కలిసి లేనప్పటికీ విడాకులు ప్రక్రియ తప్పనిసరి చేసిన హైకోర్టు

ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలుకి విడిపోవడం సాదాసీదా అయిపోయింది. పెళ్లి చేసుకున్నా కొద్ది రోజులకే  విడిపోతున్నారు కొందరు. మరికొందరు విడాకులు తీసుకోకుండా దూరంగా బ్రతుకుతున్నారు. మరి కొందరు లివిన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ పలు వివాదాల్లో కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక కేసు విషయంలో హైకోర్టు పలు అంశాల మీద మీద చర్చించి..స్పష్టం చేసింది. భార్యాభర్తల దూరంగా ఉంటున్నప్పటికీ ఏడాకుల తప్పనిసరి చేసింది హై కోర్ట్. అంతేకాకుండా వేరే మహిళతో భర్త ఉంటున్నప్పటికీ, సరేనా […]

Share:

ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలుకి విడిపోవడం సాదాసీదా అయిపోయింది. పెళ్లి చేసుకున్నా కొద్ది రోజులకే  విడిపోతున్నారు కొందరు. మరికొందరు విడాకులు తీసుకోకుండా దూరంగా బ్రతుకుతున్నారు. మరి కొందరు లివిన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ పలు వివాదాల్లో కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక కేసు విషయంలో హైకోర్టు పలు అంశాల మీద మీద చర్చించి..స్పష్టం చేసింది. భార్యాభర్తల దూరంగా ఉంటున్నప్పటికీ ఏడాకుల తప్పనిసరి చేసింది హై కోర్ట్. అంతేకాకుండా వేరే మహిళతో భర్త ఉంటున్నప్పటికీ, సరేనా ఆధారాలు లేకుండా విడాకులు ఇచ్చే ప్రసక్తి ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, లివిన్ రిలేషన్షిప్ గురించిన దుష్ప్రభావాల గురించి కూడా స్పష్టం చేసింది హైకోర్టు. 

స్పష్టం చేసిన హైకోర్టు: 

ఎక్కువ కాలం పాటు విడిపోయిన తర్వాత విడాకుల ప్రక్రియ పెండింగ్‌లో ఉన్న సమయంలో, మరొక మహిళతో కలిసి జీవించడం, భార్య వాళ్ళ ఇబ్బంది ఉన్నట్లు రుజువైన కారణంగా భర్తకు విడాకుల నుండి విముక్తి కలిగించదని ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు స్పష్టం చేయడం జరిగింది.

అలాంటి ఒక జంటకు కుటుంబ న్యాయస్థానం మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తూ, జస్టిస్ సురేష్ కుమార్ కైట్ నేతృత్వంలోని, 2005 నుండి విడిగా జీవిస్తున్నామని, భార్య చేసిన విభేదాలు మరియు క్రిమినల్ ఫిర్యాదులను ధర్మాసనం గమనించింది. భర్త జీవితం ఈ మేరకు చిన్న భిన్నంగా మారడంకాకుండా శాంతి కోల్పోయినట్లు వెల్లడైంది. 

విడిపోయినట్లు సమానం కాదు: 

భర్త మరియు అతని కుటుంబ సభ్యుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, తరచూ గొడవలు మానసిక వేదనకు దారితీస్తాయని కోర్టు గమనించింది. అంతేకాకుండా చాలాకాలం విడిపోయిన తర్వాత, కలిసే అవకాశం లేకుండా విడిపోయిన చాలా సంవత్సరాల తర్వాత, ప్రతివాది భర్త మరొక స్త్రీతో కలిసి జీవించడం ద్వారా తన శాంతి మరియు సౌకర్యాన్ని పొంది ఉండవచ్చు, కానీ, అది విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉన్న తరువాత జరిగిన సంఘటన.. అయినప్పటికీ అది విడిపోవడంతో సమానం కాదని విడాకులు మాత్రమే న్యాయపరమైన, చట్టపరమైన విధానమని.. కోర్టు పేర్కొంది. 

అయితే ఒక కేసు విషయంలో, విడాకులు తీసుకోకుండా భర్త చేసిన అవమానకరమైన విషయాలకు సంబంధించి భార్య నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. భార్య భర్తను చాలావరకు హింసకు గురి చేసిందని కుటుంబ న్యాయస్థానం సరిగ్గానే నిర్ధారించిందని, అంతేకాకుండా కేసు పరంగా ఆమె అప్పీల్‌ను కొట్టివేసిందని పేర్కొంది.

కేసులో, తనపై వచ్చిన ఆరోపణలు సరికాదని పేర్కొంటూ, భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను భార్య సవాలు చేసింది. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. అయితే భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించిన వివరాలు లేదా ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.

లివ్ ఇన్ రిలేషన్షిప్కి, పెళ్లి బంధానికి ఇదే తేడా: 

నిజానికి యువత లివ్ ఇన్ రిలేషన్షిప్ కు ఎక్కువ ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలు కేవలం కొంతకాలం మాత్రమే అని, ముఖ్యంగా యువత ఇటువంటి బంధాల వైపు మక్కువ చూపుతూ, ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నట్లు మండిపడింది హైకోర్టు. అయితే ఇటువంటి బంధాలలో ప్రత్యేకించి భద్రత, సామాజిక అంగీకారం మరియు స్థిరత్వం వంటివి కనిపించవని కేవలం అవి పెళ్లి బంధం లోనే ఉంటాయని తేల్చి చెప్పింది బెంచ్. 

దేశంలో ఇదే విధమైన ధోరణితో, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. వివాహ బంధంలో భాగస్వామి విశ్వాసం మరియు స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా మారతాయని.. యువత మాత్రం తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం చూస్తుందని, దీర్ఘకాలంలో ఏర్పడే సమస్యలను పట్టించుకోకపోవడం మరో సమస్యగా మారుతుందని, హైకోర్టు తేల్చి చెప్పింది.