‘భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న ‘మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్’

భారత దేశ ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ప్రజలతో కలిసి మమేకం అవడం కోసం,  తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ‘మన్ కీ బాత్’ అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు. మొదటి ఎపిసోడ్ నుంచి విశేష ఆదరణ పొందిన ఈ ప్రోగ్రాం రేడియోలో  నెలవారీ  ప్రసారం చేయబడుతుంది. 2014 అక్టోబర్ 3 న ప్రారంభం అయినా ఈ ‘మన్ కీ బాత్’ ఇప్పుడు 100 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం […]

Share:

భారత దేశ ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ప్రజలతో కలిసి మమేకం అవడం కోసం,  తాను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ‘మన్ కీ బాత్’ అనే ప్రోగ్రాం మొదలుపెట్టారు. మొదటి ఎపిసోడ్ నుంచి విశేష ఆదరణ పొందిన ఈ ప్రోగ్రాం రేడియోలో  నెలవారీ  ప్రసారం చేయబడుతుంది. 2014 అక్టోబర్ 3 న ప్రారంభం అయినా ఈ ‘మన్ కీ బాత్’ ఇప్పుడు 100 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలవారీ రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం చేయబడుతుంది, దీనితో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన కార్యక్రమాన్ని లక్షల మంది ప్రజలు వింటారని భావిస్తున్నారు. అయితే ఈ మన్ కి బాత్ ప్రోగ్రాంకి ఇప్పుడు విశేషమైన గుర్తింపు లబించనున్నది. ప్రతిష్ట్మాకమైన 100 వ ఎపిసోడ్ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో  ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఇది చారిత్రాత్మక క్షణం అవుతుంది. మహిళలు, యువకులు, రైతులు వంటి బహుళ సామాజిక వర్గాలను ఉద్దేశించి ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ కార్యక్రమానికి కీలక స్తంభంగా మారి సమాజ చర్యను ప్రోత్సహించింది.

మన దేశంలో ఉన్న 22 భాషలతో పాటు గా ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియా, అరబిక్, లాంటి భాషలలో సహా మరో 11 విదేశీ భాషలలో ప్రసారం చేయబడుతుంది. ఈ ప్రోగ్రాంని ఆల్ఇండియా రేడియోకు చెందిన 500 కి పైగా ప్రసార కేంద్రల ద్వారా మన్ కీ బాత్ ప్రసారం అవుతుంది. మన దేశంలో ఉన్న 100 కోట్ల కు పైన ఉన్న ప్రజలు కనీసం ఒక్క సారైనా ఈ ప్రోగ్రాంకి కనెక్ట్ అయి ఉంటారు. ప్రధాన మంత్రి నేరుగా ప్రజలతో మాట్లాడుతుంటారు. మొదట్లో కొంచెం నెగటివ్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత కాలంలో ఈ ప్రోగ్రాం అట్టడుగు స్థాయి మార్పు చేసేవారిని, ప్రజల విజయాలను జరుపుకుంటూ ప్రజలను సానుకూల చర్యల వైపు ప్రభావితం చేసిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మన్ కీ బాత్, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం, నీటి సంరక్షణ, స్థిరత్వంతో సంబంధం ఉన్న ఐదు కీలక అంశాలను పరిశోధన నివేదిక గుర్తించింది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను చిరస్మరణీయమైన సందర్భంగా మార్చడానికి బీజేపీ భారీ ప్రచారాన్ని ప్లాన్ చేసింది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినే విధంగా సౌకర్యాలు కల్పించాలని పార్టీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మన దేశంలో ఉన్న ప్రతి రాజ్ భవన్ లోనూ ఈ ప్రోగ్రాంని దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. బుధవారం జరిగిన నేషనల్ కాన్‌క్లేవ్‌కు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన అద్వితీయమైన ప్రయోగం మన్ కీ బాత్ అని అన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరైన ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ యొక్క 100 ఎపిసోడ్‌లను గుర్తుచేసే స్టాంప్, నాణేలను విడుదల చేశారు. ‘మన్ కీ బాత్’ తన 100వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకున్నందున, ఇది ‘ఇండియా @ 100’కి పునాది అవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను టచ్ చేస్తూ జనాల్లో సామాజిక స్పృహ కలిగేలాగా, ప్రతీ అంశంపై జనాల్లో చైతన్యం కలిగించే విధంగా ఈ ప్రోగ్రాం ఉంటుందట. ఇప్పటి వరకు ఎవరైనా ఈ ప్రోగ్రాంని మిస్ అయ్యి ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఫాలో అవడం ప్రారంభించండి.