మహిళా రిజర్వేషన్ బిల్లుకు మొదటి అడుగు వేసింది మహారాష్ట్ర

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది..  శ్రీకారం చుట్టిన మహారాష్ట్ర:  అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని […]

Share:

పలుచోట్ల వినిపిస్తున్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఒక ప్రత్యేకమైన అప్డేట్ అయితే వచ్చేసిందని చెప్పుకోవాలి. పార్లమెంటులోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎప్పటినుంచో, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవితతో సహా, చాలామంది ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోని మహిళా రిజర్వేషన్ బిల్లు (డబ్ల్యూఆర్‌బీ)కి సోమవారం కేంద్ర మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.. 

శ్రీకారం చుట్టిన మహారాష్ట్ర: 

అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా, 2010లో, UPA ప్రభుత్వం (ప్రస్తుతం భారత కూటమి) పార్లమెంటు ఎగువ సభలో బిల్లు ఆమోదాన్ని పొందడం జరిగింది, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, 1994లో సమగ్ర మహిళా విధానాన్ని విజయవంతంగా ఆమోదించిన తొలి రాష్ట్రంగా శ్రీకారం చుట్టింది మహారాష్ట్రే కావడం గర్వకారణం.

స్పందించిన కాంగ్రెస్: 

ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ, మహిళల రిజర్వేషన్లు అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చిరకాల కోరిక అంటూ మరొకసారి గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, బిల్లు గురించిన మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో చాలా బాగా చర్చించారని.. కొన్ని విషయాలలో సీక్రెట్స్ మైంటైన్ చేస్తూ పనిచేయడానికి బదులుగా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లడం చాలా మంచిది అని భావించారు మంత్రి.

రాజీవ్ గాంధీ, దేవెగౌడ, అటల్ బిహారీ వాజపేయి మరియు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అనేక ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్‌పై చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నించాయి, అయితే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లోని పార్టీల ఆవేశం కారణంగా కాంగ్రెస్ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ముందుకు రాలేకపోయింది అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ బిల్లును మే 6, 2008న రాజ్యసభలో ప్రవేశపెట్టింది అని మరొకసారి గుర్తు చేసింది కాంగ్రెస్.

రెండు సంవత్సరాల అనంతరం 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదం పొందింది. దీనికి అనుకూలంగా 186 ఓట్లు మరియు వ్యతిరేకం ఒకటి వచ్చాయి. అయితే లోక్‌సభలో చర్చకు రాలేదు మహిళా రిజర్వేషన్ బిల్లు. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులు తొలగించలేని కారణంగానే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు యాక్టివ్‌గా ఉంది. 

మారుమూల గ్రామాలకు కావాల్సింది రిజర్వేషన్: 

గ్రామీణ ప్రాంతాలలో, జెండర్ ఇనిక్వాలిటీ కనిపించే చోట, గ్రామీణ భారతీయ సమాజం నిర్మాణాత్మకంగా ఉన్న విధానం కారణంగా, స్త్రీ పురుషల నుండి సహాయం కోరకుండా, వారి ఫిర్యాదులతో మహిళా-ఎన్నికైన ప్రతినిధిని సంప్రదించడానికి అనువుగా ఉంటుందని భావించడం జరిగింది.

కాబట్టి, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం అనేది, ప్రతి గ్రామంలో స్త్రీల సమస్యలను పరిష్కరించడంలో మొదటి అడుగు. ప్రత్యేకమైన మద్దతును అందించడం ద్వారా పరిష్కారాలు దొరికినట్లు అవుతుంది. అయితే నిజానికి, ఆడవారికి రాజకీయాల్లో రావడానికి ఆసక్తి లేదని, అందుకే తాము రాజకీయాల్లో పాల్గొనడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారని కొన్ని అబద్ధపు వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నంలో వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

మాట్లాడిన సోనియా: 

ఆడవారి శక్తి అమోఘమైనదని, తాము తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్లే సాధించి చూపిస్తారని, పొగలో ఎప్పుడు వంటగదికే అంకితమయ్యే ఆడవాళ్లు, స్టేడియంలో తమ ఆడవారి సత్తా చూపించి భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఎంతోమంది ఆడవాళ్ళ ప్రయాణం గురించి ప్రస్తావించారు సోనియాగాంధీ. అంతేకాకుండా పీవీ నరసింహారావు పాలనలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుల్లోనే, తన భర్త రాజీవ్ గాంధీ ఆడవారి రిజర్వేషన్ల గురించి ప్రస్తావన జరిగిందని, రాజ్యాంగ సవరణ గురించిన ఆలోచన జరిగిందని, ఆనాటి రాజీవ్ గాంధీ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది అని, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడటం జరిగింది సోనియా గాంధీ.