లైవ్‌ మర్డర్‌.. వివాహితను వేధిస్తున్నాడని యువకుడి హత్య

తమ కుటుంబానికి చెందిన బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి.. నడిరోడ్డుపై నరికి చంపిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రాంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కాగా ఈ దారుణ హత్య నడి రోడ్డుపై జరుగుతున్న సమయంలో గ్రామ ప్రజలు మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది. స్థానికులు, […]

Share:

తమ కుటుంబానికి చెందిన బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి.. నడిరోడ్డుపై నరికి చంపిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రాంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

కాగా ఈ దారుణ హత్య నడి రోడ్డుపై జరుగుతున్న సమయంలో గ్రామ ప్రజలు మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం మహేశ్(28) అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. అయితే గత సంవత్సరం యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆ యువతికి వివాహం జరిపించారు. దీంతో యువతిపై కక్ష్య పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా ఉన్నవీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే యువతి భర్తకు కూడా పంపించినట్లు తెలిసింది.

దీంతోె ఈరోజు ఉదయం బాధితుడు ముస్కే మహేష్ బైక్‌పై వస్తుండగా నిందితుడు కంకయ్య, అతని కుటుంబ సభ్యులు అతనిని అడ్డగించి సుమారు ఉదయం 8:30 గంటల సమయంలో మహేష్‌పై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులందరూ మహేష్‌పై పలుమార్లు బండరాయితో కొట్టి గొంతు కోశారు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కాగా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న అమ్మాయిని మహేష్ వేధిస్తున్నాడని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి ప్రేమ పేరుతో వేధించేవాడన్నారు. వేధింపులు భరించలేక ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఇందారం పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు కూడా నమోదైంది. అటు గతంలో పోలీసు అధికారులు కూడా అతనికి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసినప్పటికీ మహేష్.. ఆమెను వేధిస్తూనే ఉన్నట్లు సమాచారం. 

మహేష్‌ని పలుమార్లు హెచ్చరించినప్పటికి తనలో మార్పు రాలేదన్నారు. దీంతో ఆగ్రహం చెందిన కుంటుంబీకులు ఈ దారుణ హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా జరిగిన స్థాలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు.ఈ దారుణ పై కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మహేశ్‌ను చంపిన నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు. కాగా ప్రేమ పేరుతో బాధితుడు మహేశ్‌తో ఆ యువతి భారీగా డబ్బు ఖర్చు పెట్టించిందని బందువులు ఆరోపించారు.

కాగా స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. మహేశ్‌కు, ఆ మహిళకు గతంలో అక్రమ సంబంధం ఉందన్నారు. ఆరు నెలల క్రితం కుటుంబసభ్యులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. మహిళతో సన్నిహితంగా గడిపిన కొన్ని వీడియోలు, చిత్రాలను మహేష్ అప్‌లోడ్ చేయడంతో మనస్తాపానికి గురైన మహిళ భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త మరణం తర్వాత ఆ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మహేష్ ఆమెను వేధించడం కొనసాగించాడు. వారి ప్రైవేట్ వీడియోలను ఇతరులతో పంచుకున్నాడు. దీన్ని తట్టుకోలేక మహిళ, ఆమె కుటుంబ సభ్యులు అతడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.