Cash for query: క్యాష్ ఫర్ క్వెరీ విషయంలో మహువా మోయిత్రాపై ఆరోపణలు

రాజకీయ రంగంలో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇటీవల బీజేపీ (BJP) ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey), తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మహువా మోయిత్రా (Mahua Moitra)పై మీద ఖచ్చితమైన ఆరోపణలు చేశారు. ఆమె కేవలం పార్లమెంటు (Parliament)లో వ్యాపారవేత్తకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారని, ప్రశ్నలు పార్లమెంటు (Parliament)లో అడగడానికి గాను ఆ వ్యాపారవేత్త దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపించడం జరిగింది. ఇదే క్యాష్ ఫర్ […]

Share:

రాజకీయ రంగంలో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఇటీవల బీజేపీ (BJP) ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey), తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మహువా మోయిత్రా (Mahua Moitra)పై మీద ఖచ్చితమైన ఆరోపణలు చేశారు. ఆమె కేవలం పార్లమెంటు (Parliament)లో వ్యాపారవేత్తకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడిగారని, ప్రశ్నలు పార్లమెంటు (Parliament)లో అడగడానికి గాను ఆ వ్యాపారవేత్త దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆరోపించడం జరిగింది. ఇదే క్యాష్ ఫర్ క్వెరీ (cash for query). అయితే వెంటనే తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మీద ఎంక్వైరీ కమిటీ వేయాలని లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా ను కోరడం జరిగింది నిశికాంత్ దుబే (Nishikant Dubey). 

మహువా మోయిత్రాపై ఆరోపణలు: 

రియల్ ఎస్టేట్ హీరానందానీ గ్రూప్ CEO అయిన మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కాంగ్రెస్ లీడర్ కు అందించిన లంచాలకు సంబంధించి తిరుగులేని సాక్ష్యాలు తనకు అందాయని, దూబే తన లేఖలో పేర్కొన్నాడు. మహువా మోయిత్రా (Mahua Moitra) ఇప్పటివరకు పార్లమెంట్‌ (Parliament) లో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్‌పై దృష్టి పెట్టినవే అంటూ, స్పీకర్‌కు అందించిన లేఖలో దూబే పేర్కొన్నారు, TMC MP తరచుగా క్యాష్ ఫర్ క్వెరీ (cash-for-query) వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు బిజెపి ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey). 

మహువా మోయిత్రా (Mahua Moitra), దూబేకు ఘాటుగా సమాధానం ఇస్తూ, మరి ముందుగా దూబేపై పెండింగ్‌లో ఉన్న అభియోగాలను, లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ పరిష్కరించిన తర్వాత ఆమెపై ఎలాంటి చర్యనైనా ఆనందంగా స్వీకరిస్తానని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలు పరువు నష్టం కలిగించేవని, తప్పుడువని, ఒక్క సాక్ష్యం కూడా నిరూపించదగ్గగా లేదని మహువా మోయిత్రా (Mahua Moitra) తనపై వచ్చిన బీజేపీ (BJP) ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey) ఆరోపణలను కొట్టి పడేశారు. 

నిశికాంత్ దుబేకు అందిన నోటీసులు: 

TMC MP మహువా మోయిత్రా (Mahua Moitra) మీద వేసిన పరువు నష్టం కలిగించే ఆరోపణలపై,  దూబేకి, న్యాయవాది (Lawyer) జై అనంత్ దేహద్రాయ్‌ (Jai Anant Dehadrai) కి లీగల్ నోటీసు పంపారు. వ్యక్తిగత మరియు రాజకీయ పగ తీర్చుకోవడానికి దూబే మరియు దేహద్రాయ్ (Jai Anant Dehadrai) తమ ప్రతిష్టపై దాడి చేశారని మహువా మోయిత్రా (Mahua Moitra) ఆరోపించింది. తప్పుడు ఆరోపణలు చేసి చివరికి తానే చిక్కుకున్నాడని మహువా మోయిత్రా (Mahua Moitra) మాట్లాడారు. 

మొయిత్రా, అదేవిధంగా దూబే (Nishikant Dubey)కి ఫీవర్ చేస్తున్న న్యాయవాది (Lawyer) దేహడ్రాయ్ (Jai Anant Dehadrai) చాలా సంవత్సరాలుగా స్నేహపూర్వకంగా ఉన్నప్పటికి, కొన్ని పరిస్థితులు వల్ల వ్యక్తిగత సమస్యలు ఎదురవ్వడం కూడా జరిగాయని నోటీసులో పేర్కొనడం జరిగింది. మహువా మొయిత్రాను హానికరమైన, అసభ్యకరమైన సందేశాలతో దేహడ్రాయ్ (Jai Anant Dehadrai) బెదిరించాడని.. ఆమె అధికారిక ప్రభుత్వ నివాసంలోకి చొరబడి కొన్ని వ్యక్తిగత ఆస్తులను దొంగిలించాడని నోటీసులో పేర్కొన్నారు. మార్చి 25, 2023 -సెప్టెంబరు 23, 2023న రెండు వేర్వేరు సందర్భాలలో డెహాడ్రాయ్‌పై ఫిర్యాదు దాఖలైంది.

మొయిత్రా తన పార్లమెంటరీ లాగిన్ ID, పాస్‌వర్డ్‌ను షేర్ చేసిందని, తద్వారా ఎవరైనా ఈజీగా ఆమె తరపున ప్రశ్నలను పోస్ట్ చేయవచ్చు అని పేర్కొంటూ హీరానందని (Hiranandani) గురువారం నాడు పార్లమెంటు (Parliament) ఎథిక్స్ కమిటీ ముందు ఒక లేఖను సమర్పించడంతో విషయం కొత్త మలుపు తిరిగింది. త్వరగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారని, ఆమె స్నేహితులు, సలహాదారులు ఆమెకు సలహా ఇచ్చారని హీరానందని (Hiranandani) తన లేఖలో పేర్కొన్నారు. 

క్యాష్ ఫర్ క్వెరీ (cash-for-query) వివాదం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. విచారణ సందర్భంగా, మొయిత్రా తరపు న్యాయవాది (Lawyer) కేసు నుండి ఉపసంహరించుకున్నారు. తదుపరి విచారణ అక్టోబర్ 31న జరగనుంది. ఈ పరిణామంపై దూబే స్పందిస్తూ, విజిల్‌బ్లోయర్ డెహద్రాయ్‌ను ప్రభావితం చేసేందుకు TMC ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ మోయిత్రాపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరొకసారి పేర్కొన్నారు దూబే.