మ‌ణిపూర్ సీఎం రాజీనామా ప‌త్రం చించివేత‌

మణిపూర్ లో ఈమధ్య కాలం లో జరిగిన కొన్ని హింసాత్మక చర్యలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నట్టుగా నేషనల్ మీడియా లో వార్తలు వచ్చాయి. ఆయన మణిపూర్ గవర్నర్ అనసూయ ఉకియ్ ని కలిసి తన రాజీనామా లేఖని ఇవ్వబోతున్నట్టు, అందుకు ఆయన రాజ్ భావం కి బయలుదేరినట్టుగా కూడా వీడియోలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈ వార్త బయటకి వచ్చిందో అప్పటి నుండి బైరెన్ సింగ్ మద్దతుదారుల నుండి […]

Share:

మణిపూర్ లో ఈమధ్య కాలం లో జరిగిన కొన్ని హింసాత్మక చర్యలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నట్టుగా నేషనల్ మీడియా లో వార్తలు వచ్చాయి. ఆయన మణిపూర్ గవర్నర్ అనసూయ ఉకియ్ ని కలిసి తన రాజీనామా లేఖని ఇవ్వబోతున్నట్టు, అందుకు ఆయన రాజ్ భావం కి బయలుదేరినట్టుగా కూడా వీడియోలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే ఈ వార్త బయటకి వచ్చిందో అప్పటి నుండి బైరెన్ సింగ్ మద్దతుదారుల నుండి తీవ్రమైన నిరసన జ్వాలలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యడానికి వీలు లేదు అంటూ ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. అభిమానులు మరియు కార్యకర్తల నిరసన జ్వాలలను చూసి జంకిన బైరెన్ సింగ్ తానూ రాజీనామా చెయ్యలేదని, ఎవరో కావాలని నాపై దుష్ప్రచారం చేసారంటూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

దుష్ప్రచారాలు అంటూ కొట్టిపారేసిన ముఖ్యమంత్రి :

మరి రాజీనామా చేసే ఉద్దేశ్యం లేకపోతే ఈ సమయం లో గవర్నర్ తో భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది? అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ప్రశ్నిస్తున్నారు. మరోపక్క బైరెన్ సింగ్ రాజీనామా రాసిన లేఖ ని చింపిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆయన రాజీనామా చేసే ఉద్దేశ్యం తోనే రాజ్ భవన్ కి వెళ్లాడని, కానీ అక్కడ అభిమానులు వేలాదిగా చేరుకొని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మేము ఒప్పుకోము, ఆయనని ఇక్కడి నుండి రాజీనామా చేసి  ఎలా బయటకి వేళ్తాడో మేము కూడా చూస్తాము అంటూ ఛాలెంజ్ విసిరారు. రాజ్ భవన్ ప్రాంగణం మొత్తం ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం తో బైరెన్ సింగ్ రాజీనామా  చేసే ఆలోచనని  ఉపసంహరించుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. అసలు మణిపూర్ లో ఇలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాము.

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే:

మణిపూర్ లో మొయితీలు మెజారిటీ గా, కుకీలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. అయితే ఈమధ్య కాలం లో తమని కూడా మైనారిటీ సెక్షన్ లోనే పరిగణించాలని మొయితీలు చాలా కాలం నుండి పోరాటం చేస్తున్నారు. అయితే మే 3 వ తారీఖున మొయితీలు గిరిజనులకు సంఘీభావం గా ఒక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ పై మొయితీలు రాళ్లు విసిరారు, అక్కడి నుండే ఈ గొడవలకు భీజం పడింది. స్థానిక నేతలపై తిరగబడి వాళ్ళ ఇళ్లకు నిప్పు అంటించడం  , వాళ్ళ పై సమూహం మొత్తం కలిసి దాడులు చెయ్యడం వంటివి ప్రతీ రోజు జరుగుతూనే ఉండేవి. రోజు రోజుకి పెరిగిపోతూ వెళ్తున్న ఈ హింసాత్మక సంఘటనలను అదుపు చెయ్యడానికి పోలీసుల వల్ల కూడా కాలేదు. దీనితో ప్రభుత్వం నేరుగా ఆర్మీ ని దింపింది, అయినప్పటికీ కూడా పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. రెండు నెలల నుండి విరామం లేకుండా సాగుతున్న ఈ అల్లర్లలో 120 మందికి పైగా చనిపోయారు. చివరికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన కూడా ఇప్పటికీ అక్కడ శాంతికరమైన వాతావరణం చోటు చేసుకోలేదు. సగటు సామాన్య మనిషి బయట ప్రశాంతం గా తిరగలేని పరిస్థితి. దీనితో బీజేపీ పార్టీ అధిష్టానమే బైరెన్ సింగ్ ని రాజీనామా చెయ్యమని ఆదేశించడం తో అతను రాజీనామా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ అల్లర్లు ఆగేది ఎప్పుడో చూడాలి.