అల‌సిపోయిన పైల‌ట్.. ఆల‌స్య‌మైన విమానం

ఆలస్యం చేసిన ఇండిగో ఫ్లైట్: ఇండిగో ఫ్లైట్ 3 గంటలు లేట్ చేసినందు వల్ల, అదే ఫ్లైట్ లో ఉన్న ఒక ప్యాసింజర్ భర్త తీవ్ర కోపంతో ఇండిగో ఫ్లైట్ గురించి ట్విట్టర్లో తనకొచ్చిన ఫ్రస్టేషన్ పంచుకున్నాడు. తన భార్య ఇండిగో ఫ్లైట్ లో ఉన్నప్పుడు తనకి మెసేజ్ చేసిన వాట్సాప్ మెసేజలు స్క్రీన్షాట్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఫ్లైట్లో ఎక్కి కూర్చున్న తర్వాత పైలట్ చాలాసేపటికి రాలేదని తన వైఫ్ చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో […]

Share:

ఆలస్యం చేసిన ఇండిగో ఫ్లైట్:

ఇండిగో ఫ్లైట్ 3 గంటలు లేట్ చేసినందు వల్ల, అదే ఫ్లైట్ లో ఉన్న ఒక ప్యాసింజర్ భర్త తీవ్ర కోపంతో ఇండిగో ఫ్లైట్ గురించి ట్విట్టర్లో తనకొచ్చిన ఫ్రస్టేషన్ పంచుకున్నాడు. తన భార్య ఇండిగో ఫ్లైట్ లో ఉన్నప్పుడు తనకి మెసేజ్ చేసిన వాట్సాప్ మెసేజలు స్క్రీన్షాట్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు.

అంతేకాకుండా ఫ్లైట్లో ఎక్కి కూర్చున్న తర్వాత పైలట్ చాలాసేపటికి రాలేదని తన వైఫ్ చెప్పిన విషయాన్ని ట్విట్టర్లో హైలెట్ చేసాడు. తన వైఫ్ తో ఉన్న చాలా మంది, పైలెట్ ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నాడు. నిజానికి ఇండిగో ఫ్లైట్ లక్నో మీదగా డెహ్రాడూన్ నుంచి చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ సుమారు మూడు గంటలు లేట్ అయినట్లు, ప్రయాణికులు ఫ్లైట్ లోనే తీవ్ర ఇబ్బందులు పడినట్లు ట్విట్టర్ వేదికగా అతని ఫ్రస్టేషన్ పంచుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్:

“ప్రియమైన ఇండిగో సిక్స్ ఈ నా భార్యా ఫ్లైట్ లోనే మూడు గంటల నుంచి వెయిట్ చేస్తుంది. మూడు గంటల తర్వాత ఇప్పుడు ఢిల్లీకి వెళ్తుంది. ఇదే విధంగా మీరు పాసింజర్స్ ని ట్రీట్ చేస్తుంటే చాలా బాగుంది. ”అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అతను సివిల్ అవేయేషన్ మినిస్టర్ జ్యోతిర్ ఆదిత్య ని కూడా ఆ పోస్ట్ కి ట్యాగ్ చేశాడు.

“ఇది నిజంగా నిర్లక్ష్యమనే చెప్పాలి. అలసిపోవడం అంటూ పైలెట్లు చెప్పడం ఏ విధంగా సరిగా ఉంది చెప్పండి!! మూడు గంటల ఫ్లైట్లో ఎదురు చూడడం అది ఒక భయానక వాతావరణం లో ఉండటం తో సమానం. ఇది చాలామందిలో ఆందోళన కలిగించే విషయం” అంటూ ఆయన, తన ట్విట్ ద్వారా తన కోపాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా తన భార్య ఇంకెప్పుడూ ఇండిగో ఫ్లైట్లో వెళ్లనని తెగేసి చెప్పినట్లు పేర్కొన్నాడు.

మరో ప్యాసింజర్ ఆవేదన:

అదే ఫ్లైట్ కి సంబంధించిన మరో ప్యాసింజర్ ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే లక్నోలో కెప్టెన్ కోసం 50 నిమిషాల పాటు వెయిట్ చేసిన్నట్లు ఆదివారం రాత్రి పోస్ట్ చేసిన ట్వీట్లో పేర్కొన్నాడు.

ఇండిగో సమాధానం:

అయితే చాలామంది ట్వీట్లో, ఇండిగో ఫ్లైట్ ఆలస్యం కారణంగా ఎంత ఇబ్బందులు పడ్డారో తెలిపిన దానికి, ఇండిగో సిబ్బంది స్పందించారు.“మీకు ఆలస్యం కారణంగా ఇబ్బంది కలిగించినందుకు మాకు బాధగా ఉంది. అయితే ప్రయాణం జరిగే సమయంలో ఆలస్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మేము అర్థం చేసుకున్నాము. కొన్ని ఆపరేషనల్ రీజన్స్ కారణంగా ఆలస్యం అనేది జరిగింది. మీరు ఓర్పుతో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ ఇండిగో సిబ్బంది ట్విట్ చేశారు.

కానీ నిజానికి ఇండిగో వారు క్షమాపణలకు, తీవ్ర ఆవేదనకు గురైన ప్యాసింజర్ భర్త శాంతించలేదు. “ఇలాంటి ఇబ్బందులను మీరు లైట్ గా తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు” అంటూ మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది.

ఇలా చాలామంది ఇండిగో ఫ్లైట్ ఆలస్యం కారణంగా తాము పడిన ఇబ్బందులను ట్వీట్ ద్వారా పంచుకోవడం జరిగింది.

“ఇది నాకు చాలా బాడ్ ఎక్స్పీరియన్స్. ఎంత పెద్ద సిచువేషన్ లో ఉన్న సరే నేను ఇండిగో ఫ్లైట్ మాత్రం ఎక్కను. టికెట్ రేట్ ఎక్కువైనా సరే వేరే ఫ్లైట్లోనే వెళ్తాను” అంటూ మరో వ్యక్తి ట్విట్ చేయడం జరిగింది.