తెలంగాణలో 250 కిలోమీట‌ర్ల మేర మెట్రో విస్తీర్ణం

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న కేటీ రామారావు, మీటింగ్ లో మాట్లాడుతూ, ఒకవేళ 2024లో గవర్నమెంట్ తమకు అనుకూలంగా ఉంటే తప్పకుండా మరో రెండు స్కై వేస్ అనేవి తెలంగాణలో వస్తాయని స్పష్టం చేశారు.  KTR మెట్రో నెట్వర్క్ ప్లాన్:  హైదరాబాదులో వచ్చే ఏడాదుల్లో రాబోయే కొన్ని గవర్నమెంట్ ప్లాన్లు గురించి కేటి రామారావు గురువారం మాట్లాడటం జరిగింది. అయితే ఆయన తెలంగాణ హైదరాబాదులో మెట్రో నెట్వర్క్ పెంపు గురించి ప్రస్తావించారు, 250 కిలోమీటర్లు […]

Share:

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్న కేటీ రామారావు, మీటింగ్ లో మాట్లాడుతూ, ఒకవేళ 2024లో గవర్నమెంట్ తమకు అనుకూలంగా ఉంటే తప్పకుండా మరో రెండు స్కై వేస్ అనేవి తెలంగాణలో వస్తాయని స్పష్టం చేశారు. 

KTR మెట్రో నెట్వర్క్ ప్లాన్: 

హైదరాబాదులో వచ్చే ఏడాదుల్లో రాబోయే కొన్ని గవర్నమెంట్ ప్లాన్లు గురించి కేటి రామారావు గురువారం మాట్లాడటం జరిగింది. అయితే ఆయన తెలంగాణ హైదరాబాదులో మెట్రో నెట్వర్క్ పెంపు గురించి ప్రస్తావించారు, 250 కిలోమీటర్లు మెట్రో నెట్వర్క్పెంపు గురించి ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ 2024లో ప్రభుత్వం తమకి అనుకూలంగా ఉంటే గనక తప్పకుండా తమ ప్లాన్ అమల్లోకి వస్తదని పేర్కొన్నారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ కొత్త ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో 31 కిలోమీటర్లు శంషాబాద్ నుంచి రాయదుర్గం వరకు. మరో ఎక్స్పాన్షన్ BHEL నుంచి లడికి కపుల్ వరకు మొత్తం 26 కిలోమీటర్లు. మరొకటి జూబ్లీ బస్టాండ్ నుంచి ఈసీఐఎల్ వరకు ఉంటుంది. అంటే ప్రస్తుతానికి ఉన్న HMRL నెట్వర్క్ ని 75 కిలోమీటర్లు చేస్తే అవకాశం ఉంటుంది. 

మరిన్ని వివరాల్లోకి వెళ్తే: 

“విమానాశ్రయం మెట్రో కేవలం ఫ్లైట్ ఎక్కాలనుకునే వారికి మాత్రమే కాదు. GO-111 తర్వాత, ఇది హైదరాబాద్ యొక్క నైరుతి కోరిడోర్ అనేది తెరిచినట్లు అవుతుంది, ”అని ఆయన అన్నారు. GO-111 ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నదుల ప్రవాహాన్ని సుమారు 10 కి.మీ వ్యాసార్థం వరకు అభివృద్ధి నిర్మాణ పనులను నిషేధించడం జరిగింది. నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తూ ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.

ఇతర కార్యక్రమాల గురించి కేటీఆర్ మాట్లాడుతూ, “విమానాశ్రయానికి దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫార్మా సిటీ దక్షిణ మరియు ఆగ్నేయ హైదరాబాద్‌లో డెవలప్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. కొంగరకలాన్‌, ఆదిబట్ల, ఘట్‌కేసర్‌ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌ పరిశ్రమలు హైదరాబాద్‌ తూర్పు ప్రాంతాలను అభివృద్ధి పనులు తప్పకుండా ఉంటాయి. ఉత్తరం నుండి తూర్పు విభాగంలో మెడికల్ ఎక్విప్మెంట్ పార్క్ అంతేకాకుండా ప్రతిపాదిత విద్యా నగరం, ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ అన్నీ విజన్‌లో భాగంగా ఉన్నాయి.

ప్రభుత్వం 3,800 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను దశలవారీగా తొలగిస్తుంది మరియు మొదటి దశలో, 1000 బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు వాటి బదులు రాబోతున్నాయి” అని ఆయన తెలిపారు.

మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును ఈ ప్రభుత్వ హయాంలో చేపట్టలేమని, రాష్ట్ర ఎన్నికల తర్వాత తిరిగి రాగానే చేపడతామని కేటీఆర్ అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన తాను శామీర్‌పేటలో 500 ఎకరాల భూమికి బదులుగా కంటోన్మెంట్‌లో 150 ఎకరాల రక్షణ భూమిని కోరానని, ఈ విషయంలో సానుకూల స్పందన రాలేదని అన్నారు అని మీటింగులో తెలిపారు. 

హైదరాబాద్ మెట్రో రూట్: 

హైదరాబాద్ మెట్రో రైలు (HMR) మూడు విభిన్న మార్గాలలో నడుస్తుంది – BLUE: నాగోల్ నుండి రాయదుర్గ్, GREEN: ఫలక్‌నుమా నుండి పరేడ్ గ్రౌండ్, మరియు RED: మియాపూర్ నుండి LB నగర్. హైదరాబాద్ మెట్రో రైలు మస్కట్ నిజ్. ఇది హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని పాలించిన నిజాం అనే పదం నుండి తీసుకున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ నెట్‌వర్క్ మూడు కారిడార్‌లలో మొత్తం 69.2 కి.మీ.ల దూరాన్ని కవర్ చేస్తుంది:

కారిడార్ I: మియాపూర్ నుండి LB నగర్.

కారిడార్ II: JBS నుండి MGBS.

కారిడార్ III: నాగోల్ నుండి రాయదుర్గం.