మోదీ మొహం చూపించుకోలేడు: లాలు యాదవ్

మణిపూర్ అంశంపై చర్చకు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావాలని ప్రతిపక్షాల డిమాండ్‌పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ, ప్రధాని మోదీ దోషి కాబట్టి ఆయన దానిని ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. అతను మొహం చూపించుకో లేడు అంటూ వ్యాఖ్యానించారు. ఫైర్ అయిన లాలు యాదవ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారని ఇంతకుముందు లాలు యాదవ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. అయితే ఆయన చేసిన వాక్యలు గురించి, […]

Share:

మణిపూర్ అంశంపై చర్చకు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావాలని ప్రతిపక్షాల డిమాండ్‌పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ, ప్రధాని మోదీ దోషి కాబట్టి ఆయన దానిని ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. అతను మొహం చూపించుకో లేడు అంటూ వ్యాఖ్యానించారు.

ఫైర్ అయిన లాలు యాదవ్:

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారని ఇంతకుముందు లాలు యాదవ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. అయితే ఆయన చేసిన వాక్యలు గురించి, ఆయన ఉద్దేశం అడిగినప్పుడు, మోదీకు బయట సెటిల్ అవ్వడానికి మంచి ప్లేస్ దొరుకుతుందని అన్నారు. అంతే కాకుండా అతను ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్ (ఫెర్డినాండ్ మార్కోస్) లాగా పారిపోవాల్సి వస్తుంది ఎందుకంటే, అతను చాలా పాపం చేసాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు లాలు యాదవ్.

ముఖ్యంగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి పార్లమెంటులో మణిపూర్ అంశంపై ప్రతిపక్ష నాయకులు నిరంతరం కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే ఉన్నారు. మణిపూర్‌పై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలన్న డిమాండ్‌పై దృఢంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మంగళవారం మాట్లాడుతూ, అసలు మణిపూర్ విషయంపై మోదీ ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలని కోరారు.

మణిపూర్ పరిస్థితిపై చర్చకు ప్రతిపక్ష కూటమి, భారతదేశ ప్రతిపక్ష సభ్యులు సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రధాని మోదీ సమావేశానికి ఎప్పుడు హాజరవుతారు అంటూ ప్రశ్నించారు. మణిపూర్‌పై పార్లమెంటులో ప్రతిష్టంభనను ముగించడానికి, ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సంప్రదించాలా వద్దా అంటూ లేవనెత్తిన ప్రశ్నపై  , కాంగ్రెస్ నాయకుడు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రశ్నను అధికార బిజెపి నాయకత్వాన్ని అడగాలని.. ఈ విషయాలపై వారు ఎప్పుడు మాట్లాడబోతున్నారు? గత 90 రోజులుగా మణిపూర్ మండుతోంది. హింస కొనసాగుతున్న వారు నోరు విప్పట్లేదు ఎందుకు అంటూ బిజెపిని ప్రశ్నించారు.

జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు మణిపూర్‌పై ఆయన చేసిన సంక్షిప్త ప్రకటనపై ప్రధాని మోదీని విమర్శిస్తూ, ప్రధాని మణిపూర్ పరిస్థితిపై కేవలం ముప్పై సెకన్ల పాటు మాట్లాడారు అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 

మణిపూర్ హింస: 

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్.