ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి పిజ్జా ఆర్డ‌ర్ చేసుకున్న వ్య‌క్తి

బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ సంగతి తెలిసిన విషయమే. అడుగు తీసి అడుగు వేయడానికి గంటలు గంటలు సమయం పట్టే క్రమం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆకలితో ఉన్న వ్యక్తి ట్రాఫిక్ జామ్ లో ఉండగా, పిజ్జా ఆర్డర్ పెట్టగా అది నిమిషాల్లో అతను ముందుకు వచ్చి చేరుకుంది. నిజానికి పిజ్జా డెలివరీ చేసేందుకు, డెలివరీ బాయ్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని, ఆకలితో ఉన్న కస్టమర్ ముఖంలో ఆనందం చూసేందుకు, కేవలం […]

Share:

బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ సంగతి తెలిసిన విషయమే. అడుగు తీసి అడుగు వేయడానికి గంటలు గంటలు సమయం పట్టే క్రమం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆకలితో ఉన్న వ్యక్తి ట్రాఫిక్ జామ్ లో ఉండగా, పిజ్జా ఆర్డర్ పెట్టగా అది నిమిషాల్లో అతను ముందుకు వచ్చి చేరుకుంది. నిజానికి పిజ్జా డెలివరీ చేసేందుకు, డెలివరీ బాయ్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని, ఆకలితో ఉన్న కస్టమర్ ముఖంలో ఆనందం చూసేందుకు, కేవలం కొద్ది నిమిషాలలోనే పిజ్జా డెలివరీ చేశాడు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

ట్రాఫిక్ జామ్ లో నిమిషాల్లో పిజ్జా డెలివరీ: 

ఆకలి వేసినప్పుడు టక్కున ఆర్డర్ చేయడం ప్రతి ఒక్కరి జీవనశైలిలో ఒక సాధారణ భాగంగా మారింది. ప్రజలు కోరుకునే ప్రతిదీ, అది కిరాణా అరుకులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇప్పుడు ఒక చిన్న బటన్ క్లిక్ చేయడం ద్వారా అందుబాటులో ఉంటున్న వైనం. కొన్నిసార్లు ఈ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్ ముఖంలో చిరునవ్వును చూడడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నా దాటుకుని రావడం అలవాటుగా మార్చుకున్నారని, ఈ సంఘటన తెలుపుతుంది. బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బుధవారం, సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్ గురించి చర్చ నడిచిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన ఫోటోలు నిండిపోయాయి.. ఈ మధ్యలోనే ఆకలితో ఉన్న కస్టమర్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాడు.

డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, తమ కస్టమర్ కోసం పిజ్జా డెలివరీ చేయడం కోసం అన్ని ట్రాఫిక్‌ల మధ్య, కస్టమర్ లైవ్ లొకేషన్ ట్రాక్ చేశారు. డొమినో ఏజెంట్లు తమ బైక్ ని, తన కారు ముందు ఆపుతున్న వీడియోను ‘X’ యూజర్ రిషివత్ షేర్ చేశారు. వీడియోలో, కారులో ఉన్న కస్టమర్ల కోసం డెలివరీ బాయ్స్ రెండు పిజ్జా బాక్సులను అందించడం కనిపిస్తుంది.

బెంగళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై భారీ జామ్‌ ఏర్పడినట్లు వార్తలు వినిపించడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై స్పందించిన ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బంద్‌ కారణంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. లాంగ్ వీకెండ్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి, బెంగళూరు వాసులు వేరే ప్రాంతాలకు వెళ్లడానికి, ఒక్కసారిగా ట్రాఫిక్ పెంచినట్లు కనిపించింది. 

విసిగిపోయిన తల్లిదండ్రులు: 

ఒకవైపు బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ అంతకంతకు ఎక్కువ అవుతున్న వైనంలో, బుధవారం నాడు రాబోయే లాంగ్ వీకెండ్ కారణంగా చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. ఒక్కసారిగా వాహనదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్న ఈ క్రమంలో, చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని సిటీ పోలీసులు మరొకసారి గుర్తు చేశారు. సాయంత్రం 5 గంటలకల్లా ఇంట్లో ఉండవలసిన స్కూల్ పిల్లలు, రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నారని.. ఇది నిజంగా బెంగుళూరులో ఉన్న ప్రభుత్వ వైఫల్యం అని ఒక నెటిజన్ తన ఆవేదనను ట్విట్టర్ లో వెల్లడించారు. 

అయితే ప్రభుత్వం ఇటువంటి వాక్యాలు చేయడం నిజంగా సబబు కాదని.. చిన్నచిన్న ఎక్స్క్యూసెస్ ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, నిజానికి బెంగుళూరులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, అంతేకాకుండా డ్రైనేజీ సిస్టం కూడా సవ్యంగా లేని కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, సిటీ ప్లానింగ్ కూడా అంతంత మాత్రంగా ఉంది. దీని కారణంగానే ట్రాఫిక్ జామ్ అయ్యే క్రమం కనిపిస్తున్నప్పటికీ, పూర్తిగా ట్రాఫిక్ జామ్ విషయాన్ని బెంగుళూరు వాసుల మీద తోసేయడం సబబు కాదు అంటూ యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.