చారిత్రక నిర్ణయం: సీఏపీఎఫ్ పరీక్ష 13 భాషల్లో

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోమ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం హోం శాఖ మంత్రి చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లుగా శనివారం విడుదల చేసిన అధికార ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షల్లో హిందీ, […]

Share:

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోమ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లీష్‌తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం హోం శాఖ మంత్రి చారిత్రిక నిర్ణయం తీసుకున్నట్లుగా శనివారం విడుదల చేసిన అధికార ప్రకటనలో తెలియజేశారు.

ఈ పరీక్షల్లో హిందీ, ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, గుజరాత్, పంజాబీ, ఉర్దూ, మణిపురి, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, కొంకణి, ఒరియా భాషలలో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 2024 జనవరి 1 నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష ప్రాంతీయ భాషలో పరీక్షలు రాసేందుకు వీలుంటుందని తద్వారా వారి ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయని కేంద్రం హోం శాఖ పేర్కొంది.  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఇటీవల డిమాండ్లు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. సిఆర్పిఎఫ్ రిక్రూమెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలని  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ భాషల వినియోగాన్ని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. తాజా నిర్ణయంపై పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్థానిక యువతకు అవగాహన కల్పించాలని వారిని ఈ దిశగా ప్రోత్సహించాలని కోరింది. ఇదొక మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి పునాది వేస్తుందని ఆయన అన్నారు. దేశ యువత ఆకాంక్షలు నెరవేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరైనా తాము కన్నా కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకి కాకూడదని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయం ఒక నిదర్శనం మని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. 

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరిధిలోకి  సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్,   సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్  బోర్డర్  పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సహస్త్ర సిమా బల్  వంటివి దీని కిందకు వస్తాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో సీఏపీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఒకటి దేశంలో నుంచి లక్షలాది మంది అభ్యర్థులు దీనికి హాజరవుతుంటారు కాకపోతే ఇప్పటివరకు రెండు భాషలలో మాత్రమే ఈ పరీక్షను నిర్వహించారు ఇప్పటినుంచి ఎవరి ప్రాంతీయ భాషలో వారు పరీక్షలు రాసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేస్తుంది. వారి ప్రాంతీయ భాషకు అనుగుణంగా ఈ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తే తప్పక ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.  ఏది ఏమైనా అప్పటికి కూడా నిరుద్యోగ యువతకు ఇదొక మంచి నిర్ణయం అనే చెప్పొచ్చు.