ఆదివాసిపై మూత్ర విస‌ర్జ‌న ఘ‌ట‌న‌లో ఊహించ‌ని మ‌లుపు

దస్మత్ రావత్ పై ఉచ్చ పోసిన ప్రవేశ్ శుక్లా : మానవత్వం అనేదే లేకుండా కొద్ది సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది, కుబ్రి గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు దస్మత్ రావత్ పై ప్రవేశ్ శుక్లా అనే అతను మూత్ర విసర్జన చెయ్యడం, అది సోషల్ మీడియా లో ఒక నెటిజెన్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చెయ్యడం, ఆ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం […]

Share:

దస్మత్ రావత్ పై ఉచ్చ పోసిన ప్రవేశ్ శుక్లా :

మానవత్వం అనేదే లేకుండా కొద్ది సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది, కుబ్రి గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు దస్మత్ రావత్ పై ప్రవేశ్ శుక్లా అనే అతను మూత్ర విసర్జన చెయ్యడం, అది సోషల్ మీడియా లో ఒక నెటిజెన్ వీడియో షూట్ చేసి అప్లోడ్ చెయ్యడం, ఆ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడం , దానిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని నిందితుడి ఇల్లు అక్రమ నిర్మాణం క్రింద జమకట్టి  ఇల్లు ని బుల్డోజర్ తో కూల్చేయడం, ఆ తర్వాత ప్రవేశ్ శుక్లా పై వివిధ చట్టాల క్రింద కేసులు నమోదు చేసి జైలు పాలు చెయ్యడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరో విశేషం ఏమిటంటే మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బాధితుడి కాళ్ళను నీళ్లతో కడిగి మరీ క్షమాపణ కోరడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం గా మారింది.

దస్మత్ రావత్ కాళ్ళు కడిగి ప్రవేశ్ శుక్లా ని అరెస్ట్ చేయించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ :

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక సామాన్యుడి పాదాలు కడిగి క్షమాపణలు కోరాడు అంటే, అప్పట్లో ఈ సంఘటన జనాల్లో ఏ స్థాయి ప్రకంపనలు రేపిందో ఊహించుకోవచ్చు. ఒక గిరిజనుడు పై అలాంటి హేయమైన కార్యక్రమం చేసినందుకు గాను, ఆ జాతి మొత్తం అవమాన కరంగా ఫీల్ అయ్యింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ, మధ్య ప్రదేశ్ లో అశాంతి వాతావరణం నెలకొనేలా చేసింది ఈ సంఘటన. అయితే ఈ ఘటన గురించి చాలా కాలం తర్వాత ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అదేమిటంటే బాధితుడు దస్మత్ రావత్ నిందితుడు ప్రవేశ్ శుక్లా ని విడిచిపెట్టాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.  ఈ సంద్రాభంగా ఆయన మాట్లాడుతూ ‘జరిగింది ఎదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రవేశ్ శుక్లా తన తప్పుని తాను తెలుసుకొని పాస్చాత్తాపం పడుతున్నాడు. ఇకనైనా అతడికి క్షమాబిక్ష పెట్టి విడిచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ మీడియా ముఖంగా ఆయన వ్యాఖ్యానించాడు.

మాకు ఎవరితో శత్రుత్వం వద్దు..అందుకే విడిచిపెట్టమని వేడుకుంటున్నాను : దస్మత్ రావత్ 

అతను చేసింది చాలా తప్పు కదా అని మీడియా దస్మత్ రావత్ ని అడగగా , అప్పుడు ఆయన దానికి సమాధానం చెప్తూ ‘అతను చేసింది చాలా నీచమైన పనే, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ అతను మా ప్రాంతానికి పూజారి, అందుకే అతనిని విడిచిపెట్టి మా ఊరుకి రోడ్డు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ సంఘటన జరిగి చాలా కాలం అయిపోయింది, ఆ రోజు నేను రోడ్డు మీద దుకాణం వద్ద కూర్చొని ఉంటె అతగాడు నా మీదకి ఉచ్చ పోసి వెళ్ళిపోయాడు, ఆ సమయం లో నేను అతడి ముఖం కూడా సరిగా చూద్దలేదు. ముఖం కూడా చూడని వ్యక్తి తో నాకు శత్రుత్వం వద్దు, అతను చేసిన తప్పుకి పడాల్సిన శిక్ష ఎలాగో పడిపోయింది, అది చాలు. ఇప్పుడంటే ఈ సంఘటన గురించి పోలీసులు, ప్రభుత్వం అందరూ మాకు అండగా ఉన్నారు కాబట్టి, ప్రవేశ్ శుక్లా కి సంబంధించిన వ్యక్తులు మాపై ఎలాంటి దాడులు చెయ్యలేదు. కొన్ని రోజులు తర్వాత ఈ సంఘటన మర్చిపోయాక మా పరిస్థితి ఏమిటి ?, పెళ్ళాం పిల్లలు కలిగిన వాడిని, రోజుకు వంద నుండి 200 రూపాయిలు సంపాదిస్తే కానీ పూట గడవని పరిస్థితి, ఇలాంటి సమయం లో మాకు ఒకరితో శత్రుత్వం అవసరమా?, దయచేసి ఇక అతడిని వదిలేయండి’ అంటూ దస్మత్ రావత్ మీడియా ముందుకు వచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. మరోపక్క ఈ సంఘటన ని రాజకీయ పార్టీలు వాడుకొని ప్రవేశ్ శుక్లా మీవాడే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులూ, లేదు వాడు మీవాడే అంటూ బీజేపీ పార్టీ నాయకులూ తిట్టుకుంటున్నారు. ఇక ప్రవేశ్ శుక్లా కి మద్దతుగా బ్రాహ్మణ సంఘాలు నిల్చి , ప్రవేశ్ శుక్లా చేసింది ముమ్మాటికీ తప్పే, కానీ అతని ఇల్లుని కూల్చేసి, అతని కుటుంబానికి నిలువెత్తు నీడ లేకుండా చెయ్యడం ఎంత మాత్రం సబబు అని బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.