వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు..

పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌ మింగుతారు.. గొంతులో తట్టుకుని ఒక్కోసారి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది వారికి తెలియకుండానే వెంట్రుకలు, గోర్లు తింటుంటారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే గానీ అసలు విషయం బయటపడదు.. సరిగ్గా అలాంటి సంఘటనే పంజాబ్‌లో జరిగింది. రెండేళ్లుగా కడపు నొప్పితో బాధపడుతోన్న […]

Share:

పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌ మింగుతారు.. గొంతులో తట్టుకుని ఒక్కోసారి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది వారికి తెలియకుండానే వెంట్రుకలు, గోర్లు తింటుంటారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే గానీ అసలు విషయం బయటపడదు.. సరిగ్గా అలాంటి సంఘటనే పంజాబ్‌లో జరిగింది. రెండేళ్లుగా కడపు నొప్పితో బాధపడుతోన్న ఓ వ్యక్తి తాజాగా ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల్లో భాగంగా వైద్యులు స్కానింగ్‌ చేశారు. స్కానింగ్‌ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి కడుపులో ఉన్న వాటిని డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆపరేషన్‌ చేసి కడుపులో ఉన్న ఇయర్‌ఫోన్స్‌, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, వాచర్లు, తదితర వస్తువులను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. వివరాల్లోకెళ్తే.. 

పంజాబ్ లోని మోగా మెడిసిటీ హాస్పిటల్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ఓ 40 ఏళ్ల వ్యక్తిని రెండేళ్లుగా కడుపునొప్పి వేధించడంతో.. చాలా మంది డాక్టర్ల వద్దకు వెళ్లాడు. వాళ్లు ఏవో మందులు ఇచ్చి.. తాత్కాలికంగా ఉపశమనం కలిగించేవారు. మందులు వేసుకున్నప్పుడే నొప్పి తగ్గేది. తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేది. కానీ, వైద్యులు ఎవరూ అతడి కడుపు నొప్పికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇటీవల నొప్పి వేధించడంతో రాత్రిళ్లు కూడా నిద్రపట్టకపోవడం.. జ్వరం, వాంతులు వంటి కావడంతో ఏదో తేడాగా ఉందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే ఓ పెద్దాసుపత్రికి తరలించడంతో విషయం బయటపడింది.

డాక్టర్లు పరీక్షించి కొన్ని మందులు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో స్టమక్‌ ఎక్స్‌రే, స్కాన్‌ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అతడిని టెస్ట్‌ చేసిన వైద్యులు నోరెళ్ళబెట్టారు. ఎక్స్‌రేలో కనిపించిన వస్తువులు చూసిన వైద్యులకు కళ్ళు బైర్లు కమ్మాయి. స్కాన్‌ చేస్తున్న సమయంలో బాధితుడి కడుపులో ఇనుప, ప్లాస్టిక్‌ వస్తువులు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో వైద్యులు మూడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి ఆ వస్తువులన్నింటినీ తొలగించారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన వస్తువుల్లో ఇయర్‌ ఫోన్‌లు, వాషర్లు, నట్స్, తాళం చెవి లాకెట్‌లు, బటన్‌లు, రేపర్‌లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, సేఫ్టీపిన్స్‌, బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, తాళం, మార్బుల్ వంటి దాదాపు వంద వస్తువులు ఉన్నాయి.

ఇలాంటి కేసును తన వైద్య వృత్తిలో తొలి సారి చూశానని మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కర్లా తెలిపారు. రెండేళ్ల నుంచి ఆ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడు. చాలా మంది వైద్యులను సంప్రదించినా.. సమస్య ఏంటనేది నిర్దారించలేకపోయారని వివరించారు. చాలా రోజులుగా ఆ వస్తువులు బాధితుడి పొట్టలో ఉండటం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. దాదాపు 3 గంటల పాటు ఆపరేషన్‌ చేసి వస్తువుల్ని తొలగించామని ఆయన అన్నారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మానసిక స్థితి సరిగా లేని సదరు వ్యక్తి ఎప్పుడు మింగేశాడో తమకు అవగాహన లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా ఆశ్చర్యానికి గురయ్యామని అన్నారు. కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని, కొద్ది రోజులగా నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించామని తెలిపారు. ఇన్ని వస్తువులు కడుపులో బయట పడటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.