ఢిల్లీలో దారుణం

దేశంలో చంపడం, ఆత్మహత్య చేసుకుని చనిపోవడాలు ఎక్కువగా మారాయి. ఇలాంటి ఒక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రేణు అనే మహిళను తన ఇంటి దగ్గరలో ఒక వ్యక్తి షూట్ చేసి చంపాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లేసరికి, తన్నుతాను షూట్ చేసుకుని చనిపోయాడు నిందితుడు.  పోలీసులు సమాచారం:  అయితే ఢిల్లీలో దాబ్రీ అనే ప్రాంతంలో గురువారం ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 42 సంవత్సరాల రేణు అనే గృహిణి తమ […]

Share:

దేశంలో చంపడం, ఆత్మహత్య చేసుకుని చనిపోవడాలు ఎక్కువగా మారాయి. ఇలాంటి ఒక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. రేణు అనే మహిళను తన ఇంటి దగ్గరలో ఒక వ్యక్తి షూట్ చేసి చంపాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లేసరికి, తన్నుతాను షూట్ చేసుకుని చనిపోయాడు నిందితుడు. 

పోలీసులు సమాచారం: 

అయితే ఢిల్లీలో దాబ్రీ అనే ప్రాంతంలో గురువారం ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 42 సంవత్సరాల రేణు అనే గృహిణి తమ కుటుంబంతో పాటు ఢిల్లీ దాబ్రీ ప్రాంతంలో ఒక కాలనీలో  నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం సుమారు 8:45 రాత్రి ప్రాంతంలో పోలీసులకు అందిన సమాచారం ప్రకారం 42 సంవత్సరాల రేణు అనే మహిళను, మరో వ్యక్తి ఆమె ఇంటి దగ్గర్లో గన్ తో షూట్ చేసి చంపినట్లు సమాచారం అందింది. 

అదే విషయం తెలుసుకున్న పోలీసులు కొంతమంది టీం తో పాటు ఆ నిందితుడు ఇంటికి చేరుకోగా, అప్పటికే ఆ వ్యక్తి తనను తాను గన్ తో షూట్ చేసుకుని చనిపోయినట్లు ఢిల్లీ డిసిపి హర్షవర్ధన్ వివరించారు. అయితే రేణు కి అలాగే నిందితుడికి రెండు మూడు సంవత్సరాల ముందు జిమ్ లో కలిసిన పరిచయం అని, అయితే ఈ సంఘటనను గూర్చి మరింత విచారణ జరగాల్సి ఉందని డిసిపి హర్షవర్ధన్ చెప్పారు. 

ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?: 

రోజు రోజుకి మనిషి ఆలోచన తప్పు దారి పడుతుందని ఇలాంటి సంఘటనలు వెంటనే తెలుస్తుంది. ఒక మనిషిని మరొక మనిషి చంపే అంత క్రూరమైన ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? ఈ మధ్యకాలంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి .ముఖ్యంగా యువతలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం కుటుంబం మీద, దేశ భవిష్యత్తు మీద దృష్టి ఉంచే యువత ముఖ్యంగా ఇప్పుడు, కేవలం మాదకద్రవ్యాలు మీద కుట్రలు, హత్యలు మీద దృష్ట పెడుతున్నారు. ఒకరకంగా వీటన్నిటికీ కారణం యువతని ప్రేరేపించే వ్యసనాలు అందుబాటులోకి రావడం. అంతే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో కూడిన సినిమాలకు యువత ఎక్కువగా ఆకర్షితం అవడం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించుకోకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం చిన్నతనం నుంచి అలవాటు చేసే కొన్ని విలువలు, యువతని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చెడు స్నేహం, పతనానికి మొదటి మెట్టు. అందుకే యువత మంచి స్నేహాన్ని మాత్రమే వెతకాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. 

ఇప్పుడు జరిగిన సంఘటనలో ఇద్దరిలో ఎవరు తప్పు చేసినప్పటికీ, చంపుకునే అంత క్రూరమైన ఆలోచన అయితే తప్పు. అందుకే, అసలు చంపాలని ఆలోచన కూడా మన బుర్రలోకి రాకుండా చూసుకోవాలి. చావుకి సంబంధించి ప్రేరేపించే కొన్ని విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఈ భూమ్మీద ప్రతి మనిషికే కాదు ప్రతి ప్రాణికి బ్రతికే అవకాశం సమానంగా ఉంటుంది. ఒకరిని చంపే హక్కు మరొకరికి ఎవరిచ్చారు? ఒకరు తప్పు చేస్తే తప్పకుండా వారికి ఏదో ఒక రోజు శిక్ష పడక తప్పదు. ఇలాంటివి గుర్తు చేసుకుంటే కనుక, చెడు ఆలోచనలు, ఒకరిని హింసించే ఆలోచనలు, మనిషి ఆలోచనలకు రావు.