యూరినల్ బ్యాగ్ బదులు స్ప్రైట్ బాటిల్ అమర్చిన హాస్పిటల్ 

ఈ మధ్యకాలంలో హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం బీహార్ హాస్పిటల్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ యాజమాన్యం చేసే నిర్లక్ష్యాలు కారణంగా కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయినా కేసులు ఉన్నాయి. బీహార్ హాస్పిటల్లో చేరిన ఒక పేషెంట్ కు యూరిన్ బ్యాగ్ అటాచ్ చేయడం బదులు, స్ప్రైట్ బాటిల్ అమర్చడం జరిగింది. పేషెంట్ తాలూకా బంధువులు గొడవకి దిగడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.  హాస్పిటల్ నిర్లక్ష్యం:  బీహార్ హాస్పిటల్లో చేరిన […]

Share:

ఈ మధ్యకాలంలో హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం బీహార్ హాస్పిటల్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ యాజమాన్యం చేసే నిర్లక్ష్యాలు కారణంగా కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయినా కేసులు ఉన్నాయి. బీహార్ హాస్పిటల్లో చేరిన ఒక పేషెంట్ కు యూరిన్ బ్యాగ్ అటాచ్ చేయడం బదులు, స్ప్రైట్ బాటిల్ అమర్చడం జరిగింది. పేషెంట్ తాలూకా బంధువులు గొడవకి దిగడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. 

హాస్పిటల్ నిర్లక్ష్యం: 

బీహార్ హాస్పిటల్లో చేరిన ఒక పేషెంట్ కు యూరిన్ బ్యాగ్ అటాచ్ చేయడం బదులు, స్ప్రైట్ బాటిల్ అమర్చడం జరిగింది. పేషెంట్ తాలూకా బంధువులు గొడవకి దిగడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఒక పేషెంట్ ను బీహార్ సర్దార్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే పేషెంట్ ని ఎగ్జామ్ పరీక్షించిన తర్వాత పేషంట్ కి ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వమని అంతేకాకుండా యూరినల్ బ్యాగ్ అటాచ్ చేయమని హాస్పిటల్ స్టాఫ్ కి చెప్పారు డాక్టర్. 

అయితే హాస్పిటల్ లో అప్పటికే కొన్ని మెడిసిన్స్ అలాగే మెడికల్ పరికరాలు అందుబాటులో లేని కారణంగా హాస్పటల్లో జాయిన్ అయిన వ్యక్తికి యూరిన్ బ్యాగ్ అమర్చవలసిన ప్లేస్ లో స్ప్రైట్ బాటిల్ అమర్చారు. ఇది నిజానికి ఆ పేషెంట్ లైఫ్ని రిస్క్ చేసినట్లుగా మారింది. అయితే పేషెంట్ తాలూకా బంధువులు హాస్పిటల్ మేనేజ్మెంట్ మీద తమ కోపాన్ని చూపించారు. అంతేకాకుండా హాస్పిటల్ మేనేజర్ రమేష్ పాండే కాంటాక్ట్ ఇవ్వమని అడగగా అతను అవైలబుల్ గా లేరని హాస్పిటల్ యాజమాన్యం చెప్పగా, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత మంగళవారం ఉదయానికి సిచువేషన్ అర్థం చేసుకొని కావాల్సిన మెడిసిన్స్ అలాగే మెడికల్ ఎక్విప్మెంట్స్ తెప్పించారు హాస్పిటల్ యాజమాన్యం. 

అయితే హాస్పిటల్ మేనేజర్ రమేష్ పాండేకి ఈ సంఘటన గురించి అడగగా, ఆయనకి హాస్పిటల్లో మెడికల్ ఎక్విప్మెంట్ షార్ట్ ఏజ్ ఉన్నట్లు తెలియదని వాదించారు. అంతేకాకుండా, హాస్పిటల్లో ఇంకా చాలామంది పేషెంట్లు పరిస్థితి తెలుసుకొని తగిన సౌకర్యాలు అందించడమే తమ లక్ష్యమని, అయితే ఈ సంఘటన జరిగిన అనంతరమే అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పుకొచ్చారు. 

మరో హాస్పిటల్ నిర్లక్ష్యం, బలైన నిండు ప్రాణం: 

కెంకేరా గ్రామానికి చెందిన దివాకర్ మరియు అరుణలకు పుట్టిన మగ బిడ్డ ఆయష్. అయితే ఆయష్ తీవ్రమైన శ్వాస సంబంధిత బాధతో చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సప్తగిరి హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే డాక్టర్లు ఎవరు కూడా హాస్పిటల్లో అందుబాటులో లేరు. హాస్పిటల్ ఉన్న స్టాఫ్, తమ బాబు పరిస్థితిని చూసినప్పటికి ప్రాథమిక చికిత్స కూడా అందించలేదని, కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని బయటపెట్టారు. 

అయితే ఆ బాబు తీవ్రమైన ఆరోగ్యని గమనించిన హాస్పిటల్ యాజమాన్యం, ఆ బాబుని చుంచానగరి హాస్పిటల్ కి స్పెషల్ ట్రీట్మెంట్ కోసం తరలించాలని సలహా ఇచ్చినప్పటికీ, తమ హాస్పిటల్లో చేయవలసిన ప్రాథమిక చికిత్స కూడా అందించలేదని నివేదికలో తేలింది. 

అయితే తమ బాబుని కోల్పోవడానికి కేవలం ఆ హాస్పటల్ నిర్లక్ష్యమే అని, స్థానిక పోలీస్ స్టేషన్లో బాబు తరపున కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో, అసలు ఏం జరిగిందని హాస్పిటల్ యాజమాన్యం మీద ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు.