IAFని 2032 నాటికి బెస్ట్‌గా మార్చాలి..మా లక్ష్యం అదే

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసు. ఎయిర్ ఫోర్స్ గొప్పలను కథలు కథలుగా చెబుతారు. అటువంటి ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా భారత వైమానిక దళ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైమానిక దళం గొప్పల గురించి వారు పేర్కొన్నారు. నిన్న దేశ వ్యాప్తంగా వైమానిక దళ […]

Share:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసు. ఎయిర్ ఫోర్స్ గొప్పలను కథలు కథలుగా చెబుతారు. అటువంటి ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా భారత వైమానిక దళ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైమానిక దళం గొప్పల గురించి వారు పేర్కొన్నారు. నిన్న దేశ వ్యాప్తంగా వైమానిక దళ వేడుకలు ఘనంగా జరిగాయి. 

టార్గెట్ 2032.. 

వైమానిక దళ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు. గత తొమ్మిది దశాబ్దాలుగా వైమానిక శాఖ నిరంతరం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాలలో ఒకటిగా రూపాంతరం చెందిందని తెలిపారు. అయితే అది సరిపోదని అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గంలో ఉంటుందని, 2032 నాటికి మనం (ఎయిర్ ఫోర్స్)  100 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుందని తెలిపారు. ఆ సమయానికి మనం వరల్డ్ లోనే ది బెస్ట్ గా ఉండాలని పేర్కొన్నారు. 91వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్-బమ్రౌలీలో జరిగిన ఎయిర్ ఫోర్స్ డే-2023 కవాతులో ఎయిర్ చీఫ్ మార్షల్ వైమానిక యోధులను ఉద్దేశించి ప్రసంగించారు.

సిద్ధంగా ఉండాలి… 

ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏం వస్తుందో చెప్పలేకుండా ఉన్నామని కావున ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎయిర్ ఫోర్స్ మన జాతీయ ప్రయోజనాలను పెంపొందించడంలో నిర్ణయాత్మక శక్తిని అందించే చురుకైన మరియు అనుకూలమైన దళం అని ఆయన అన్నారు. అభివృద్ధి చెందాల్సిన బలగాలు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రపంచం శరవేగంగా మారుతోందని, ఎయిర్ ఫోర్స్ తన మార్గంలో వస్తున్న అన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చౌదరి అన్నారు. ఆవిష్కరణ అనేది మన డీఎన్ఏలో ఒక భాగం కావాలని, ఇది మనకు వచ్చే బెదిరింపులు మరియు సవాళ్లను సులభంగా స్వీకరించేలా చేస్తుందని తెలిపారు. మనల్ని మనం నిక్కచ్చిగా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మనల్ని మనం మార్చుకోవడానికి ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఆధునిక యుద్ధం సాంప్రదాయ పద్ధతుల్లో ఉండడం లేదని తెలిపారు. దీన్ని వైమానిక శాఖ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. యుద్ధభూమిలో ఆధిపత్యం చెలాయించడానికి మనం గాలి, అంతరిక్షం, సైబర్ మరియు భూ సామర్థ్యాలను సజావుగా ఏకీకృతం చేయాలని తెలిపారు. అగ్నివీర్‌ ల మొదటి బ్యాచ్ ను విజయవంతంగా కంప్లీట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం మహిళా అగ్నివీర్‌ లతో పాటుగా తదుపరి బ్యాచ్‌లు ప్రాథమిక శిక్షణ పొందుతున్నాయని పేర్కొన్నారు.  స్వీయ-అభ్యాసం మరియు స్వీయ-విద్యకు మరింత ప్రాధాన్యతనిస్తూ అన్ని శిక్షణా పాఠ్యాంశాల కోసం శిక్షణ యొక్క కఠినత బోర్డు అంతటా పెంచబడిందన్నారు. 

ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఆర్ కే ఎస్ భదౌరియా, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) బ్రౌన్, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) పీవీ  నాయక్, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఎస్పీ త్యాగి, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఎస్ కృష్ణస్వామి, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఏవై టిప్నిస్, ఎయిర్ చీఫ్ మార్షల్ (రిటైర్డ్) ఎన్‌సి సూరి పాల్గొన్నారు. వారు కూడా ఎయిర్ ఫోర్స్ ఘనతలను ప్రస్తావించారు.