Wedding: వృద్ధాప్యంలో గెంటేస్తే.. ఇలా వివాహం చేసుకున్నారు

పెద్దలు, అనేక మంది కవులు చెప్పినట్లు జీవితం అనేది ఎవరికీ అంత సులభంగా ఉండదు. అది వివాహం (Wedding) అయినా కానీ వివాహం (Wedding) కాకపోయినా కానీ ఎవరి సమస్యలు వారిని వేధిస్తుంటాయి. కొన్ని సార్లు మనకు జీవితాంతం తోడుగా ఉంటారని వివాహం (Wedding) చేసుకున్న జీవిత భాగస్వాములు కూడా మనల్ని పట్టించుకోకుండా ఉంటారు. ఇంకొన్ని సార్లు మన కడుపున పుట్టిన పిల్లలు మనల్ని పట్టించుకోరు. అందుకోసం కొంత మంది వివాహం (Wedding) ను తప్పుబడుతూ ఉంటారు. […]

Share:

పెద్దలు, అనేక మంది కవులు చెప్పినట్లు జీవితం అనేది ఎవరికీ అంత సులభంగా ఉండదు. అది వివాహం (Wedding) అయినా కానీ వివాహం (Wedding) కాకపోయినా కానీ ఎవరి సమస్యలు వారిని వేధిస్తుంటాయి. కొన్ని సార్లు మనకు జీవితాంతం తోడుగా ఉంటారని వివాహం (Wedding) చేసుకున్న జీవిత భాగస్వాములు కూడా మనల్ని పట్టించుకోకుండా ఉంటారు. ఇంకొన్ని సార్లు మన కడుపున పుట్టిన పిల్లలు మనల్ని పట్టించుకోరు. అందుకోసం కొంత మంది వివాహం (Wedding) ను తప్పుబడుతూ ఉంటారు. కానీ ఇలా వివాహం (Wedding) ను తప్పు పట్టడం సరైన పద్ధతి కాదని ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయింది. మనం ఇష్టపడి వివాహం (Wedding) చేసుకున్న వారిలో లోపం ఉంటుందేమో కానీ వివాహ వ్యవస్థలో మాత్రం లోపం ఉండదు.  అది కాకుండా వివాహానికి (Wedding) అనేక మంది వయసును చూస్తుంటారు. ఇలా వివాహానికి (Wedding) వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘటనలు ఇప్పటికే అనేకం జరిగాయి. అసలు జీవితం గురించి ఓ ప్రముఖ ఇంగ్లిష్ కవి షేక్స్ పియర్ కూడా తన నవలల్లో పేర్కొన్నాడు. జీవితం సాఫీగా సాగదు. ఇది అనేక మలుపులు తీసుకుంటుందని షేక్స్ పియర్ తన పురాణ నాటకం ‘ఎ మిడ్‌సమ్మర్ నైట్స్ డ్రీమ్’లో చిత్రీకరించాడు. జీవితం అచ్చం అతను చెప్పినట్లే జరుగుతుందని పలువురు ఇప్పటికే కామెంట్లు చేశారు. 

ఆశ్రమంలో పెళ్లి.. 

పెళ్లి (Wedding) అంటే నూరేళ్ల పంట అని  అంటారు. అటువంటి పెళ్లిని (Wedding) అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పెళ్లి (Wedding) కోసం ఎన్నయినా సరే  అప్పులు తీసుకొచ్చి గ్రాండ్ గా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల ఆశ్రమంలో మాత్రం వింత ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉంటున్న దాస్ మరాండి (63) పద్మావతి దాస్ (65) అనే ఇద్దరు సీనియర్ సిటిజన్లు వేద మంత్రాలు లేకుండానే (Wedding) ఒక్కటయ్యారు. వారు అధికారుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. పలు వార్తా కథనాల ప్రకారం దాస్ మరాండి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కుష్టు వ్యాధి చికిత్స కోసం షెల్టర్ హోమ్‌ కు వచ్చాడట. పద్మావతి దాస్ చాలా రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. మరాండి అనే వ్యక్తి  బ్రహ్మచారి కాగా.. ఆ మహిళకు ఇంతకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పద్మావతికి వికలాంగ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆమె జీవితం తలకిందులైంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమెను బయటికి  వెళ్లగొట్టారు. పద్మావతి అప్పుడు బతుకుపై ఎలాంటి ఆశ లేకపోవడంతో షెల్టర్ హోమ్‌ కు వచ్చింది.  పద్మావతికి వ్యాధి నయమైనప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె అక్కడే ఉండిపోయింది. కొద్ది నెలల చికిత్స తర్వాత, మరాండీ కూడా వ్యాధి నుంచి బయటపడ్డాడు. షెల్టర్ హోమ్‌ లో ఉండగానే.. వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత వారు ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వారి వివాహాన్ని బాలాసోర్‌ లోని స్థానిక జగన్నాథ ఆలయంలో ఏర్పాటు చేసింది.

పాల్గొన్న అధికారులు 

ఈ కార్యక్రమంలో చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ దులాల్‌సేన్ జగదేవ్, లెప్రసీ పేషెంట్స్ షెల్టర్ హోమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమిత్రా డే, అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా పాల్గొన్నారు.