నా భార్య‌పై జంతువుల్లా మీద‌పడ్డారు

షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మైటీస్ డిమాండ్‌పై మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత మే 4న ఆడవాళ్ళ మీద అఘాయిత్యం జరిగింది. హింసకు లోనైనా వారిలో ఉన్న ఒక మహిళ భర్త, అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈ విషయం తన జీవితంలోనే ఒక బాధాకరమైన విషయం అంటూ, ప్రజలను కాపాడే సుబేదార్ గా పని చేస్తున్న తను, తన సొంత భార్య అలాగే తమ […]

Share:

షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మైటీస్ డిమాండ్‌పై మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత మే 4న ఆడవాళ్ళ మీద అఘాయిత్యం జరిగింది.

హింసకు లోనైనా వారిలో ఉన్న ఒక మహిళ భర్త, అస్సాం రెజిమెంట్‌లో సుబేదార్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈ విషయం తన జీవితంలోనే ఒక బాధాకరమైన విషయం అంటూ, ప్రజలను కాపాడే సుబేదార్ గా పని చేస్తున్న తను, తన సొంత భార్య అలాగే తమ కమ్యూనిటీ వారిని హింసకు గురికాకుండా చేయలేకపోయాను అన్నాడు.

అంతేకాకుండా కొంతమంది గుంపులుగా జంతువుల్లా ప్రవర్తించారని.. తమతో పాటు మహిళలను విడిగా తీసుకువెళ్లారని, బలవంతంగా బట్టలు విప్పించి అఘాయిత్యానికి పాల్పడినట్లు హింసకు గురైన మహిళ భర్త చెప్పాడు. అంతేకాకుండా హింసకు గురైన మహిళల భర్తలు దాడులకు వ్యతిరేకంగా బట్టలు లేకుండా నినాదాలు చేశారు. 

హింసకు కారణమైన నలుగురు అరెస్ట్: 

మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించిన కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు జూలై 20న తెలిపారు.

కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. తౌబాల్ జిల్లా, నాంగ్‌పోక్ సెక్మై PS పరిధిలో ఆడవాళ్ళని ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారం చేసిన సంఘటన వెలుగులకు వచ్చిన అనంతరం. ఈ దారుణమైన నేరానికి సంబంధించిన మరో 03 ప్రధాన నిందితులను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురను అరెస్టు చేశారు అని మణిపూర్ పోలీసులు ట్వీట్ ద్వారా తెలియజేశారు.

వైరల్ వీడియో కేసు:

తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్ మరియు సామూహిక అత్యాచారానికి పాల్పడిన 03 ప్రధాన నిందితులను ఈరోజు అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం నలుగురును అరెస్టు చేశారు.మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడం గమనార్హం. ఈ దుర్ఘటనకు సంబంధించి, మణిపూర్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మే 4న కాంగ్‌కోపి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడితో సహా మొత్తం ఇద్దరిని అరెస్టు చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ జూలై 20న తెలిపారు.

మణిపూర్ దుర్ఘటనకి సంబంధించిన వైరల్ వీడియో చూసిన తర్వాత అధికార బీజేపీకి చెందిన అన్ని శాసనసభలు కూడా ఇటువంటి ఘోరమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించుకున్నాయి. అయితే శాసనసభ జరుగుతున్న సమయంలో చాలామంది శాసనసభ్యులు మణిపూర్ సంఘటన గురించి చర్చ జరగాలని చాలా సేపు నినాదాలు చేశారు. అందుకే శాసనసభ ప్రస్తుతం ఈరోజు జరిగేందుకు వాయిదా పడింది. హింసకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, 32 సంవత్సరాల హుయిరేమ్ హెరోదాస్ని పోలీసులు పట్టుకున్నారు. 

దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన ఈ వీడియో, ప్రతిపక్షాల చాలా వరకు ఖండించారు, ఆలస్యం చేయకుండా మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్ చేసింది. బాధితులు కుకీ-జో తెగకు చెందినవారని, నేరస్థులు మెయిటీస్ అని వెల్లడించింది.

సైకుల్ పోలీస్ స్టేషన్‌లో బి. ఫైనోమ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల చీఫ్ తంగ్‌బోయ్ వైఫేయ్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, అదే సంఘటనలో మరో ఆడపిల్ల మీద కూడా సామూహిక అత్యాచారం జరిగినట్లు తేల్చారు. భారతీయ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు