బ్రీజ్ భూషణ్ శరన్ కి మద్దతుగా నిలిచిన రాజీవ్ మోహన్.

రెజ్లర్ల పై లైంగిక వేధింపుల కేసులో బ్రీజ్ భూషణ్ తరుపున నిలబడ్డ అడ్వకేట్ రాజీవ్ మోహన్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై తదుపరి విచారణ వాయిదా: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసు విచారణ లో బ్రీజ్ భూషణ్ తరుపున న్యాయవాది గా  2012 వ సంవత్సరం లో నిర్భయ అత్యాచారం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన  […]

Share:

రెజ్లర్ల పై లైంగిక వేధింపుల కేసులో బ్రీజ్ భూషణ్ తరుపున నిలబడ్డ అడ్వకేట్ రాజీవ్ మోహన్

రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై తదుపరి విచారణ వాయిదా:

బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసు విచారణ లో బ్రీజ్ భూషణ్ తరుపున న్యాయవాది గా  2012 వ సంవత్సరం లో నిర్భయ అత్యాచారం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన  అడ్వకేట్ రాజీవ్ మోహన్ ముందుకొచ్చాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో మంగళవారం బ్రిజ్ భూషణ్ తరపున రాజీవ్ మోహన్ వాదించారు. అతనిపై వేధింపుల కేసులో కోర్టు అతనికి రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జూలై 20న విచారణ జరగనుంది.

నిర్భయపై సామూహిక అత్యాచారం మరియు హత్య చేసినందుకు నలుగురు వ్యక్తులను మార్చి 2020లో దోషులుగా నిర్ధారించి ఉరితీశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బలమైన చట్టాలను కోరింది.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని, డబ్ల్యూఎఫ్‌ఐ అత్యున్నత పదవి నుంచి తొలగించాలని కోరుతూ పలువురు రెజ్లర్లు ఈ ఏడాది ప్రారంభం నుంచి నిరసనలు చేస్తున్నారు. జూన్ 2న, బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు మరియు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో అతను అనుచితంగా తాకడం, అమ్మాయిల ఛాతీపై చేయి వేయడం, తన చేతిని ఛాతీ నుండి వెనుక భాగానికి తరలించడం మరియు ఆ తర్వాత వారిని వెంబడించడం వంటి చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు.

రెజ్లర్లకు అండగా నిలబడ్డ నిర్భయ తల్లి ఆశా దేవి : 

జూన్‌లో రెజ్లర్ల   కేసుకు సంబంధించి ఒక ప్రముఖ జాతీయ మీడియా తో  మాట్లాడిన నిర్భయ తల్లి ఆశా దేవి, రెజ్లర్ల ఆరోపణలపై తక్షణమే విచారణ చెయ్యాలి, వారికి తగిన  న్యాయం జరిగే వరకు  అది దేశ న్యాయ వ్యవస్థపై మచ్చగా మారుతుందని అన్నారు. దేశం లో ప్రజా ప్రతినిధి స్థానం లో కూర్చొని ఇలాంటి నీచమైన పనులు చేసే వారు తప్పించుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే రేపు వీళ్ళను కరుడుగట్టిన నేరస్థులు మన పరిపాలకులు అవుతారు. ఇప్పటికీ అలాంటి వారే ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడి చట్టసభలకు పంపిస్తున్నారు అంటూ నెటిజెన్స్ సైతం ఆరోపిస్తున్నారు.ఇది ఇలా ఉండగా బ్రీజ్ భూషణ్ శరణ్ ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీ గా రాజ్య సభకి ఎన్నిక కాబడ్డాడు. అందులో ఆయన 5 సార్లు బీజేపీ పార్టీ తరుపున గెలవగా, ఒక్కసారి సమాజ్ వాద్ పార్టీ తరుపున గెలిచాడు. ఇతని మీద 38 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మర్డర్ లు,కిడ్నాపులు , మానభంగాలు ఇలా ఒక్కటా రెండా ఎన్నో విధమైన కేసులు ఈయన మీద ఉన్నాయి. ఇలాంటి వాడికి పార్టీ టికెట్ ఇవ్వడం ఏంటో అని సోషల్ మీడియా లో బీజేపీ ప్పర్తి అధిష్టానం పై విరుచుకుపడే నెటిజెన్స్ చాలా మంది ఉన్నారు. కానీ అవన్నీ అసత్య ఆరోపణలే, కావాలని భూషణ్ అంటే పడని వాళ్ళు కుట్రలు చేసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు అని భూషణ్ మద్దతు దారులు అంటున్నారు. అంతే కాదు 1992 వ సంవత్సరం లో బాబ్రీ మసీద్ కూల్చివేత లో ఇతని హస్తం కూడా ఉందని సీబీఐ బ్రీజ్ భూషణ్ మరియు అతని అనుచరులు  39 మందిని అరెస్ట్ చేసారు. అంతే కాదు నేను ఒక వ్యక్తిని మర్డర్ చేశాను అని పబ్లిక్ గా మీడియా ముందు ఒప్పుకున్న వ్యక్తి ఈయన, అలాంటిది రెజ్లర్ల మీద అలా లైంగిక వేధింపులు చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు నెటిజెన్స్.