అయోధ్యలో రూ.100 కోట్ల‌ లోటస్ ఫౌంటెన్ ప్రాజెక్ట్

అయోధ్యలో రామ మందిరమే కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రామ మందిరానికి చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం, అయోధ్య ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఈ మధ్యనే ప్రారంభం అవ్వడమే కాకుండా, జనవరి 2024 కల్లా పూర్తవుతుందని అంచన వేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక అట్రాక్షన్ అయోధ్యలో కనువిందు చేయనుంది. అదే ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న లోటస్ ఫౌంటెన్.  లోటస్ ఫౌంటెన్ విశేషాలు:  గుప్తర్ ఘాట్ నుండి నయా ఘాట్ వరకు 20 […]

Share:

అయోధ్యలో రామ మందిరమే కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రామ మందిరానికి చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరి కోసం, అయోధ్య ఎయిర్ పోర్ట్ ప్రాజెక్ట్ ఈ మధ్యనే ప్రారంభం అవ్వడమే కాకుండా, జనవరి 2024 కల్లా పూర్తవుతుందని అంచన వేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొక అట్రాక్షన్ అయోధ్యలో కనువిందు చేయనుంది. అదే ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న లోటస్ ఫౌంటెన్. 

లోటస్ ఫౌంటెన్ విశేషాలు: 

గుప్తర్ ఘాట్ నుండి నయా ఘాట్ వరకు 20 ఎకరాల విస్తీర్ణంలో తామరపువ్వు ఆకారపు (లోటస్) ఫౌంటెన్‌ను నిర్మించాలని, 50 మీటర్ల ఎత్తువరకు ఫౌంటెన్ నీరు చిమ్మెలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. శ్రీరామ మందిర వైభవాన్ని పెంచే, శ్రీ రామ మందిరం ప్రత్యేక ప్రాముఖ్యతను గుర్తించే చక్కని థీమ్‌తో, నిజంగా దైవిక, అదే విధంగా ఆధ్యాత్మిక అనుభూతిని అందించడానికి ఫౌంటెన్ కాంప్లెక్స్ అభివృద్ధికి తన హాలు జరుగుతున్నాయి.

ఈ ఫౌంటెన్ ఆలయ పరిసరాలలో ఉండే వెయిటింగ్ జోన్ విధంగానే కాకుండా.. తాజా, విశ్రాంతి ప్రదేశంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే నిజానికి రామ మందిరానికి విచ్చేసే యాత్రికులు మరియు పర్యాటకులకు, ప్రత్యేకమైన మరపురాని అనుభూతిని అందించడానికి తగిన ప్రదేశంగా కూడా పని చేస్తుంది. ఇది “మాయా ప్రదేశం”గా కనువిందు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఫౌంటెన్ అందాలు, ముఖ్యంగా వీక్షకులకు కనువిందు చేయడమే కాకుండా ప్రశాంతతను అందించే విధంగా నిర్మానించాలని ప్రణాళిక జరుగుతోంది.

లోటస్ ఫౌంటెన్ డిజైన్: 

మన భారతదేశ జాతీయ పువ్వుగా చెప్పుకునే తామర పువ్వు అంటే లోటస్ ఆకారంలో ఫౌంటెన్ నిర్మాణం జరగనుంది. ఇది భారతదేశ గుర్తింపును పెంపొందించడంలో సహాయపడుతుందని అంచనా. ఫౌంటెన్ డిజైన్ హిందూమతంలోని ఏడు పవిత్ర నదులకు నివాళిగా కమలం రూపంలో ఏడు రేకులను కలిగి ఉంటుంది, అవి.. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మద, గోదావరి మరియు కావేరి. ఫౌంటెన్‌లోని కేంద్ర పుష్పంగా ఏర్పడే ఏడు రేకులు విష్ణువు యొక్క ఏడవ అవతారమైన రాముడికి నివాళి అని నివేదికలు పేర్కొన్నాయి.

విజిటర్స్ కోసం: 

అయోధ్యకు వచ్చే వీక్షకులకు, ఫౌంటెన్ ప్రత్యేక ఎక్స్పీరియన్స్ అందించేలా రూపొందించబడింది. పగటిపూట, ఫౌంటెన్ అనేక స్టెప్ క్యాస్కేడ్‌ల ద్వారా యానిమేట్ చేయడం జరుగుతుంది, డిఫరెంట్ డిజైన్స్, రిఫ్లెక్స్‌లతో కనువిందు చేస్తుంది. మరింత ప్రశాంతత, కనువిందు చేసేలా, ఫౌంటెన్ ద్వారా వచ్చే నీటిని అనుసరించే ప్రశాంతమైన సంగీతాన్ని అందించడం జరుగుతుంది.

సూర్యాస్తమయం తర్వాత, ఫౌంటెన్ వేదికగా మారుతుంది, ఇక్కడ ప్రత్యేకంగా రూపొందించిన వాటర్ షోలు వీక్షకులను రామాయణ ప్రపంచానికి గుర్తు చేసేలా ఉంటుందంటున్నారు. రామ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, లోటస్ టెంపుల్ నిజానికి ప్రత్యేకమైన అనుభూతి అందిస్తుంది అని నివేదికలు పేర్కొన్నాయి. 

అయోధ్య విమానాశ్రయం: 

అయోధ్య విమానాశ్రయం మొదటి దశ నిర్మాణం అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతుందని, ఉత్తరప్రదేశ్ టూరిజం మంత్రి జైవీర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. అయితే, విమానాశ్రయం అధికారిక ప్రారంభోత్సవం జనవరి 2024లో జరుగుతుంది అని పేర్కొన్నారు. విమానాశ్రమంలో 6,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక మధ్యంతర టెర్మినల్‌ కూడా ఉంటుంది. రద్దీ సమయాల్లో గరిష్టంగా 300 మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి మరియు 6,00,000 మంది ప్రయాణికులు కోసం వార్షిక సామర్థ్యంతో రూపొందించబడిన ఈ టెర్మినల్ నిజానికి ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. 

అంతేకాకుండా, పవర్ వినియోగాన్ని తగ్గించడం మరియు మొత్తం సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పర్యావరణానికి ప్రతిస్పందించే వ్యవస్థలు అనేవి నిర్మాణంలో భాగంగా ఉన్నాయి. స్కైలైట్‌లు, సోలార్ పవర్ సిస్టమ్‌లు మరియు సమర్థవంతమైన రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ మెకానిజమ్‌లు లాంటివి కేవలం కొన్ని పర్యావరణ స్పృహతో కూడిన ఫీచర్లు మాత్రమే విమానాశ్రయంలో చేర్చబడ్డాయి. సౌకర్యాల పరంగా, టెర్మినల్‌లో ఎనిమిది చెక్-ఇన్ కౌంటర్లు మరియు మూడు కన్వేయర్ బెల్ట్‌లు, అరైవల్ ఏరియాలో రెండు మరియు డిపార్చర్స్ ఏరియాలో ఒకటి ఉంటాయి.