రాహుల్‌కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి..!

ఏఐసీసీ ఆగ్ర నేత రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సిఎల్పీ నేత ముల్లు భట్టి  విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మధిరలో సోమవారం జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ప్రధాని పదవిని త్యాగం చేసిన రాహుల్ పై సభ్యత సంస్కారం మరచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడు పబ్బులు, క్లబ్బుల వెంట తిరిగే కేటీఆర్ కు పొలాలు పబ్ […]

Share:

ఏఐసీసీ ఆగ్ర నేత రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని సిఎల్పీ నేత ముల్లు భట్టి  విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మధిరలో సోమవారం జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ప్రధాని పదవిని త్యాగం చేసిన రాహుల్ పై సభ్యత సంస్కారం మరచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎప్పుడు పబ్బులు, క్లబ్బుల వెంట తిరిగే కేటీఆర్ కు పొలాలు పబ్ లలా, మెకానిక్ షాపులు క్లబ్ లలా కనిపిస్తున్నాయని  ఎద్దేవా చేశారు.అవినీతిలో కూరుకున్న కేటీఆర్ వెంట ఈడీ,  సిబిఐ పడుతుండడంతో బిజెపి నాయకులతో అంట కాగుతూ వారి డైలాగులను వల్లే వేస్తున్నారని విమర్శించారు.

ఇక ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు  కూడా పార్టీకి నష్టం చేకూరుస్తాయని అన్న ప్రశ్నకు భట్టి  సమాధానం ఇస్తూ  ఆయన వ్యాఖ్యలను కట్ చేసి చూపించారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని అధికారంలోకి రాగానే నూటికి నూరు శాతం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా  చేస్తామని భట్టి స్పష్టం చేశారు.ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై విహారి స్నేహితుల కౌంటర్లు ప్రారంభించారు. బిజెపికి బీఆర్ఎస్ అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు.  తమది బీ- టీమో… సి -టీమో… కాదని..ఒంటి చేత్తో కాంగ్రెస్,  బిజెపిలను ఢీకొట్టే డీ- టీమ్ అంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఖమ్మం జనగర్జన సభలో ఆర్ఎస్ ప్రభుత్వం పై బిజెపి అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ బిజెపికి బీ-టీం అంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో కౌంటర్ వేశారు.

తమది బిజెపి బంధువుల పార్టీ కాదు. కాంగ్రెస్ దే భారత రాబందుల పార్టీ అంటూ విమర్శించారు.  కరప్షన్ కమిటీ. అంటూ కొత్త అబ్రివేషన్ చెప్పారు. దేశంలో అవినీతికి అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్…. కాంగ్రెస్ పార్టీ అన్నారు. స్కాములే తాచుపాములై…. యూపీఏను … దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగ్ అయిన చరిత్రను ప్రజలు మరచిపోలేదన్నారు కేటీఆర్. తమ పార్టీ బిజెపికి బీ-టీం కాదు.కాంగ్రెస్ పార్టీకి సీ-టీం అంతకన్నా కాదను బిజెపి కాంగ్రెస్ రెండింటిని ఒంటి చేత్తో ఢీకొట్టే డి- టీం… బి ఆర్ ఎస్ అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

నేరుగా ఢీకొనే దమ్ము లేక బిజెపి భుజంపై  తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా…? అంటూ ప్రశ్నించారు.ముమ్మాటికి కుప్పకూలేదే  కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు.లక్ష కోట్లు వ్యయం కానీ కాలేశ్వరం ప్రాజెక్టుల లక్ష కోట్ల అవినీతి….? వ్యక్తం చేశారు. అర్థంలేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో  ఎన్నిసార్లు  నవ్వుల పాలవుతున్నారని అడిగారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది… నిర్మాణాత్మక ప్రతిపక్షమని..  ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదన్నారు. భూములు, భూ రికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించరాదని కేటీఆర్ కర్ణాటకలో అన్న భాగ్య హామీని గంగలో కలిపి ఇక్కడ 4 పెన్షన్ అంటే నమ్మేది ఎవరు..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.