలు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే అమ్రోహకు తిగ్రి ధామ్ దాదాపు 40 కిలో మీటర్ల  దూరం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు డెడ్ బాడీని తీసుకెళ్తుండగా..తాను వస్తాను అన్నట్లు..బంధువులతో కలిసి వెళ్లింది. 40 కిలో మీటర్లు ప్రయాణించి..యజమాని అంత్యక్రియల్లో పాల్గొంది. యజమాని చితి దగ్గర కూర్చోని బాధపడింది. కోతి బాధపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్(viral) అయ్యాయి. 

ఈ ప్రేమకు విలువ కట్టలేం..

యజమాని పట్ల కోతి చూపించిన ప్రేమపై సోషల్ మీడియా(Social Mediaలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కోతి ప్రేమకు విలువ కట్టలేమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

గత నెలలో ఇలాగే, లఖింపుర్‌ఖేరి(Lakhimpurkheri) జిల్లాలో ఓ కోతి(Monkey) చూపిన విశ్వాసం చర్చనీయాంశంగా మారింది. భీరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గోంధియా గ్రామానికి చెందిన చందన్‌వర్మ అనే రైతుకు ఊరి శివార్లలో పొలం ఉంది. రోజూ పొలం వద్ద భోజనం చేసే సమయంలో ఓ కోతి చందన్‌ దగ్గరకు వచ్చేది. ఆ ఆహారంలో నుంచే కొంత కోతికి పెట్టేవాడు. ఇలా రోజు జరగడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇటీవల పక్షవాతం బారినపడ్డ చందన్‌ గత నెలలో మృతిచెందాడు. బంధువులంతా అతడి ఇంటికి చేరుకున్నారు. ఇంతలో ఆ కోతి(Monkey).. కూడా రైతు ఇంటికి వచ్చింది. చందన్‌ మృతదేహంపై కప్పి ఉన్న దుప్పటి తీసి అతణ్ని చూసి కంటతడి పెట్టింది.  చందన్‌ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు కోతి అక్కడే ఉండిపోయింది.

ఇలాగే శ్రీలంకలో

శ్రీలంక(Srilanka)లోని తూర్పు ప్రావిన్స్‌లో బట్టికలోవా(Batticaloa) జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి వానరంతో స్నేహంగా ఉండేవాడు. రోజూ ఇంటికి వచ్చిన కోతికి అతడు ఆహారం పెట్టేవాడు.. దీంతో ఆ మూగజీవం అతడితో సరదాగా ఆడుకొనేది. దురదృష్టవశాత్తు, సెప్టెంబర్ 18న అతడు మరణించాడు. అయితే, రోజూలాగే ఆ మరుసటి ఉదయం ఇంటికి వచ్చిన కోతికికి ప్రేమతో అన్నం పెట్టే తన మిత్రుడు కనబడలేదు. అప్పటికే అంత్యక్రియలు(funeral) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహం చుట్టూ గుమిగూడి ఉన్నారు. దీంతో మృతదేహం వద్దకు వెళ్లిన వానరం అతడు ఇక తిరిగిరాడని తెలియక ఆడుకొనేందుకు పిలిచేందుకు తట్టిలేపే ప్రయత్నం చేయడం అందరినీ కలిచివేసింది. ఎంతకూ లేవకపోయే సరికి కంటతడి పెడుతూ అతడికి ముద్దు పెడుతూ నివాళులర్పించిన దృశ్యాలు అక్కడి ఉన్నవారి హృదయాలను బరువెక్కించాయి.