పురంధరేశ్వరి తెలుగుదేశం అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు 

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు తెలుగుదేశం(Telugudesam Party) అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.  బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడు గా ఉన్న సోము వీర్రాజు ను తొలగించి నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి(Daggubati Purandareswari) ను రాష్ట్ర అధ్యక్షురాలు గా నియమించారు. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీజేపీ అధ్యక్షురాలు […]

Share:

బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు తెలుగుదేశం(Telugudesam Party) అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. 

బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడు గా ఉన్న సోము వీర్రాజు ను తొలగించి నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి(Daggubati Purandareswari) ను రాష్ట్ర అధ్యక్షురాలు గా నియమించారు. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వైసీపీ హయాంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అని ఆరోపించారు. తాజాగా ఈ ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా( RK Roja) స్పందించారు. 

తిరుపతి లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తక్కువ అప్పు చేసినట్లు వెల్లడించారు అని కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అవేమీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద తప్పుడు ఆరోపణలు చేశారు అని అన్నారు. దగ్గుబాటి పురంధరేశ్వరి (Daggubati Purandareswari)కు ఉన్న ఒకే ఎజెండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S Jagan Mohan Reddy)ను విమర్శించడమే అని అన్నారు. తెలుగు దేశం పార్టీకి సహాయం చేయడమే పురంధరేశ్వరి పని అని కూడా అన్నారు. బీజేపీ పార్టీ ను అభివృద్ధి చేయడం కంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఆమె పని చేస్తున్నట్లు రోజా (RK Roja) ఆరోపించారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి మాట్లాడుతూ పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయినా కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ను గెలిపించి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu )ను ముఖ్యమంత్రి చేయాలి అనుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదని రోజా ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు నమ్ముతారు అని ప్రశ్నించారు. 

ఆర్కే రోజా మొదటి నుండి వైసీపీ ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్నారు, అయితే ప్రతిపక్షాలు ఆమెను జబర్దస్త్ ఆంటీ అని సోషల్ మీడియా లో ట్రోల్ చేశారు, సోషల్ మీడియాలో మరికొందరు రోజా కుటుంబం గురించి కూడా ట్రోల్స్ చేశారు. గతంలో ప్రతిపక్షాలు తన గురించే కాకుండా తన కుటుంబ సభ్యులు తన కూతురు గురించి కూడా తప్పుగా మాట్లాడినట్టు ఆ విషయం తనకు చాలా బాధ కలిగించింది అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా (RK Roja)చెప్పారు. తన వరకూ వస్తే కానీ ఆమెకు తెలియలేదు కానీ రోజా గతంలో నారా లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు మీద తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ బుద్ధి ఏమైంది అని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు.