KTR: ఎన్నికల సమీపిస్తున్న వేళ కేటీఆర్ వాఖ్యలు

KTR: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల జోరు పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రతి జిల్లాలోని ప్రచారాన్ని జోరు పెంచారు. ఈ సందర్భంలోనే నేతలు కొన్ని టీవీ షోలలో పాల్గొంటూ తమదైన శైలిలో తమ ప్రతిపక్ష నేతలు గురించి మాట్లాడటం జరుగుతోంది. ఇదే సందర్భంలో కేటీఆర్ (KTR) టీవీ షోలో పాల్గొని తనదైన శైలిలో ఎన్నికలకు సంబంధించి, ఇంకా అనేక విషయాలు మాట్లాడటం జరిగింది.  రాహుల్.. మోదీకి ఆస్తి అంటూ..:  ప్రధానమంత్రి […]

Share:

KTR: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల జోరు పుంజుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి పార్టీ కూడా తమదైన శైలిలో ప్రతి జిల్లాలోని ప్రచారాన్ని జోరు పెంచారు. ఈ సందర్భంలోనే నేతలు కొన్ని టీవీ షోలలో పాల్గొంటూ తమదైన శైలిలో తమ ప్రతిపక్ష నేతలు గురించి మాట్లాడటం జరుగుతోంది. ఇదే సందర్భంలో కేటీఆర్ (KTR) టీవీ షోలో పాల్గొని తనదైన శైలిలో ఎన్నికలకు సంబంధించి, ఇంకా అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. 

రాహుల్.. మోదీకి ఆస్తి అంటూ..: 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi)యే అతిపెద్ద ఆస్తి అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ‘బి-టీమ్’ ఛార్జ్‌పై ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించలేని అసమర్థులని, వీలైతే ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ లలో పోటీ చేయాలన్నారు కేటీఆర్ (KTR). ఇక్కడ తెలంగాణ (Telangana)లో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న ఒక పార్టీ బీఆర్‌ఎస్‌ ని అడ్డుకున్నాడు రాహుల్ అని.. అందుకే మోదీ (Modi)కి రాహుల్ గాంధీ (Rahul Gandhi) అతిపెద్ద ఆస్తి అని తాను అనుకుంటున్నాట్లు వెల్లడించాడు కేటీఆర్ (KTR). 

Read More: Assembly elections: ఒకే వేదికపై ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్

వరల్డ్ కప్ గురించి మాట్లాడిన కేటీఆర్: 

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ గురించి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ, “హమారా వరల్డ్ కప్ చల్ రహా హై, నవంబర్ 30 కో చక్కా మర్నా హై…” అని కెటిఆర్ అన్నాడు. తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలతో క్రికెట్ మ్యాచ్‌లను అనుబంధిస్తూ.. ‘2024 మే చక్క మార్ కే మోదీ (Modi) జీ కో హరానా హై’ అంటే2024లో సిక్సర్‌ కొట్టి మోదీ (Modi) జీని ఓడించాలి అని కేటీఆర్ (KTR) అన్నారు.

నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో గురించి కూడా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ, “వీడియో నిజంగా దారుణం, చాలా అవమానకరమైనది, దురదృష్టకరం, అలాంటి చర్యలను ఇక ముందు జరగకుండా నిబంధనలు, కఠినమైన చర్యలు తీసుకువస్తాము అని అన్నారు కేటీఆర్ (KTR). 

BRS మేనిఫెస్టో, కెసిఆర్ ఇచ్చిన హామీలు: 

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana)  మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana)  బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana)  ముఖ్యమంత్రి కెసిఆర్. 

సౌభాగ్యలక్ష్మి పథకం (scheme) ద్వారా అర్హులైన నిరుపేద మహిళలందరికీ నెలకు 3000 అందజేయడం.

1. అన్ని అర్హత కలిగిన BPL కుటుంబాలకు 400 గ్యాస్ సిలిండర్.

2. ఆసరా పింఛన్లను 5000లకు పెంచడంతోపాటు వార్షిక పెంపుదల 500.

3. ఆరోగ్యశ్రీ భీమా పథకం (scheme) కవరేజీని 15 లక్షలకు పెంచేందుకు కేసీఆర్ (KCR) ఆరోగ్య రక్ష పథకం (scheme).

4. రైతు బంధు పథకం (scheme) ప్రారంభ పెంపు 11000తో ఎకరానికి సంవత్సరానికి 16000 పెంచబడుతుంది.

5. ప్రభుత్వం 100% ప్రీమియం చెల్లించి బీపీఎల్ కార్డుదారులందరికీ, 5 లక్షల బీమా పథకాన్ని (scheme) అందజేస్తామని కేసీఆర్ (KCR) భీమా ప్రతి ఇంటికి ధీమా వ్యక్తం చేశారు.

6. గృహలక్ష్మి పథకం (scheme) కింద హైదరాబాద్‌లో 1లక్ష, 2బిహెచ్‌కె ఇళ్లను నిర్మిస్తున్నారు.

7. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు,

మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చాలి.

8. మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు.

9. వారిని రాష్ట్ర పిల్లలుగా అరిగినలోకి తీసుకుని తెలంగాణ (Telangana)  ప్రభుత్వం అనాథ పిల్లల పథకాన్ని (scheme) అమలు చేయడం.

10. అసైన్డ్ భూములపై ఆంక్షల తొలగింపు.

11. సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్లపై ప్రత్యేక రీసెర్చ్.

12. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించేందుకు తెలంగాణ (Telangana)  అన్నపూర్ణ పథకం (scheme) అమలు.