హర్యానా హింసాకాండ కారణంగా వలసదారులు స్వగ్రామాలకు పారిపోతున్నారు

హర్యానా రాష్ట్రం మత ఘర్షణలతో రణరంగంగా మారుతోంది..  నుహ్ జిల్లాలో సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో మొదలైన హింస.. మత ఘర్షణలకు దారి తీసింది. దీంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు పోలీసులు, ఒక ఇమామ్ కూడా ఉన్నారు. వందలమంది గాయాల పాలయ్యారు. ఇటు దేవాలయాలు, అటు మసీదులను ఆందోళన కారులు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటివరకు మత ఘర్షణలకు కారణమైనవారిని గుర్తించి 116 […]

Share:

హర్యానా రాష్ట్రం మత ఘర్షణలతో రణరంగంగా మారుతోంది..  నుహ్ జిల్లాలో సోమవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రలో మొదలైన హింస.. మత ఘర్షణలకు దారి తీసింది. దీంతో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు పోలీసులు, ఒక ఇమామ్ కూడా ఉన్నారు. వందలమంది గాయాల పాలయ్యారు. ఇటు దేవాలయాలు, అటు మసీదులను ఆందోళన కారులు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటివరకు మత ఘర్షణలకు కారణమైనవారిని గుర్తించి 116 మందిని అరెస్ట్ చేసినట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు.

హర్యానాలోని నూహ్‌ జిల్లాలో సోమవారం జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలపై వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ అల్లర్లపై హరియాణా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గురుగ్రామ్, నుహ్‌లలో 144 సెక్షన్‌ విధించింది. అయినా కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల మీదకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు.కాగా, సోమవారం హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింస మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిన హింస కారణంగా  చాల మంది  చనిపోయారు మరియు గాయపడ్డారు.  గురుగ్రామ్‌లోని ఒక ప్రాంతం దీనికి స్పష్టమైన ఉదాహరణ.

15 మండే మిగిలాం మమ్మలిని కాపాడండి… 

ఈ ఘర్షణల్లో ప్రాణ నష్టం, గాయపడటమే కాకుండా గురుగ్రామ్‌లో స్థానికంగా ఉంటే అనేక వలస కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు.  పశ్చిమ బెంగాల్‌కు చెందిన 100కు పైగా ముస్లిం కుటుంబాలలో 15 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. 

ఈ నేపథ్యంలో  హర్యానాను వారు వీడుతున్నారు.తమ వస్తువులు అన్నీ సర్దుకుని రోడ్లపై నడుస్తూ తమ రాష్ట్రాలకు వెళ్తూ కనపడుతున్నారు.. కుటుంబాలతో కలిసి కాలి నడకన వెళ్తున్నారు. 

భయం అక్కర్లేదు అని , భద్రత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నా వెనక్కి తగ్గడం లేదు. తమ సొంతూర్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చాలని అధికారులను వేడుకుంటున్నారు. నూహ్‌తోపాటు దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో పలు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు పలు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే ఇప్పుడు బజరంగ్‌ దళ్‌ సభ్యులు తమపై దాడికి పాల్పడుతున్నారని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారని పలు ముస్లిం కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి

25 ఏళ్ల షమీమ్ హుస్సేన్ కళ్లలో నీళ్లు తిరుగుతూ, చేతులు ముడుచుకుని, వేడుకున్నాడు, “నిన్న సాయంత్రం, కొంతమంది వచ్చి ముస్లింలందరినీ విడిచిపెట్టమని అడిగారు. మాకు తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు మరియు చెల్లించడానికి అప్పులు కూడా ఉన్నాయి. నాకు ఏదైనా జరిగితే ఫర్వాలేదు, కానీ నాకు ఏడాది కొడుకు ఉన్నాడు. మమ్మల్ని రక్షించమని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మరియు స్థానికులకు నా హృదయపూర్వక విన్నపం. దయచేసి మాకు సహాయం చేయండి అని ఆయన బాధ వ్యక్తం చేసారు. అంతకుముందు రోజు, గురుగ్రామ్ జిల్లా కమిషనర్ వలస కుటుంబాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నూహ్‌ జిల్లాలో జరిగిన అల్లర్లు మంగళవారం నాటికి గురుగ్రామ్‌కు వ్యాపించాయి. షాపులు, రెస్టారెంట్లపై అల్లరి మూకలు దాడి చేశాయి. పలు షాపులను లూఠీ చేశారు. ఈ పరిణామాలపై వేలాది మంది వలస ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పారామిలిటరీ దళాలను మోహరించినప్పటికీ వారిలో భయం పోవడం లేదు.  పోలీస్‌ ఆంక్షల వల్ల రవాణా సౌకర్యాలు తగినంతగా లేవు. ఈ నేపథ్యంలో తాము వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని వలస కార్మికులు కోరుతున్నారు.

ఒక్క మంగళవారం రోజే ఏకంగా 41 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.