MLA: ఎమ్మెల్యే ఇంట్లో దొరికిన శవం

రాజకీయాల (Politics) కు ప్రస్తుత రోజుల్లో అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు హుందాగా ఉండే రాజకీయాలు ప్రస్తుతం హత్యలు, ఆరోపణలు, బూతులతో నిండిపోయాయి. అందుకే వీటిని చూసి చాలా మంది రాజకీయాల్లో (Politics) కి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. యువత చిన్న తనంలోనే రాజకీయాల (Politics)కు దూరంగా జరుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న తరం రాజకీయ నాయకుల్లో యువకులు చాలా తక్కువ. ఒక వేళ ఉన్నా రాజకీయ నాయకుల పిల్లలే వస్తున్నారు తప్పు సామాన్యులు, కొత్త నీరు […]

Share:

రాజకీయాల (Politics) కు ప్రస్తుత రోజుల్లో అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు హుందాగా ఉండే రాజకీయాలు ప్రస్తుతం హత్యలు, ఆరోపణలు, బూతులతో నిండిపోయాయి. అందుకే వీటిని చూసి చాలా మంది రాజకీయాల్లో (Politics) కి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. యువత చిన్న తనంలోనే రాజకీయాల (Politics)కు దూరంగా జరుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న తరం రాజకీయ నాయకుల్లో యువకులు చాలా తక్కువ. ఒక వేళ ఉన్నా రాజకీయ నాయకుల పిల్లలే వస్తున్నారు తప్పు సామాన్యులు, కొత్త నీరు రావడం లేదు. తాజాగా ఓ ఎమ్మెల్యే (MLA) ఇంట్లో శవం దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ శవం దొరికిన సమయంలో ఎమ్మెల్యే (MLA)  ఇంట్లో లేదు. ఆమె గత కొద్ది రోజుల నుంచి ఆ ఇంటిని వాడడం లేదు. 

ఎమ్మెల్యే ఇంట్లో శవం.. 

బీహార్‌ (Bihar) లోని నవాడా జిల్లాలో ఘోరం జరిగింది. ఆ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే (MLA)  ఇంట్లో పోలీసులు శవాన్ని (Dead Body) కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు చెప్పడం కాదు.. స్వయంగా పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించారు. నవాడా జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA)  నీతూ సింగ్ ఇంట్లో శనివారం 24 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ వార్త విని అనేక మంది షాక్ కు గురయ్యారు. ఇదేంటి ఇలా ఎమ్మెల్యే (MLA)  ఇంట్లో శవం కనిపించడం ఏంటని అంతా ఆందోళన చెందారు. చనిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే (MLA)  నీతూ సింగ్ కి దూరపు బంధువు. ఈ విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. అది కూడా విని అంతా ఆశ్చర్యపోయారు. పోలీసులు (Police) మృతదేహాన్ని కనుగొన్నప్పుడు ఎమ్మెల్యే ఇంట్లో లేరని, నవాడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) (SP) అంబరీష్ రాహుల్ తెలిపారు.

కొద్ది రోజుల నుంచి ఉండని ఎమ్మెల్యే

ఎమ్మెల్యే (MLA)  ఆ ఇంటిలో గత కొద్ది రోజుల నుంచి ఉండడం లేదని పోలీసులు వెల్లడించారు. నీతూ సింగ్ గత కొన్ని రోజులుగా పాట్నా లో ఉంది. సంఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ లేరు. సాయంత్రం 4:30 గంటలకు ఎమ్మెల్యే (MLA)  ఇంటి వద్ద మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీతూ సింగ్ మేనల్లుడు గోలు సింగ్‌ (Golu Singh) కు చెందిన గదిలో పడి ఉన్న పీయూష్ సింగ్ మృతదేహాన్ని (Dead Body) పోలీసు బృందం కనుగొంది. తరువాత, పోలీసులు కేసును దర్యాప్తు చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులను మరియు డాగ్ స్క్వాడ్ బృందాలను కూడా పిలిపించారు. గోలు సింగ్, అతని గదిలో మృతదేహం కనుగొనబడింది. ప్రస్తుతం చనిపోయిన పీయూష్ సింగ్ తో పాటు పట్టుబడ్డ గోలు సింగ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే నీతూ సింగ్ కు చుట్టాలే కావడం గమనార్హం.  శనివారం రాత్రి 7 గంటలకు గోలు సింగ్ ఇంటికి వెళ్లిన పీయూష్ సింగ్ ఇంటికి తిరిగి రాలేదని ప్రాథమిక విచారణలో తేలింది. పీయూష్ సింగ్ రాత్రి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఇందుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నీతూ సింగ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. 

గోలు సింగ్ మీదే అనుమానం

పోలీసులు గోలు సింగ్ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సాక్ష్యాలు కూడా గోలు సింగ్ కు వ్యతిరేఖంగానే ఉన్నాయి. ఇంత వరకు ఈ కేసులో ఎవరినీ ఇంత వరకు అరెస్ట్ (Arrest) చేయలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్‌ మార్టం పూర్తి చేసిన తర్వాత ఈ హత్య గురించిన ఖచ్చితమైన సమాచారం తమకు తెలుస్తుందని ఎస్పీ చెప్పారు. ఇలా ఎమ్మెల్యే ఇంటిలో శవం కనిపించే సరికి ఒక్కసారిగా అందరూ షాక్ (Shock) కు గురయ్యారు. ప్రస్తుతం బీహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఉంది. దొరికింది కాంగ్రెస్ ఎమ్మెల్యే (MLA)  ఇంట్లో కావడంతో కేసు ఎలా ఉంటుందో అని  అంతా చర్చించుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వేచి చూడాలని పోలీసులు మీడియాకు తెలిపారు.