ఉద‌య‌నిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మ‌మ‌తా బెన‌ర్జీ

సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ.. ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)ను కూడా లక్ష్యంగా చేసుకుంది. స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ఆమె వ్య‌తిరేకిస్తూ.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అన్నారు. ఉద‌య‌నిధి స్టాలిన్ ఓ జూనియ‌ర్ నాయ‌కుడ‌ని, కానీ ఏ కార‌ణం […]

Share:

సనాతన ధర్మానికి సంబంధించి తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ.. ప్రతిపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.)ను కూడా లక్ష్యంగా చేసుకుంది. స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ఆమె వ్య‌తిరేకిస్తూ.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అన్నారు. ఉద‌య‌నిధి స్టాలిన్ ఓ జూనియ‌ర్ నాయ‌కుడ‌ని, కానీ ఏ కార‌ణం చేత ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేశారో స్ప‌ష్టంగా తెలియ‌ద‌న్నారు. త‌మిళ ప్ర‌జ‌ల్ని గౌర‌విస్తున్న‌ట్లు చెప్పారు.  

 స‌నాత‌న ధ‌ర్మం డెంగ్యూ, మలేరియా లాంటిద‌ని, దాన్ని నిర్మూలించాల‌ని త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌ను ఆమె వ్య‌తిరేకిస్తూ.. ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదు అన్నారు. ఉద‌య‌నిధి స్టాలిన్ ఓ జూనియ‌ర్ నాయ‌కుడ‌ని, కానీ ఏ కార‌ణం చేత ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేశారో స్ప‌ష్టంగా తెలియ‌ద‌ని, కానీ అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూడాల‌న్నారు. త‌మిళ‌నాడు, ద‌క్షిణ రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల్ని గౌర‌విస్తున్నాన‌ని, ప్ర‌తి మ‌తానికి కొన్ని మ‌నోభావాలు ఉంటాయ‌ని, వాటిని గౌర‌వించాల‌ని అభ్య‌ర్థిస్తున్నట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉన్న దేశం మ‌న‌ద‌ని, స‌నాత‌న ధ‌ర్మాన్ని గౌర‌విస్తాన‌ని, వేదాల నుంచే మ‌నం అన్నీ నేర్చుకున్నామ‌ని, మ‌న వ‌ద్ద ఎంతో మంది పురోహితులు ఉన్నార‌ని, త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వం వాళ్లంద‌రికీ పెన్ష‌న్ ఇస్తోంద‌ని, దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఆల‌యాలు ఉన్నాయ‌ని, గుళ్లు, మ‌సీదులు, చ‌ర్చిల‌ను విజిట్ చేస్తుంటామ‌ని సీఎం తెలిపారు. 

‘సనాతన ధర్మం’పై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు అతని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించింది. అతని వ్యాఖ్యలతో ఇండియా కూటమికి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ‘‘ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం, ఖండించదగినవి. మనం మన సంస్కృతి, మతంతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి. ఎవరైనా సనాతన ధర్మాన్ని విమర్శిస్తే.. వాటిని తీవ్రంగా ఖండించాల్సిందే. అతను ఎవరైనా కావొచ్చు.. ఈ వ్యాఖ్యల్ని మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అవమానించిందని అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇండియా కూటమితో స్టాలిన్ వ్యాఖ్యలకు సంబంధం లేదని కునాల్ స్పందించారు.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న ఉదయనిధిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు చెందిన సాధువు ఒకరు ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తానని ప్రకటించారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే తానే స్వయంగా ఉదయనిధిని వెతికి పట్టుకుని ఆ పని పూర్తిచేస్తానని చెప్పారు. ఈ ప్రకటనపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం స్పందించారు.

తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తెలియదని ఉదయనిధి అన్నారు. రూ. పది కోట్లు ఎందుకు, పది రూపాయల దువ్వెన ఇస్తే తానే తన తల దువ్వుకుంటానని చెప్పారు. ఛాప్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వుకోవడమనే అర్థం ఉంది. ఈ అర్థాన్ని వాడుకుంటూ సాధువు హెచ్చరికను ఉదయనిధి తేలిగ్గా తీసిపారేశారు. ఇలాంటి బెదిరింపులు తమ కుటుంబానికి కొత్తేంకాదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, మళ్లీ మళ్లీ అదే చెబుతానని స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ సాధువుకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉదయనిధి ప్రశ్నించారు.