మానసిక పరిస్థితి బాగోలేదు అని క్లారిటీ ఇచ్చిన అంజు తండ్రి

రాజస్థాన్ లో నివాసం ఉంటున్న ఒక గృహిణి, తన భర్తకి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది. అయితే ప్రస్తుతం, తన గురించి వాళ్ళ నాన్నగారు చేసిన వాఖ్యలు ఇప్పుడు ఈ వార్తలో మరో మలుపుగా మారింది.  అసలు విషయం:  34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన […]

Share:

రాజస్థాన్ లో నివాసం ఉంటున్న ఒక గృహిణి, తన భర్తకి జైపూర్ కి వెళ్తున్న అని చెప్పి, ఏకంగా భారతదేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్ళింది అని తర్వాత తెలిసింది. అయితే ప్రస్తుతం, తన గురించి వాళ్ళ నాన్నగారు చేసిన వాఖ్యలు ఇప్పుడు ఈ వార్తలో మరో మలుపుగా మారింది. 

అసలు విషయం: 

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. అయితే ఆమె పాకిస్తాన్లో అడుగుపెట్టిన అనంతరం పాకిస్తాన్ పోలీస్ కస్టడీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనకి లీగల్ గా పాస్పోర్ట్ కూడా ఉండడం వల్ల అక్కడ పాకిస్తాన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారు.  అంజు కలవడానికి వెళ్ళిన తన ప్రియుడు నస్రుల్లా వైద్య రంగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తాను పాకిస్తాన్ వెళ్ళింది కేవలం ఆ దేశాన్ని చూడడానికే అంటూ, తన స్నేహితుడు అయిన నస్రుల్లాను పెళ్లి చేసుకోవడానికి కాదు అని విచారణలో తెలిసింది.

సీనియర్ పోలీసు అధికారి ముష్తాక్ ఖాబ్ మరియు స్కౌట్స్ మేజర్ ద్వారా, అంజు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసిన తరువాతే, అంజుని అదేవిధంగా ఆమె స్నేహితుడిని విడుదల చేసినట్లు దిర్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. 

అంజు వాళ్ళ నాన్న ఏమన్నారు: 

అంజు వాళ్ళ తండ్రి గయా ప్రసాద్ థామస్, అంజు గురించి మాట్లాడుతూ, తనకి పాకిస్తాన్ వెళ్ళిన విషయం ఆలస్యంగా తెలిసిందని, అంజు వాళ్ళ తమ్ముడు చెప్పిన తర్వాతే, అంజు పాకిస్తాన్ వెళ్లినట్లు తెలిసింది అని పేర్కొన్నాడు. అయితే అంజూని మూడేళ్ల వయసున్నప్పుడు నుంచి, అంజి వాళ్ళ అంకుల్ తనని పెద్ద చేసినట్లు చెప్పాడు. అయితే పెళ్లయిన తర్వాత, ఆమె తన భర్తతో రాజస్థాన్ వెళ్ళిపోయిన తరువాత 20 సంవత్సరాలుగా ఆమెతో మాట్లాడలేదు అని కూడా చెప్పాడు. కాకపోతే, ఆమె కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టు, ఆమె ప్రవర్తన అతనికి కూడా అప్పుడప్పుడు సరిగా లేనట్లు గమనించినట్లు చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లడం అంజు చేసిన తప్పే, కానీ ఆమె పాకిస్తాన్ వెళ్లడంలో కేవలం మరే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు అని, తన స్నేహితుడిని కలవడానికి తప్పిస్తే తను ఏ తప్పు చెయ్యదు అని తండ్రిగా నమ్మకంతో చెప్పాడు థామస్. 

అయితే అంజూని తన భర్త చాలా బాగా చూసుకుంటాడని అంతేకాకుండా అంజు భర్త చాలా నెమ్మదస్తుడు అని చెప్పుకొచ్చాడు. కేవలం తన ప్రవర్తన అప్పుడప్పుడు బాగోకపోవుండొచ్చు కానీ, తాను పెద్ద తప్పు చేసే అమ్మాయి కాదు అని తెగేసి చెప్పాడు. అయితే అంజు ఇంటర్ వరకు చదువుకున్నట్లు ఆ తర్వాత ఒక ఉద్యోగం కూడా చేసినట్లు చెప్పాడు.

అంజు ఫ్రెండ్ ఏమంటున్నాడు: 

అయితే 2019 వ సంవత్సరం నుంచి అంజుకి తన పాకిస్తాన్ ఫ్రెండ్ తో పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అంజు గురించి వార్తలు వినిపించిన అనంతరం, అంజు ఫేస్బుక్ ఫ్రెండ్ నసురుల్లా మాట్లాడుతూ, తనకు అంజని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. కేవలం అంజు పాకిస్తాన్ చూడ్డానికి మాత్రమే వచ్చిందని పేర్కొన్నాడు.  అంజు తిరిగి ఆగస్టు 20వ తారీకున ఇండియా తిరిగి వస్తుందని, ప్రస్తుతం ఆమె తమ కుటుంబ సభ్యులలో ఉండే ఆడవారితో కలిసి ఉందని చెప్పుకొచ్చాడు అంజు ఫేస్బుక్ ఫ్రెండ్ నసురుల్లా.