ఏకంగా జడ్జిగా నటించి లక్షలు కొట్టేసాడు

మోసపోయే వాళ్ళు ఉంటే, మోసం చేసే వాళ్ళు పుట్టుకు వస్తారని మరోసారి నిరూపించాడు నామాల నరేందర్, ఏకంగా ఒక జడ్జిగా నటించి సుమారు కొన్ని లక్షలు కొట్టేసాడు, ప్రస్తుతం నామాల నరేందర్ అనే వ్యక్తి మీద చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.  అసలు విషయం:  మనం ఘరానా దొంగలని చూస్తుంటాం, కానీ ఇతను ఘరానా దొంగలకి మించిపోయిన దొంగ అంటే అతిశయోక్తి లేదు. నామాల నరేందర్ అనే వ్యక్తి, కొంతమంది అధికారులుగా నటించి, అంతేకాకుండా ఒక […]

Share:

మోసపోయే వాళ్ళు ఉంటే, మోసం చేసే వాళ్ళు పుట్టుకు వస్తారని మరోసారి నిరూపించాడు నామాల నరేందర్, ఏకంగా ఒక జడ్జిగా నటించి సుమారు కొన్ని లక్షలు కొట్టేసాడు, ప్రస్తుతం నామాల నరేందర్ అనే వ్యక్తి మీద చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. 

అసలు విషయం: 

మనం ఘరానా దొంగలని చూస్తుంటాం, కానీ ఇతను ఘరానా దొంగలకి మించిపోయిన దొంగ అంటే అతిశయోక్తి లేదు. నామాల నరేందర్ అనే వ్యక్తి, కొంతమంది అధికారులుగా నటించి, అంతేకాకుండా ఒక జడ్జిగా కూడా నటించి లక్షల రూపాయలు కాజేశాడు, స్టేట్ అడ్మినిస్ట్రేటర్ జనరల్ అలాగే ట్రస్ట్టీ గా నటించి ప్రాపర్టీ సెటిల్మెంట్ విషయాల్లో లక్షలు పోగేసుకున్నాడు. అంతేకాకుండా నరేందర్ దగ్గర గన్ మాన్ గా పనిచేస్తున్న ఎక్స్ సర్వీస్ ఆఫీసర్, అనంతపురం కి చెందిన మధుసూదన్ని కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. 

అయితే వేములవాడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కూడా నరేందర్ మీద తొమిది చీటింగ్ కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది .అయితే అతని దగ్గర గన్ మాన్ గా పనిచేస్తున్న చిక్కమ్ మధుసూదన్ రెడ్డి దగ్గర లైసెన్స్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

పగటి వేషగాడు: 

ఏకంగా ఒక జడ్జిగా నటించి సుమారు కొన్ని లక్షలు కొట్టేసాడు, ప్రస్తుతం నామాల నరేందర్ అనే వ్యక్తి మీద చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే నరేందర్ చీటింగ్ కేసుల చిట్టా పెద్దగానే ఉన్నట్లు కనిపిస్తోంది. 2014 నుంచి 2016 మధ్య సంవత్సరాలలో తను ఒక జడ్జ్ అని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న క్రమంలో, ఎస్ ఆర్ నగర్ పోలీసులు నరేందర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. 

అయితే రిలీజ్ అయిన తర్వాత కూడా నరేందర్ లో మార్పు రాలేదు. ఖమ్మం అడ్మినిస్ట్రేటర్ జనరల్ అలాగే అఫీషియల్ ట్రస్ట్టీ కింద, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జి కింద నటించి 2018లో కొన్ని లక్షల రూపాయలు వెనకేస్తాడు. ఈ చీటింగ్ కేసులో ఖమ్మం రూరల్ రూరల్ పోలీస్ వారు నరేందర్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. అయితే అప్పట్లో సంతోష్ అనే లోకల్ వెబ్ డిజైనర్ తో చేతులు కలిపిన నరేందర్ ఒక ఫేక్ ప్రొఫైల్ ఆన్లైన్ లో క్రియేట్ చేసుకుని, ఎడిషనల్ సివిల్ జడ్జ్ కింద ప్రజలను మోసం చేస్తూనే వచ్చాడు. అయితే ఇదే క్రమంలో గార్లపాటి సోమిరెడ్డి వనస్థలిపురంలో నివసిస్తున్న వ్యక్తి దగ్గర నుంచి జడ్జ్ అని చెప్పుకొని నరేందర్ 10 లక్షల రూపాయలు కాజేస్తాడు. అంతేకాకుండా తాను జడ్జ్ అని నమ్మించడానికి, తన దగ్గర మధుసూదన్ అనే వ్యక్తిని కూడా నియమించుకున్నాడు. తమ ప్రాపర్టీ సెటిల్మెంట్ విషయంలో తన హెల్ప్ చేస్తా అని చెప్పి, మెల్లగా సోమిరెడ్డి దగ్గర డబ్బు కాజేసీ మెల్లగా జారుకోవాలని చూశాడు. ఇదే క్రమంలో డబ్బులు ఇచ్చిన సోమిరెడ్డి తను నరేందర్ చేతిలో మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించాడు. 

ప్రతిసారి ప్రజలు మోసపోతున్నారు కాబట్టే ఇలాంటి మోసగాళ్లు వీధికి ఒకరు పుట్టుకొస్తున్నారు.. ఏది నిజం ఏది అబద్దం అని ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత డబ్బులు విషయంలో మరింత జాగ్రత్త వహించాలని తెలుస్తోంది. ఏకంగా అధికారులు అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా చీటింగ్ చేస్తూ ఎంతోమంది విచ్చలవిడగా తిరుగుతున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. డబ్బులు ఊరికే రావు..