Manish Sisodia: మ‌నీష్ సిసోడియాని ఎల్లకాలం జైలులో ఉంచలేం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కొత్త ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ మరియు ఈడీ అనేక మందిని అరెస్ట్ చేశాయి. ఈ అనేక మందిలో ఢిల్లీలో గవర్నమెంట్ లో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి) (AAP) చెందిన అనేక మంది ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించిన మ‌నీష్ సిసోడియా (Manish Sisodia) కూడా ఉన్నారు. ఆయనను (Manish Sisodia) కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన […]

Share:

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కొత్త ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ మరియు ఈడీ అనేక మందిని అరెస్ట్ చేశాయి. ఈ అనేక మందిలో ఢిల్లీలో గవర్నమెంట్ లో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి) (AAP) చెందిన అనేక మంది ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించిన మ‌నీష్ సిసోడియా (Manish Sisodia) కూడా ఉన్నారు. ఆయనను (Manish Sisodia) కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి ఈడీ మనీష్ సిసోడియా (Manish Sisodia)ను జైలులోనే ఉంచింది. అతడికి బెయిల్ ఇవ్వకుండా జైలులోనే అతడిని విచారిస్తోంది. దీంతో ఆప్ ప్రభుత్వ పెద్దలు కంగారు పడుతున్నారు. మ‌నీష్ సిసోడియా (Manish Sisodia)ను ఎన్ని రోజులు ఇంకా జైలులో ఉంచుతారని ఆందోళన చెందుతున్నారు. అతడి అరెస్ట్ మీద సుప్రీం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. 

కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం 

మనీష్ సిసోడియా (Manish Sisodia) ను అనేక రోజుల నుంచి ఈడీ రిమాండ్ లోనే ఉంచి విచారిస్తోంది. అతడి రిమాండ్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆప్ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) ను ఎల్ల కాలం జైలులో ఉంచలేమని సీబీఐ, ఈడీకి సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సిసోడియాపై అభియోగాలపై ట్రయల్ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయని రెండు దర్యాప్తు సంస్థల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (Solicitor General) ఎస్వీ రాజును ప్రశ్నించింది. మీరు అతడిని (Manish Sisodia) ఏం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నించింది. అతడిని ఎల్లకాలం జైలులోనే ఉంచుదాం. అనుకుంటున్నారా.. అది మాత్రం కుదరదు అంటూ వ్యాఖ్యానించింది. మీరు అతన్ని ఎల్లప్పటికీ కటకటాల వెనుక ఉంచలేరని సుప్రీం (Supreme Court) తెలిపింది. 

వాదనలు వెంటనే ప్రారంభించాలి..

ఒక కేసులో వాదనలకు సంబంధించి సుప్రీం పలు సూచనలు చేసింది. ఈ విషయంపై సుప్రీం (Supreme Court) న్యాయవాదులు మాట్లాడుతూ.. ఒక కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, వాదనలు వెంటనే ప్రారంభించాలని బెంచ్ (Bench) వ్యాఖ్యానించింది. సిసోడియా (Manish Sisodia) పై కేసులు సీఆర్‌పీసీ సెక్షన్ 207 దశలో ఉన్నాయని, ఆ తర్వాత అభియోగంపై వాదనలు ప్రారంభమవుతాయని సీవీ రాజు (CV Raju) ధర్మాసనానికి తెలిపారు. ఆరోపణపై వాదనలు ఎందుకు ఇంకా ప్రారంభం కాలేదు, అవి ఎప్పుడు ప్రారంభమవుతాయి? అని సుప్రీం (Supreme Court) రాజును ప్రశ్నించింది. తమకు ఈ విషయంపై మంగళవారం సమాధానం చెప్పాలని జస్టిస్ ఖన్నా ఎస్వీ రాజుకు తెలిపారు. సీబీఐతో పాటుగా ఈడీ దాఖలు చేసిన కేసుల్లో మనీష్ సిసోడియా (Manish Sisodia) కు బెయిల్ మంజూరు విషయంపై సుప్రీంలో విచారణలు కొనసాగాయి. ఈ విచారణ గంటపాటు జరిగింది. 

కుట్రను చూపేందుకు అవి ఉన్నాయి.. 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) నేరం చేశాడని చూపేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సోలిసిటర్ జనరల్ రాజు సుప్రీంకు (Supreme Court) తెలిపారు. పాలసీ మార్పుల కారణంగా వినియోగదారులు డబ్బును కోల్పోయారని అతడు తెలిపాడు. సిసోడియా (Manish Sisodia) మనీలాండరింగ్ కుట్రను చూపించడానికి వాట్సాప్ చాట్‌ లు మరియు ఇతర కమ్యూనికేషన్‌లు ఉన్నాయని రాజు వాదించారు. అతడికి (Manish Sisodia) ఎట్టిపరిస్థితుల్లో కూడా బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు. మనీలాండరింగ్ నేరం బయటపడకుండా ఉండేందుకు సిసోడియా (Manish Sisodia) తన ఫోన్‌ లను ధ్వంసం చేశాడని, తద్వారా సాక్ష్యాలను తారుమారు చేశారని రాజు ఆరోపించారు. 

అప్పటి నుంచి జైలులోనే.. 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా అంతే కాకుండా ఢిల్లీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా (Manish Sisodia) ను సీబీఐ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor Scam) లో సీబీఐ ఆయన్ను (Manish Sisodia) అదుపులోకి తీసుకుంది. ఆయన అప్పటి నుంచి రిమాండ్ (Remand) ఖైదీగానే కొనసాగుతున్నారు. అతడిని కేంద్ర దర్యాప్తు సంస్థలు వదలడం లేదు. కేవలం సీబీఐ మాత్రమే కాకుండా ఈడీ కూడా అతడి మీద పలు అభియోగాలు మోపింది. అతడిని మార్చి 9 వ తేదీన తీహార్ (Thihar) జైలులో విచారించిన తర్వాత ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. సీబీఐ అరెస్ట్ చేయడంతో ఫిబ్రవరి 28వ తేదీన ఢిల్లీ ప్రభుత్వ మంత్రివర్గం నుంచి సిసోడియా రాజీనామా చేశారు. ఉపముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన ఆయన ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మే 30వ తేదీన సీబీఐ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. దీంతో సిసోడియాకు మరిన్ని రోజుల జైలు జీవితం తప్పలేదు. జూలై 3న మరోసారి కూడా న్యాయస్థానం అతడి (Manish Sisodia) బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ గవర్నమెంట్ కొత్త ఎక్సైజ్ పాలసీని నవంబర్ 17 2021లో అమల్లోకి తీసుకొచ్చింది. కానీ దానిలో అనేక లోపాలున్నాయని సెప్టెంబర్ 2022 చివర్లో దానిని రద్దు చేసింది.