కోర్టులో చేయికోసుకున్న యువ‌కుడు

కేరళలో ఒక తండ్రి తన కూతుర్ని, విష్ణు అనే అబ్బాయి నిర్బంధిస్తున్నాడని, తన మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టులో తమ వైపు నుంచి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి.. ఆ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న విష్ణు అనే అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటి: కేరళకు చెందిన విష్ణు అనే అబ్బాయి, ఒక అమ్మాయి తో ఒక నెల రోజుల […]

Share:

కేరళలో ఒక తండ్రి తన కూతుర్ని, విష్ణు అనే అబ్బాయి నిర్బంధిస్తున్నాడని, తన మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టులో తమ వైపు నుంచి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి.. ఆ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న విష్ణు అనే అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

అసలు విషయం ఏమిటి:

కేరళకు చెందిన విష్ణు అనే అబ్బాయి, ఒక అమ్మాయి తో ఒక నెల రోజుల నుంచి కలిసి ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయి తండ్రి, విష్ణు మీద కోర్టులో హబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తాడు. 

దీనికి సంబంధించిన విచారణ, ఈ సోమవారం నాడు జరగగా, బెంచ్ అమ్మాయి నిర్ణయాన్ని అడగడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి విష్ణు మీద అసలు ఎటువంటి ఫీలింగ్స్ లేవని, విష్ణుని కేవలం ఒక సోదర భావంతోనే చూశానని, ఆ అమ్మాయి చెప్పడం జరిగింది.

అయితే కేవలం, ఆ అమ్మాయి తనతో కలిసి ఉండకపోతే చనిపోతాను అని బెదిరించడం కారణంగానే.. ఆ అమ్మాయి విష్ణుతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ప్రకారం, విష్ణుకి ఇంతకుముందే వేరే అమ్మాయితో వివాహం జరిగిపోయిందని, తమ భార్యాభర్తల బంధం కాస్త అటు ఇటుగా ఉందని.. ఇప్పుడు ఈమె మాత్రమే తనకి ముఖ్యమని విష్ణు చెప్పినట్లు, అమ్మాయి వెల్లడించింది.

అంతేకాకుండా ప్రస్తుతం తాను తన తల్లిదండ్రులతోనే ఉండేందుకు ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టులో జరిగిన వాదనలు అనంతరం, విష్ణు తన మణికట్టున కోసుకుంటుండగా పోలీసులు ఆపి, తనని వెంటనే లోకల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.

ఇటీవల లివ్ ఇన్ రిలేషన్ గురించి మాట్లాడిన కోర్టు:

నిజానికి యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఎక్కువ ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలు కేవలం కొంతకాలం మాత్రమే అని, ముఖ్యంగా యువత ఇటువంటి బంధాల వైపు మక్కువ చూపుతూ, ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నట్లు మండిపడింది హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలలో ప్రత్యేకించి భద్రత, సామాజిక అంగీకారం మరియు స్థిరత్వం వంటివి కనిపించవని కేవలం అవి పెళ్లి బంధం లోనే ఉంటాయని తేల్చి చెప్పింది బెంచ్. 

మరి ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటివి ఎక్కువ అవ్వడం అనేది సొసైటీకి మంచిది కాదని, ఒక ఆరోగ్యమైన సొసైటీ పొందాలి అనుకుంటే ఇటువంటి బంధాలకు దూరంగా ఉండడం మంచిదని హైకోర్టు సలహా ఇచ్చింది. అయితే ఇటువంటి బంధాలు అనేవి, ఇతర దేశాలలో ఉన్నప్పటికీ ఆ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, లివ్ ఇన్ రిలేషన్షిప్ వంటివి ఎక్కువ కావడం వల్ల, వాటిల్లే సమస్యల కారణంగా యువత తమ జీవితాలను స్వయంగా నాశనం చేసుకుంటున్నారని, అందుకే అటువంటి బంధాలు వైపు ఆకర్షితుల అవ్వకుండా చూసుకోవాలని చెప్పింది అలహాబాద్ హైకోర్టు. 

దేశంలో ఇదే విధమైన ధోరణితో, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. వివాహ బంధంలో భాగస్వామి విశ్వాసం మరియు స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా మారతాయని.. యువత మాత్రం తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం చూస్తుందని, దీర్ఘకాలంలో ఏర్పడే సమస్యలను పట్టించుకోకపోవడం మరో సమస్యగా మారుతుందని, హైకోర్టు తేల్చి చెప్పింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న యువత పెద్దగా చదువుకుని మంచి స్థానాల్లోకి వెళ్తున్నప్పటికీ, ఇటువంటి లివ్-ఇన్ రిలేషన్షిప్ వైపు ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి బంధాలు అనేవి సమాజంలో గౌరవప్రదంగా ఉండవని కూడా యువత అర్థం చేసుకోవాలని కోర్టు కోరింది.