మధ్యప్రదేశ్ లో మైనర్ బాలికపై అత్యాచారం

వరుస అత్యాచారాలు మధ్యప్రదేశ్ లో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో శుక్రవారం ఒక దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. 11 సంవత్సరాల మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం ముఖ్యమంత్రి. ఆడవాళ్లకు మరింత భద్రత కల్పిస్తాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి శివ రాజ్  చౌహాన్ వెల్లడించారు. అయితే నిందితులను అస్సలు వదిలేది లేదని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, సరైన […]

Share:

వరుస అత్యాచారాలు మధ్యప్రదేశ్ లో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లో శుక్రవారం ఒక దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. 11 సంవత్సరాల మైనర్ బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం ముఖ్యమంత్రి. ఆడవాళ్లకు మరింత భద్రత కల్పిస్తాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి శివ రాజ్  చౌహాన్ వెల్లడించారు. అయితే నిందితులను అస్సలు వదిలేది లేదని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, సరైన శిక్ష విధించాలని పోలీసులను ఆదేశించారు.

జరిగిన సంఘటన:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మైహర్ అనే ఊరికి చెందిన 11 సంవత్సరాల మైనర్ బాలిక, శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. తల్లితండ్రులు తమ పాప కోసం రాత్రి వరకు ఎదురుచూసినప్పటికీ కనిపించకపోవడంతో, వారు పోలీసులను ఆశ్రయించడం జరిగింది.

తర్వాత పోలీసు వారు పాప కోసం వెతకడం ప్రారంభించిన అనంతరం, 11 సంవత్సరాల మైనర్ బాలిక నివసిస్తున్న ఇంటి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అడవిలో, రక్తపు మడుగులో కనిపించింది బాలిక. అయితే ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినట్లు తేలింది. అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఒక వ్యక్తి, అదే ఊరికి సంబంధించిన వాడు. అంతేకాకుండా,  ఊరిలో ప్రసిద్ధిగాంచిన శారద గుడి నిర్వహిస్తున్న గోవుల శాలలో పని చేస్తున్నాడు నిందితుడు. 

అయితే ప్రస్తుతం బాలిక పరిస్థితి సీరియస్ గానే ఉంది అంటున్నారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం, తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న మైనర్ బాలికను మైహర్ సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అంతేకాకుండా ఈ సంఘటన ఊరిలో తెలియడంతో గ్రామ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి హాస్పిటల్ కి చేరుకున్నారు. 

ఎక్కువ అవుతున్న అత్యాచారాలు: 

ఈమధ్య కాలంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సామూహిక అత్యాచారాలు దేశంలో అంతకంతకు హద్దు మీరుతున్నాయి. ఇలాంటి సంఘటనే జూన్ 29న చోటు చేసుకుంది. గురుగ్రామ్ లోని డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని కలవడానికి, హోటల్ కి వెళ్ళగా, ఆమె సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

గురుగ్రామ్కి చెందిన ఒక యువతి, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి, జూన్ 29న హోటల్ కి ఇన్వైట్ చేయగా, కలవడానికి ఒక హోటల్ కి వెళ్ళింది. అయితే ఇదే సమయంలో ఆ యువకులతో పాటు మరో వ్యక్తి కూడా ఉండడం యువతి గమనించింది. అయితే స్నేహితుడు అని చెప్పడంతో, సరే అంటూ వారు ఆఫర్ చేసిన ఫుడ్ అలాగే డ్రింక్స్ తాగడం జరిగింది. అయితే ముందుగానే ప్లాన్ ప్రకారం, ఆ యువకుడు ఆ అమ్మాయికి ఇచ్చే ఆహార పదార్థాలలో మత్తుమందు కలపడం జరిగింది. అయితే ఆహారం తీసుకున్న వెంటనే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. అయితే ఇదే సందర్భాన్ని అదునుగా తీసుకున్న ఆ యువకుడు అలాగే తన స్నేహితుడు ఆ అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. 

తర్వాత కొద్దిసేపటికి అమ్మాయి స్పృహలోకి వచ్చాక తనమీద అత్యాచారం జరిగిందని తెలుసుకుంది. అంతేకాకుండా వారు చేసిన అత్యాచారాన్ని వీడియో తీసి ఆ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఎవరికైనా ఈ విషయం గనుక చెప్తే, తన వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని ఆ ఇద్దరు యువకులు బెదిరించారు. అయితే అప్పటినుంచి భయంతో ఎవరికీ చెప్పని ఆ యువతీ ధైర్యం చేసి, ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.