పశ్చిమ బెంగాల్ హింసకాండ‌

ఈమధ్యనే పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సమయం లో జరిగిన కొన్ని అశాంతి కార్యక్రమాల వల్ల 13 మంది మరణించడం,పదుల సంఖ్యలో ఓటర్లు కి తీవ్రమైన గాయపడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే జరిగిన ఈ హింసాత్మక ఆరోపణలను ఎదురుకునే ప్రయత్నం చేసింది. 61000 పోలింగ్ బూత్స్ లో ఎన్నికలు జరగగా, అందులో కేవలం 60 బూతుల వద్ద మాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ […]

Share:

ఈమధ్యనే పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సమయం లో జరిగిన కొన్ని అశాంతి కార్యక్రమాల వల్ల 13 మంది మరణించడం,పదుల సంఖ్యలో ఓటర్లు కి తీవ్రమైన గాయపడిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే జరిగిన ఈ హింసాత్మక ఆరోపణలను ఎదురుకునే ప్రయత్నం చేసింది. 61000 పోలింగ్ బూత్స్ లో ఎన్నికలు జరగగా, అందులో కేవలం 60 బూతుల వద్ద మాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కునాల్ ఘోష్, డాక్టర్ శశి పంజా మరియు బ్రత్యా బసు ఒక విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన హింస ఖాండ కి విచారణ వ్యక్తం చేస్తున్నాము, ఈ సంఘటన లో గాయపడిన కార్యకర్తలకు ప్రత్యేకమైన సానుభూతి తెలిపారు. అలా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ని వ్యక్తపరుస్తూ మీడియా ముందు చాలా భావోద్వేగంతో మాట్లాడారు.

అసత్య ప్రచారాలు చేస్తున్నారు : తృణమూల్ కాంగ్రెస్ నేతలు

ఇంకా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయం లో జరిగిన  హింసకు సంబంధించిన ఆరోపణలను ప్రతిపక్షాలు వాస్తవాన్ని వక్రీకరించారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలు మరియు కొన్ని మీడియా సంస్థలు ఎన్నికలను అప్రతిష్టపాలు చేసేందుకు హింసను అడ్డంగా పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.’ప్రతిపక్ష పార్టీలు మొన్న జరిగిన ఎన్నికల ప్రక్రియను హింసాత్మకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి, అయితే చాలావరకు శాంతియుతంగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి, ఈ ఘనత మాత్రం సామాన్య ప్రజలకే చెందుతుంది’ అని ఘోష్ చెప్పుకొచ్చారు. ‘నమోదైన మరణాలలో ఎక్కువ భాగం తృణమూల్ కార్యకర్తలే ఉన్నారు, మరి తృణమూల్ హింసను ప్రేరేపిస్తుంటే, వారు తమ స్వంత కార్యకర్తలను ఎందుకు టార్గెట్ చేసుకుంటారు?’ అని ప్రశ్నించాడు.జరిగిన హింసాత్మక సంఘటనలను నియంత్రించడంలో, వారి సామర్థ్యాన్ని, ఉద్దేశ్యాలను ప్రశ్నించడంలో కేంద్ర బలగాల వైఫల్యాలపై పంజా అద్భుతంగా మాట్లాడుతూ అందరి దృష్టిని  ఆకర్షించారు. ఆమె మాట్లాడుతూ “కేంద్ర బలగాలను మోహరించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ బలగాలు ఎక్కడ ఉన్నాయి, హింసను ఎందుకు అడ్డుకోలేకపోయాయి? సరిహద్దు భద్రతా దళంతో సహా కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరించడం వంటి సందర్భాలు కెమెరాలో ఉన్నాయి. ఒక తమ పార్టీకే ఓటు వెయ్యమని సామాన్య ఓటర్లను బెదిరిస్తున్నట్టుగా వీడియో లో స్పష్టంగా కనిపిస్తుంది” అంటూ పంజా మాట్లాడిన మాటలు ఇప్ప్పుడు నేషనల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

గవర్నర్ పై తీవ్రమైన ఆరోపణలు :

జరిగిన ఈ దురదృష్టకరమైన సంఘటనల గురించి సరిహద్దు భద్రతా దళం (BSF) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ గులేరియా మీడియాతో మాట్లాడుతూ, శాంతియుతంగా ఉండే  పోలింగ్ బూత్‌ల లిస్ట్ ని అందించాల్సిందిగా పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన వివరాలను అందించలేదని, ఈ ప్రాంతాలను తగినంతగా రక్షించడంలో మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై చాలా తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఈ సందర్భంగా మిస్టర్ బసు  మాట్లాడుతూ ‘ అత్యధిక సంఖ్యలో తృణమూల్ కార్యకర్తలు మరణించినప్పటికీ, గవర్నర్ ప్రతిపక్ష పార్టీల నుండి బాధితులను కొంతమందిని మాత్రమే పరామర్శించారు. అంతేకాకుండా, ఆయన ఎక్కడికి వెళ్లినా రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. నామినేట్ చేయబడిన వ్యక్తి అధికారం నుండి ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.