మహాదేవ్ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌..!

బెట్టింగ్ యాప్ మహాదేవ్ మనీ ల్యాండరింగ్ స్కామ్‌ సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు 72 కేసులు నమోదు చేయగా.. ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలలో 449 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా డజనుకు పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఆగస్టు చివరి వారం నుంచి కేసుపై దర్యాప్తును ఈడీ ఉధృతం చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మనీల్యాండరింగ్ […]

Share:

బెట్టింగ్ యాప్ మహాదేవ్ మనీ ల్యాండరింగ్ స్కామ్‌ సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు 72 కేసులు నమోదు చేయగా.. ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలలో 449 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా డజనుకు పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఆగస్టు చివరి వారం నుంచి కేసుపై దర్యాప్తును ఈడీ ఉధృతం చేసింది.

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మనీల్యాండరింగ్ (ఎంఓబీ) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ వ్యవహారం బాలీవుడ్‌ చుట్టూ తిరుగుతోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ వివాహం ఈ ఏడాది ప్రారంభంలో యూఏఈలో జరిగింది. ఈ వేడుకకు ఆయన రూ. 250 కోట్ల ఖర్చు చేసి ధూం ధాంగా పెళ్లిచేసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకల్లో దాదాపు 17మంది బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తేలింది.

టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, విశాల్ దడ్లానీ, ఎల్లి అవ్రామ్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, కృష్ణ అభిషేక్, గాయకులు సులీ, నేహా కక్కర్ తదితరులు ఈ వేడుకలకు హాజరైనట్టు, గత సంవత్సరం సెప్టెంబర్‌లో జరిగిన కంపెనీ సక్సెస్ పార్టీకి హాజరు కావడం, ప్రదర్శన ఇచ్చారని ఈడీ వర్గాలు తెలిపాయి. “పెళ్లికి హాజరైనందుకు, ప్రదర్శన ఇచ్చినందుకు సెలబ్రిటీలు భారీ మొత్తంలో నగదును పారితోషికంగా స్వీకరించారు. ఈ డబ్బు నేరం ద్వారా వచ్చింది. కావున వీరూ బాధ్యులు కావచ్చు. పెళ్లిలో డజనుకు పైగా సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారు వీడియోలలో కనిపిస్తున్నారు” అని వివరించింది.

ఈ కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ సోదాలను నిర్వహించి, రూ.417 కోట్ల నగదుతో పాలు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటులు , గాయకులు హాజరైన విషయం బయటపడింది. ఈడీ చేతికి చిక్కిన సాక్ష్యాలను బట్టి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి హవాలా ద్వారా రూ. 112 కోట్లు, హోటల్ బుకింగ్‌ల కోసం రూ. 42 కోట్లు చెల్లించారు. అంతేకాదు వివాహానికి కుటుంబ సభ్యులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్‌కి ఛార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లినట్టు తేలింది. అలాగే, ముంబై నుంచి వెడ్డింగ్ ప్లానర్‌లు, డ్యాన్సర్‌లు, డెకరేటర్‌లు మొదలైన వారిని తీసుకెళ్లారని వెల్లడయ్యింది.

మహాదేవ్ బుక్ యాప్ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌‌లోని బిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌లు దుబాయ్ వేదికగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్త వినియోగదారులను చేర్చుకొని యూజర్ ఐడీలను క్రియేట్‌చేసి, బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బులను మళ్లించేందుకు మహాదేవ్ బుక్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందనేది ఈడీ ప్రధాన ఆరోపణ. బెట్టింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని హవాలా ద్వారా ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలిస్తోందని ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లోని సెవెన్ స్టార్ హోటల్‌లో ఈ నెల 18న జరిగే పార్టీకి హాజరయ్యేందుకు బాలీవుడ్ తారలకు ప్రమోటర్లు రూ.40 కోట్లు చెల్లించారని ఆరోపణలపై ఈడీ పరిశీలిస్తోంది. వీరంతా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ.

పాక్‌కు చెందిన ఓ వ్యక్తి సహాకారం, సమన్వయంతో బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించారనే ఆరోపణలను కూడా ఈ విచారణ ధ్రువీకరించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.భోపాల్‌లోని రాపిడ్ ట్రావెల్స్ యజమానులు ధీరజ్ అహుజా, విశాల్ అహుజాలు మహాదేవ్ యాప్ ప్రమోటర్లు, అసోసియేట్లు, సెలిబ్రిటీలకు విమాన టిక్కెట్లు బుకింగ్ వ్యవహారాలను చూస్తున్నట్టు తెలిసింది.