జాబిల్లి ఫొటోలను పంపిన చంద్రయాన్-3

చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3 మొదటి సారిగా చంద్రుని ఫొటోలను పంపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు నెలరోజుల కింద భూమి నుంచి చంద్రుని మీదకి వెళ్లిన ఇస్రో అంతరిక్ష నౌక చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే ఆ అంతరిక్ష నౌక చంద్రుడి ఫొటోలను తీసి కిందకి పంపించింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా […]

Share:

చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3 మొదటి సారిగా చంద్రుని ఫొటోలను పంపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాదాపు నెలరోజుల కింద భూమి నుంచి చంద్రుని మీదకి వెళ్లిన ఇస్రో అంతరిక్ష నౌక చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే ఆ అంతరిక్ష నౌక చంద్రుడి ఫొటోలను తీసి కిందకి పంపించింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసి అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సక్సెస్ అయిన చంద్రయాన్-3

దాదాపు నెలరోజుల కిందట  చంద్రుడి మీదకి బయల్దేరి వెళ్లిన చంద్రయాన్-3 నెలరోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిని ఈ మిషన్ చేరుకుంది. చంద్రుడి మీద అడుగు పెట్టగానే ఈ మిషన్ తన పనిని మొదలుపెట్టింది. ఇలా చేరుకున్నదే తడవు ఆ మిషన్ చంద్రుడి ఫొటోలను పంపించింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. అంతా ఈ ఫొటోలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలు చంద్రుని యొక్క వివిధ క్రేటర్ లను చూపెట్టింది. వీటిల్లో ఒకటి జియోర్డానో బ్రూనో క్రేటర్. చంద్రుడి మీద ఉన్న అతి చిన్న వయసున్న (యంగ్) క్రేటర్ లలో ఇది పెద్దది.

బయటపడ్డ L1 కెమెరా పనితనం 

ఇస్రో పంపిన ఫొటోల్లో ఒకటి L1 కెమెరా-1 పంపిన ఫొటో. ఇది 43 కి.మీ వ్యాసం కలిగిన హర్ఖేబీ బిలం చిత్రాలను బంధించింది. నిన్న అంతరిక్ష నౌక ప్రొపల్షన్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయిన తర్వాత చంద్రయాన్ ఈ ఫొటోలను క్యాప్చర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. 

ఇంకా కొన్ని రోజులే

చంద్రయాన్-3 ఇంకా కొన్ని రోజుల వ్యవధిలో చంద్రుడి మీద ల్యాండ్ కానుంది. ల్యాండర్ నుంచి రోవర్ ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ కానుంది. ఇందుకోసం యావత్ దేశంతో పాటుగా ప్రపంచం కూడా కళ్లు కాయలు కాసుకుని ఎదురు చూస్తోంది.   

ఆ డేటా ను కూడా స్వీకరిస్తోంది… 

చంద్రుడి మీద ల్యాండింగ్ తర్వాత రోవర్ ఏం చేస్తుందని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఇస్రో సమాధానాలు చెప్పింది. చంద్రుడి మీద ల్యాండ్ అయిన తర్వాత రోవర్ చంద్రుని ఉపరితలం గురించి అంతే కాకుండా భూగర్భశాస్త్రం మీద డేటాను కూడా స్వీకరిస్తోందని ఇస్రో క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్ పంపిన ఫొటోలు కేవలం శాంపిల్స్ మాత్రమే అని అది అక్కడికి పూర్తిగా దిగిన తర్వాత మరింత ఎఫెక్టివ్ గా పని చేస్తుందని అంతా నమ్ముతున్నారు. 

కళ్లు కాయలు కాసేలా.. 

చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడానికి సమయం దగ్గరపడింది. దీంతో మొత్తం ప్రపంచం అంతా ఈ ఘటనను తిలకించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వచ్చే రోజుల్లో భారత అంతరిక్ష కేంద్రం ఇటువంటి మరిన్ని ప్రయోగాలు చేసి దేశ కీర్తిని పెంచుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రయోగం సక్సెస్ తో ప్రపంచంలోని పెద్ద దేశాల సరసన ఇండియా చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు ఇటువంటి ఘనత కేవలం యూఎస్, చైనా, రష్యా దేశాలకు మాత్రమే వీలుపడగా.. వాటి సరసన ఇప్పుడు మన భారత్ కూడా చేరింది. ఇదంతా ఇస్రో వల్లే సాధ్యపడింది. దేశం మొత్తం ఇస్రో గొప్పతనాన్నిచూసి మురిసిపోతున్నారు. సెల్యూట్ చేస్తున్నారు.