పోలీస్ స్టేష‌న్‌కు వెళ్తుంటే.. మాజీ ప్రేయ‌సిని చంపేసాడు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, ఢిల్లీ త‌ర్వాత బెంగ‌ళూరు క్రైం కేసుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఐటీ హ‌బ్‌గా పేరున్న బెంగ‌ళూరులో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజా ఘ‌ట‌న‌లో త‌నపై ఎక్క‌డ పోలీస్ స్టేష‌న్‌లో పెడుతుందోన‌ని.. మాజీ ప్రేయ‌సిని దారుణంగా చంపేసాడు ఓ కీచ‌కుడు. ద‌క్షిణ క‌న్న‌డలోని పుత్తూరు ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పుత్తూరుకు చెందిన ప‌ద్మరాజ్ అనే యువ‌కుడు జేసీబీ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నాడు. అడాలా ప్రాంతానికి చెందిన గౌరీ అనే 18 ఏళ్ల యువ‌తి పుత్తూరులో […]

Share:

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్, ఢిల్లీ త‌ర్వాత బెంగ‌ళూరు క్రైం కేసుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. ఐటీ హ‌బ్‌గా పేరున్న బెంగ‌ళూరులో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజా ఘ‌ట‌న‌లో త‌నపై ఎక్క‌డ పోలీస్ స్టేష‌న్‌లో పెడుతుందోన‌ని.. మాజీ ప్రేయ‌సిని దారుణంగా చంపేసాడు ఓ కీచ‌కుడు. ద‌క్షిణ క‌న్న‌డలోని పుత్తూరు ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పుత్తూరుకు చెందిన ప‌ద్మరాజ్ అనే యువ‌కుడు జేసీబీ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నాడు. అడాలా ప్రాంతానికి చెందిన గౌరీ అనే 18 ఏళ్ల యువ‌తి పుత్తూరులో సేల్స్ గ‌ర్ల్‌గా పనిచేస్తోంది. అలా వీరిద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 

ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో.. ప‌ద్మరాజ్‌కు గౌరీ బ్రేక‌ప్ చెప్పేసింది. ఇంకెప్పుడూ ఫోన్లు కానీ మెసేజ్‌లు కానీ చేయొద్ద‌ని.. ఇంటి ద‌గ్గ‌రికి రావ‌డాలు కూడా వ‌ద్ద‌ని చెప్పింది. అయినా ప‌ద్మ‌రాజ్ విన‌లేదు. ఆమెను కొంత‌కాలంగా వేధిస్తూనే ఉన్నాడు.దాంతో గౌరీ అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. విష‌యం ప‌ద్మరాజ్‌కు తెలీడంతో ఆమెను దారిలోనే ఆపేందుకు య‌త్నించాడు. ఎన్నిసార్లు వ‌ద్ద‌ని చెప్పినా గౌరీ విన‌లేదు. దాంతో ఆమెను ఎలాగైనా చంపేయాల‌నుకున్నాడు. త‌న ద‌గ్గ‌ర ఉన్న క‌త్తితో ఎటాక్ చేయ‌బోతే గౌరీ త‌ప్పించుకోవాల‌ని చూసింది. అయినా వ‌ద‌ల‌ని ప‌ద్మ‌రాజ్ ఆమెను గోడ‌కు అదిమిప‌ట్టి పీక కోసేసాడు. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి పారిపోయాడు.

స్థానికులు వెంట‌నే గౌరీని స్థానిక హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తుండ‌గానే గౌరీ తీవ్రంగా బ్లీడ్ అవ‌డంతో ప్రాణాలు కోల్పోయింది. వెంట‌నే పోలీసులు నిందితుడు ప‌ద్మ‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే బెంగ‌ళూరులో కొన్ని నెల‌ల క్రితం చోటుచేసుకుంది. అర్పిత్ అనే ఢిల్లీకి చెందిన యువ‌కుడు మ‌న తెలుగు అమ్మాయిని దారుణంగా హ‌త్య చేసాడు. జాబ్స్ కోస‌మ‌ని బెంగ‌ళూరు వెళ్లిన అర్పిత్.. హైద‌రాబాద్‌కు చెందిన ఆకాంక్ష అనే యువ‌తితో స్నేహం పెంచుకున్నాడు. అలా ఇద్ద‌రూ కొంత‌కాలం పాటు బెంగ‌ళూరులోనే లివిన్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారు. ఉన్నట్టుండి ఓ రోజు అర్పిత్‌కి ఆకాంక్ష‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. దాంతో ఆమె నిద్ర‌పోతుండ‌గా పీక నొక్కి చంపేసాడు. పైగా ఉరేసుకుంద‌ని పోలీసుల‌ను న‌మ్మ‌బ‌లికాడు. విచార‌ణ‌లో అన్ని వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఇలాంటి దారుణంగా బెంగ‌ళూరులో జ‌రుగుతూనే ఉన్నాయి. బెంగ‌ళూరులో ఎక్కువ శాతం చ‌దువుకుని ఉద్యోగాలు చేస్తున్న‌వారే ఉంటారు. పైగా ఐటీ హ‌బ్ కావ‌డంతో చాలా మంది ఉద్యోగాల కోస‌మ‌నే వ‌స్తుంటారు. త‌ల్లిదండ్రులు ఎటూ ఊళ్ల‌ల్లో ఉంటారు కాబ‌ట్టి విచ్చ‌ల‌విడిగా బ‌తికేయొచ్చు అనుకుంటారు. అలా అనుకునే లివిన్ రిలేష‌న్‌షిప్స్‌లో ఉండటం వంటివి చేస్తూ చివ‌రికి ఇలా బ‌లైపోతున్నారు.

ద‌క్షిణ క‌న్న‌డలో జరిగిన ఘ‌ట‌న‌లో నిందితుడు ప‌ద్మ‌రాజ్ ఎక్క‌డ త‌న గురించి గౌరీ పోలీసుల‌కు చెప్పేస్తుందో.. ఎక్క‌డ పోలీసులు త‌న‌ని అరెస్ట్ చేస్తాడో అని ఆలోచించాడే కానీ.. హ‌త్య చేసినా అంత‌కుమించిన శిక్ష ఉంటుంద‌న్న విష‌యం మ‌ర్చిపోయాడు. గౌరీ ఒక‌వేళ నిజంగానే కంప్లైంట్ చేసి ఉంటే.. పోలీసులు పిలిచి రెండు కొట్టి వార్నింగ్ ఇచ్చి వ‌దిలేసి ఉండేవారు. అక్క‌డితో గొడ‌వ ఆయిపోయేది. కానీ ఆ అమ్మాయిని చంపేసి ఇప్పుడు యావ‌జ్జీవ కారాగార శిక్ష అనుభ‌వించేదాకా తెచ్చుకున్నాడు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చినా కూడా క్రైం రేటు పెరిగిపోతోందే త‌ప్ప త‌గ్గ‌డంలేద‌ని క్లియ‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు.