లక్నో ‘రాకెట్ ఉమెన్’ గురించి మీకు తెలుసా?

నాలుగు సంవత్సరాల తర్వాత చంద్రుడు మీదకి చంద్రయాన్ 3 మిషన్ పంపించడం జరిగింది. అయితే చంద్రయాన్-3 సంబంధించిన డైరెక్టర్, ‘రాకెట్ ఉమెన్’ రీతు కరిదాల్, సైంటిస్ట్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. లక్నో కి చెందిన ఈమె అంచనంచెలుగా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ గా అదిగింది.  రీతు కరిదాల్ గురించి మరింత:  రీతూ కరిధాల్ లక్నోలో పుట్టి పెరిగింది. లక్నో యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో […]

Share:

నాలుగు సంవత్సరాల తర్వాత చంద్రుడు మీదకి చంద్రయాన్ 3 మిషన్ పంపించడం జరిగింది. అయితే చంద్రయాన్-3 సంబంధించిన డైరెక్టర్, ‘రాకెట్ ఉమెన్’ రీతు కరిదాల్, సైంటిస్ట్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. లక్నో కి చెందిన ఈమె అంచనంచెలుగా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ గా అదిగింది. 

రీతు కరిదాల్ గురించి మరింత: 

రీతూ కరిధాల్ లక్నోలో పుట్టి పెరిగింది. లక్నో యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదువుకుంది. తర్వాత ఆమె భారత అంతరిక్ష సంస్థ ఇస్రోలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఏరోస్పేస్‌లో నిపుణురాలు. మంగళయాన్ మిషన్‌లో రీతూ కరిధాల్ కూడా తమ వంతు కృషి చేశారు. ఆమె మార్స్ మిషన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు ఆమె ముఖ్యమైన స్పేస్ మిషన్‌కు చంద్రయాన్-3 నాయకత్వం వహిస్తున్నారు. 

ఈ ముఖ్యమైన చంద్రయాన్-3 మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నది భారతదేశపు రాకెట్ ఉమెన్, రీతూ కరిధాల్ శ్రీవాస్తవ.రీతూ కరిధాల్ యంగ్ సైంటిస్ట్ అవార్డు, ఇస్రో టీమ్ అవార్డు, ASI టీమ్ అవార్డు, సొసైటీ ఆఫ్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీస్ అందించిన ఏరోస్పేస్ ఉమెన్ అవార్డు, అంతేకాకుండా మరెన్నో అనేక అవార్డులను అందుకున్నారు. ఆమె సుమారు 1997 నుంచి ఇస్రో తరపున పని చేస్తున్నారు. 

చంద్రయాన్-3 గురించి ఆసక్తికరమైన విషయాలు: 

అయితే భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పడుతుంది అంటున్నారు సైంటిస్టులు. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టబోతోంది అని అంటున్నారు. 

అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేస్తారు. అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద భూమిపైన కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. 

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి మరి చెప్తున్నారు. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈసారి నింగిలోకి ఎగసిన ఇస్రో మిషన్ చంద్రయాన్ 3 ఆగస్టు 23న చందమామ మీదకి వెళ్లి, తన పనిని చక చక పూర్తిచేసుకుని, సురక్షితంగా భారతదేశంలో అడుగు పెట్టాలని కోరుకుందాం.