Tenant: ఇదెక్కడి అరాచకంరా అయ్యా..

అద్దె దారులు (Tenant) ఓనర్ల చేతిలో చుక్కలు చూడడం ఎప్పటి నుంచో ఉన్న విషయమే. ఒకప్పుడు అనాగరికం. ప్రస్తుతం ప్రపంచం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నా కానీ ఓనర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అద్దెదారులు (Tenant) మీద తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు. చిన్న చిన్న సాకులు చూపి వేలకు వేలు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి సిడ్నీలో వెలుగులోకి వచ్చింది. ఓనర్ (Owner) తీరును చూసి […]

Share:

అద్దె దారులు (Tenant) ఓనర్ల చేతిలో చుక్కలు చూడడం ఎప్పటి నుంచో ఉన్న విషయమే. ఒకప్పుడు అనాగరికం. ప్రస్తుతం ప్రపంచం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నా కానీ ఓనర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అద్దెదారులు (Tenant) మీద తమ ప్రతాపం చూపుతూనే ఉన్నారు. చిన్న చిన్న సాకులు చూపి వేలకు వేలు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి సిడ్నీలో వెలుగులోకి వచ్చింది. ఓనర్ (Owner) తీరును చూసి బిత్తరపోయిన అద్దె దారుడు (Tenant) తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లగక్కాడు. దీంతో అందరూ ఆ ఓనర్ (Owner) బిహేవియర్ పై మండిపడుతున్నారు. ఆ ఓనర్ కు అగెనెస్ట్ గా పోస్టులు చేస్తున్నారు. 

సిడ్నీలో జరిగిందిదే.. 

ఓనర్లు అద్దెదారుల (Tenant) గిల్లికజ్జాలు ఈనాటివి కావనే చెప్పాలి. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో (Sydney) జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. ఓనర్లు అద్దెదారుల (Tenant) దగ్గరి నుంచి విపరీతమైన అద్దెలు డిమాండ్ చేస్తారనే విషయం తెలిసిందే. కానీ ఈ ఘటన మాత్రం మానవత్వానికే మచ్చగా నిలిచింది. ఓ ఫ్లోర్ మీద ఉన్న వుడెన్ ప్యానెల్ పై ‘దాదాపు కనిపించని’ స్క్రాచ్ మార్క్‌ ను రిపేర్ చేయడానికి ఒక యజమాని $628 (రూ. 52,000 కంటే ఎక్కువ) డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ విన్న తర్వాత ఆ అద్దెదారు ఆగ్రహానికి గురయ్యాడు. మరియు ఈ వికృత ప్రవర్తన గురించి సోషల్ మీడియాలో తెలియజేశాడు. దీంతో సోషల్ మీడియా యూజర్లంతా ఆ అద్దెదారు (Tenant) కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా కనిపించని చిన్న గీతకు ఇంత వసూలు చేయడం మీకు జోక్ గా అనిపించడం లేదా అని ఆ అద్దెదారుడు (Tenant) సోషల్ మీడియాలో ప్రశ్నించాడు. దీనికి సోషల్ మీడియా యూజర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

ఆ ఓనర్ ప్లాన్ అదే.. 

ఆ ఓనర్ (Owner) ప్లాన్ ఇదేనంటూ అద్దెదారుడు (Tenant) తెలిపాడు. అనుకోకుండా ఒక ప్యానెల్‌ పై స్క్రాచ్ చేశాను కాబట్టి మొత్తం ఫ్లోరింగ్‌ ను తీసివేసి, మళ్లీ చేయడం ఓనర్ ప్లాన్ అని వివరించాడు. మరోసారి తాను చేసిందేంటో ఆ అద్దెదారుడు (Tenant) రిపీట్ చేశాడు. నా వల్లకేవలం ఒక చిన్న గీత అనుకోకుండా పడింది అంతే అని అతడు తెలిపాడు. అద్దెదారుడు (Tenant) ఆ పోస్టు చేసిన నుంచి సోషల్ మీడియా యూజర్లంతా ఆ ఓనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దెదారుడికి (Tenant) మద్దతు ఇచ్చారు. చాలా మంది భారీ మొత్తాన్ని చెల్లించకుండా ఉండేందుకు ఏమి చేయాలనే దానిపై సలహాలు కూడా ఇచ్చారు. కొంత మంది ఫన్నీగా కూడా కామెంట్లు చేశారు. మీరిచ్చే డబ్బులతో మీ ఓనర్ కొత్త ఫ్లోర్ (అంతస్తు) కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇంకో యూజర్ స్పందిస్తూ.. ఇది మరీ ఘోర తప్పిదం అయితే అద్దెదారుడు (Tenant) చెల్లించాలి. కానీ అది చిన్న స్క్రాచ్ అయినపుడు అంత చెల్లించమనడం దారుణం అని రాసుకొచ్చారు. 

తగ్గిన ఫైన్.. 

చివరకు ఆ ఓనర్ (Owner) అద్దెదారుడికి (Tenant) వేసిన ఫైన్ (Fine) ను తగ్గించారు. చివరకు ఆ అద్దెదారుడు (Tenant) $314 (సుమారు రూ. 26,139) చార్జీ చెల్లించాడు. అంటే ఆ ఓనర్ మొదట వేసిన ఫైన్ (Fine) కు దాదాపు సగం తగ్గించాడు. దీంతో ఆ అద్దెదారుడు (Tenant) తను కోర్టు (Court) కు వెళ్లకుండా ఈ సమస్యను ఇక్కడితో స్వస్తి పలికి ఆ ఫైన్ ను చెల్లించేందుకు సిద్ధం అయ్యాడు. రీసెంట్ గా ఆ అద్దెదారుడు (Tenant) చేసిన పోస్ట్ లో తను ఆ తగ్గించిన ఫైన్ ను చెల్లించినట్లు పేర్కొన్నాడు. సమయం (Time) విలువైనదని దానిని అనవసరంగా వృథా చేయడం ఎందుకని ఆ ఫైన్ ను చెల్లించినట్లు అతను పేర్కొన్నాడు. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అతడు ఫైన్ చెల్లించాడు. ఏదేమైనా ఆ ఓనర్ బిహేవియర్ మాత్రం మరీ ఘోరం.