వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల(TTD)కు భారీగా పోటెత్తిన భక్తులు

TTD: వైకుంఠ ఏకాదశి(డిసెంబర్ 23) ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది.

Courtesy: x

Share:

తిరుమల: వైకుంఠ ఏకాదశి(డిసెంబర్ 23) ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి తితిదే ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి.. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్‌ చేరుకుంది. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. స్వామిని దర్శించుకొనేందుకు  మంత్రులు, ఎమ్మెల్యేలుక్యూ కడుతున్నారు. 

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దాదాపు 9 కేంద్రాల ద్వారా తితిదే టోకెన్లు జారీ చేస్తున్నారు. మొత్తం 4,23,500 వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు.శనివారం వేకువజామున 1.45 గంటల నుంచి వైకుంఠ ద్వారదర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఎల్లుండి 24న ద్వాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథం, ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం నిర్వహిస్తారు. రేపటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది.

 
భారీ సంఖ్యలో వస్తున్న భక్తులను ద్రుష్టిలో పెట్టుకుని టీటీడీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగిసిన తర్వాత సర్వదర్శనం భక్తులకు వేగంగా దర్శనం పూర్తయ్యేలా చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే తిరుమలలో అద్దె గదులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. శ్రీవారి దేవాలయం తో పాటు అన్నప్రసాద భవనం, లడ్డు వితరణ కేంద్రం, మాడ వీధులు, రోడ్లు, అఖిలాండం, బస్టాండ్, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులతో రద్దీగా ఉంది. టోకెన్ల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు తితిదే భక్తుల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ధరించాలని భక్తులకు సూచిస్తున్నారు. భక్తులకు ఆహారం, నీటి సౌకర్యంతో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తిరుమలలో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.


టీటీడీ తీరుపై భక్తుల ఆందోళన:
 తిరుమలకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి అనుమతి నిరాకరించారు. దీంతో భక్తులు టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూలైన్లో నిలబడగా వారిని దర్శనానికి అనుమతిని నిరాకరించారు. తమకు సాధారణ దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. కుంఠ ద్వారా దర్శనానికి  కాగా, నిన్న 59,868 మంది భక్తులు స్వామివారిని దర్శంచుకోగా 23,935 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.91 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు.