అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

ఈ మధ్యకాలంలో కూడా చాలామంది పెళ్లయిన వారు, వేరే వ్యక్తులతో ఉండేందుకు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వైనం బయటపడుతున్నాయి. చాలామంది పెళ్లయినప్పటికీ, మరొకరిని వివాహం చేసుకునేందుకు దేశాలు దాటి మరీ వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో, అక్రమ సంబంధం వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది.  అసలేం జరిగింది:  హుస్సేన్, నజియా భార్యాభర్తలు. హుస్సేన్ మీద ఒక కన్నేసిన నజియా, తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానపడింది. ఇదే క్రమంలో హుస్సేన్ […]

Share:

ఈ మధ్యకాలంలో కూడా చాలామంది పెళ్లయిన వారు, వేరే వ్యక్తులతో ఉండేందుకు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న వైనం బయటపడుతున్నాయి. చాలామంది పెళ్లయినప్పటికీ, మరొకరిని వివాహం చేసుకునేందుకు దేశాలు దాటి మరీ వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో, అక్రమ సంబంధం వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగింది: 

హుస్సేన్, నజియా భార్యాభర్తలు. హుస్సేన్ మీద ఒక కన్నేసిన నజియా, తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానపడింది. ఇదే క్రమంలో హుస్సేన్ సంబంధం పెట్టుకున్న మరొక మహిళ షబానా ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ లో ఉంటున్న లేపాక్షి గ్రామంలో నివసిస్తుంది. అయితే అనుకోకుండా హుస్సేన్ షబానాను కలిసేందుకు వెళ్లినప్పుడు, తన భర్తను ఫాలో అవుతూ తన కుటుంబ సభ్యులతో సహా అక్కడికి చేరుకుంది నజియా. హుస్సేన్ అలాగే షబానా మధ్య ఉన్న సంబంధాన్ని అందరి ముందు బయట పెట్టింది. 

ఇక్కడితో అయిపోలేదు, తన భర్త అక్రమ సంబంధాన్ని జీర్ణించుకోలేని నజియా, తన భర్త హుస్సేన్ అలాగే తన ప్రేయసి షబానా ఇద్దరికీ గుండు కొట్టించి, వారిద్దరి చేతులను కట్టేసి ఊరి నడి మధ్యలో నడిపించుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలోనే నజియా, తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ షబానాను తన ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. 

తర్వాత నజియా తన కుటుంబ సభ్యులతో కలిసి హుస్సేన్ గ్రామానికి, హుస్సేన్ అలాగే షబానాను ఇద్దరినీ తీసుకువెళ్లారు. కానీ హుస్సేన్ గ్రామంలో, హుస్సేన్ మరియు షబానాను హింసించినందుకు, నజియా కుటుంబ సభ్యులను, నజీయాను పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. అయితే హుస్సేన్ మరియు షబానాను ఇష్టమొచ్చినట్లు కొట్టినందుకు, హింసించినందుకు, చట్టాన్ని చేతుల్లో తీసుకున్నందుకు, నజియా మరియు ఆమె కుటుంబ సభ్యుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వారి మీద పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ ఖచ్చితమైన అధికార పరిధికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షబానా మరియు ఆమె భర్త రెండేళ్ల క్రితం విడిపోయారు. 

ఇలాంటివి మరెన్నో: 

పాకిస్తాన్ కి చెందిన మహిళ సీమ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి సచిన్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి ద్వారా పరిచయమే ఆ ఫేమను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు.  అంతేకాకుండా వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. ప్రస్తుతం సీమ మరియు సచిన్ పెళ్లి బంధంతో ఒకటై, ప్రస్తుతం యూపీ లోని ఒక ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

అంజు-నస్రుల్లా:

34 ఏళ్ల అంజు అనే గృహిణి, జైపూర్ వెళ్తున్న అని తన భర్తకు చెప్పి, 29 సంవత్సరాల నస్రుల్లా అనే వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ బోర్డర్ దాటింది. ఇద్దరూ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ఫేస్ బుక్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల అంజు ఇస్లాం మతం తీసుకున్నందువలన పాకిస్తాన్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారి అంజు-నస్రుల్లా జంటకి ల్యాండ్ ని బహుమతిగా కూడా ఇచ్చారు.