ఆంధ్ర తెలంగాణలో బయటపడిన మైనారిటీ స్కాలర్షిప్ స్కామ్

తెలుగు రాష్ట్రాలలో స్కాలర్షిప్స్ స్కాం కలకలం రేపుతోంది. మైనారిటీలకు అందవలసిన స్కాలర్షిప్ దుర్వినియోగం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని కళాశాలలకు వేటు వేసింది సిబిఐ. సిబిఐ దర్యాప్తులో సుమారు 11 కళాశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండగా, మరో 59 కళాశాలలో స్టాంప్ జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలో బయటపడ్డాయి. మైనారిటీ స్కాలర్షిప్ స్కామ్:  తెలంగాణలో పదకొండు సంస్థలు మరియు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఐదు సంస్థలు మైనారిటీ స్కాలర్‌షిప్ పథకాలలో అవకతవకలు చేసినట్లు ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. […]

Share:

తెలుగు రాష్ట్రాలలో స్కాలర్షిప్స్ స్కాం కలకలం రేపుతోంది. మైనారిటీలకు అందవలసిన స్కాలర్షిప్ దుర్వినియోగం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని కళాశాలలకు వేటు వేసింది సిబిఐ. సిబిఐ దర్యాప్తులో సుమారు 11 కళాశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండగా, మరో 59 కళాశాలలో స్టాంప్ జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలో బయటపడ్డాయి.

మైనారిటీ స్కాలర్షిప్ స్కామ్: 

తెలంగాణలో పదకొండు సంస్థలు మరియు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఐదు సంస్థలు మైనారిటీ స్కాలర్‌షిప్ పథకాలలో అవకతవకలు చేసినట్లు ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే మరింత దర్యాప్తు చేయగా, 2017 మరియు 2022 మధ్య మైనారిటీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నుండి మొత్తం రూ. 144 కోట్ల నిధులను దారి మళ్లించినందుకు ప్రపంచవ్యాప్తంగా 830 సంస్థలపై cbi మంగళవారం ఫిర్యాదులు దాఖలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో 11 మరియు తెలంగాణలో 59 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ మైనారిటీ స్కాలర్షిప్ స్కాం లో ఉన్నట్లు తెలుస్తోంది.

స్కామ్ ఎలా బయటపడింది?: 

ఢిల్లీలోని సిబిఐకి ఫిర్యాదు చేసిన మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఇండెవర్ పాండే అందించిన సమాచారం ప్రకారం, అనేక సంస్థలు చాలావరకు తమ వైపు నుంచి బోగస్ కాగితాలను సమర్పించి డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్, అదేవిధంగా కొన్ని నకిలీ కాగితాలను నిజమైనవిగా మార్చడం వంటి ఇతర నేరాలను ఆరోపణ ఆధారంగా సిబిఐ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది.

మైనారిటీస్ స్కాలర్షిప్ ఎవరికి చెందుతుంది: 

ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్, మరియు మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్‌లను ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలుగా గుర్తించే విద్యార్థులకు మంత్రిత్వ శాఖ అందచేయడం జరుగుతుంది. 1.8 లక్షలకు పైగా యూనివర్సిటీల్లో చేరిన మైనారిటీ విద్యార్థులకు ఈ మైనారిటీ స్కాలర్‌షిప్‌లు అందజేస్తుంటారు. గత ఐదేళ్లలో ప్రతి సంవత్సరం, 2021 నుండి 2022 వరకు, 65 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుకోవడమైతే జరిగినట్లు తెలుస్తోంది.

స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, NCAER-నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్‌ని నియమించుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా, ఇది ఎంతమంది స్కాలర్షిప్ అనేది తీసుకుంటున్నారు అనే విషయం గురించి తెలుసుకోవడానికి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే, చాలా వరకు విద్యాసంస్థలు తమ విద్యార్థులకు రావలసిన మైనారిటీస్ స్కాలర్షిప్ లను అందించేశామని నకిలీ పత్రాలను సమర్పించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దర్యాప్తు ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే, నిజానికి కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించకుండానే, మైనారిటీ స్కాలర్షిప్ నిధుల ద్వారా వచ్చే పెద్ద మొత్తంలో డబ్బును విద్యాసంస్థలు కాజేసినట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా కొన్ని విద్యాసంస్థలు కేవలం రిజిస్టర్ చేసుకుని, నకిలీ పత్రాలను సమర్పించి, నకలి స్టూడెంట్స్ లిస్ట్ ద్వారా స్కాలర్షిప్ లకు అప్లై చేసి, డబ్బును ఈ విధంగా కూడా కాజెయడం జరిగింది. అంతేకాకుండా ఈ దర్యాప్తు ప్రకారం సుమారు 21 రాష్ట్రాలకు చెందిన 1,572 సంస్థలలో 830 సంస్థలు బోగస్ అని తేలింది. 

నిరాశలో విద్యార్థులు: 

ఇలా కొన్ని సంస్థలు చేసిన అవకతవకలు కారణంగానే, మైనారిటీ విద్యార్థులకు సక్రమంలో అందవలసిన స్కాలర్షిప్లు అందక, చాలామంది తమ విద్యను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని మైనారిటీ విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం అందిస్తున్న ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్న పెద్దపెద్ద విద్య సంస్థల మీద తీవ్రంగా మండిపడుతోంది ప్రభుత్వం. అంతేకాకుండా సిబిఐ దర్యాప్తు ద్వారా బయటపడ్డ బోగస్ విద్యా సంస్థలకు తప్పకుండా శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు.