ప్రియుడి కోసం పాక్ వెళ్లిన భారతీయ మ‌హిళ‌

ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మధ్య మొదలవుతుందో చెప్పడం అసాధ్యం. అయితే ఆ ప్రేమ అనేది ఎంతలా అంటే ఒక్కోసారి ప్రాణాలు తీసేలా లేదా ప్రాణాలు తీసుకునేలా ఉంటే.. మరొకసారి ఆ ప్రేమ అయినా వాళ్లను కూడా కాదనుకొని.. బంధాలను తెగదింపు చేసుకొని  ఎల్లలు దాటేలా కూడా చేస్తూ ఉంటుంది. అందుకే చాలామంది స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఆ ప్రేమలో విఫలం అవుతూ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారు. […]

Share:

ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎవరి మధ్య మొదలవుతుందో చెప్పడం అసాధ్యం. అయితే ఆ ప్రేమ అనేది ఎంతలా అంటే ఒక్కోసారి ప్రాణాలు తీసేలా లేదా ప్రాణాలు తీసుకునేలా ఉంటే.. మరొకసారి ఆ ప్రేమ అయినా వాళ్లను కూడా కాదనుకొని.. బంధాలను తెగదింపు చేసుకొని  ఎల్లలు దాటేలా కూడా చేస్తూ ఉంటుంది. అందుకే చాలామంది స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ మరి కొంతమంది ఆ ప్రేమలో విఫలం అవుతూ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈ క్రమంలోనే పబ్జి , ఫేస్ బుక్ ప్రేమ కథ ఎల్లలు దాటేలా చేసింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పబ్ జీ గేమ్ లో పరిచయమైన ఒక యువకుడి కోసం ఇటీవల సీమా అనే ఒక మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భర్తను కూడా కాదని పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ ఘటన ఇంకా మరువక ముందే ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకోవడం పలు సంచనాలను దారితీస్తోంది. అయితే ఈసారి పాకిస్తాన్ నుంచి కాదు కానీ భారత్ నుంచే ఒక మహిళ తన ప్రియుడు కోసం పాకిస్తాన్ వెళ్లడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.  అసలు విషయంలోకెళితే రాజస్థాన్ లోని అల్వాల్ జిల్లాలో ఉన్న భివాడి ప్రాంతంలో అంజు, అరవింద్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి 15 సంవత్సరాల కూతురు అలాగే ఆరు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నారు.

అయితే 34 సంవత్సరాల వయసున్న అంజు కొన్ని నెలల క్రితం ఫేస్ బుక్ లో పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా అనే 29 ఏళ్ల యువకుడితో పరిచయం పెంచుకుంది. అప్పుడప్పుడు ఫేస్ బుక్ లో మాట్లాడుకోవడం చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. ఇకపోతే నస్రుల్లా పాకిస్తాన్లో ఔషధ రంగంలో పనిచేస్తున్నాడు. ఎలాగైనా సరే అంజు ప్రియుడి కలుసుకోవాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా గురువారం వాయువ్య పాకిస్తాన్లోని ఖైధర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఉన్న అప్పర్ దిర్ జిల్లాకు వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు కానీ అంజు మాత్రం వీసా తో పాటు పాకిస్తాన్ కి వెళ్లడానికి కావలసిన అన్ని పత్రాలను కూడా చూపించింది. దీంతో పోలీసులు ఆమెను విడిచిపెట్టారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన చెప్పాలి భర్త పిల్లలను కాదని అంజు ఒక పాకిస్తాన్ వ్యక్తి కోసం వెళ్లడం నిజంగా ఆశ్చర్యకరమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

అయితే ఇలాంటిదే మరొక ఘటన కూడా చోటుచేసుకుంది ఇటీవల పోలాండ్ కు చెందిన ఒక మహిళ కూడా ఝార్ఖండ్ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అప్పటికే ఆరేళ్ల కుమార్తె ఉన్న పోలాండ్ మహిళ అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఝార్ఖండ్ వచ్చేసింది ఇలా ఈమధ్య చాలామంది యువతులు ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్,  పబ్జి అంటూ వాటిలో పరిచయం పెంచుకొని ప్రియుడు లేదా ప్రియురాలు కోసం ఎల్లలు దాటుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.