ప‌ర్యాట‌క హ‌బ్స్‌గా కోట‌ప్ప‌కొండ‌, కొండ‌వీడు

ఎకో టూరిజం… ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. చాలా ప్రభుత్వాలు ఈ ఎకో ప‌ర్యాట‌కాన్ని డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నాయి. అందులో చాలా మట్టుకు విజయం సాధిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయడంతో ఉపాధితో పాటు డెవలప్ అయిన రాష్ట్రాలుగా కూడా మిగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొండవీడు మరియు  కోటప్పకొండ ప్రాంతాలు ప్రధానమైన పర్యాటక కేంద్రాలుగా వృద్ధి చెందుతున్నాయి. కొండవీడు ఎకో-టూరిజం ఇనిషియేటివ్ లో 33 సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించారు.  దీంతో కొండవీడు […]

Share:

ఎకో టూరిజం… ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. చాలా ప్రభుత్వాలు ఈ ఎకో ప‌ర్యాట‌కాన్ని డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నాయి. అందులో చాలా మట్టుకు విజయం సాధిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయడంతో ఉపాధితో పాటు డెవలప్ అయిన రాష్ట్రాలుగా కూడా మిగులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొండవీడు మరియు  కోటప్పకొండ ప్రాంతాలు ప్రధానమైన పర్యాటక కేంద్రాలుగా వృద్ధి చెందుతున్నాయి. కొండవీడు ఎకో-టూరిజం ఇనిషియేటివ్ లో 33 సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించారు.  దీంతో కొండవీడు చుట్టుపక్కల ఉన్న చాలా మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తమకు ఎంతో మేలు చేస్తుందని వారు అంటున్నారు. 

పల్నాడు జిల్లలో పర్యాటకాన్ని పెంపొందించేందుకు గాను కొండవీడును మరియు కోటప్పకొండను ప్రధానమైన ఎకో-టూరిజం హబ్ లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు నాలుగున్నర కోట్లతో, నెలవారీగా సగటున 3000 చొప్పున 58 పనులను చేపట్టి పర్యాటక కేంద్రాన్ని అబివృద్ది చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి పలు ప్రణాళికలు కూడా తయారు చేశారు. 

33 సౌకర్యాలు

2.66 కోట్ల వ్యయంతో  కొండవీడు ఎకో-టూరిజం ఇనిషియేటివ్ లో 33 సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు తీసుకు వచ్చారు. అందులో క్యాంపింగ్ ఫెసిలిటీ, ఎకో-ఫ్రెండ్లీ కెఫెటేరియా, బ్యాటరీ సహాయంతో నడిచే వాహనాలు, లోటస్ పాండ్, మెడిసినల్ ప్లాంట్ ఆర్బోరేటం, కోరాకిల్ రైడ్ సౌకర్యాన్ని కల్పించడం, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయడం, అడ్వెంచర్ టూరిజం అనగా ట్రెక్కింగ్, జిప్ లైన్, పర్వాతారోహణ, రాపెల్లింగ్, కయాకింగ్ తదితర వాటి మైంటెనెన్స్ అలాగే అభివృద్ధి కోసం, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అభివృద్ధి కోసం, ఆయుష్ డిపార్ట్మెంట్ సహాయంతో సందర్శకులకు పునరుజ్జీవన సౌకర్యం కల్పించడం, ఎకో-ఫ్రెండ్లీ షెల్టర్లను ఏర్పాటు చేయడం, తదితర ముఖ్యమైన పనులు ఉన్నాయి. గతంలో అధికారులు 3.98 కోట్ల వ్యయంతో 2018-19 నుంచి 2022-23 కాలంలో కొన్ని వరుస పనులు చేపట్టారు. కొండవీడు టూరిజం హబ్ నెలకు సగటున 12,500 మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు అయినటువంటి కొండవీడు ఘాట్ రోడ్డు, ప్రవేశ ద్వారం, లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, యాంఫీ థియేటర్, పగోడా, పుట్టాలమ్మ ట్యాంక్, ట్రెక్కింగ్, 3డి రాళ్ళు మరియు అడ్వెంచర్ యాక్టివిటీ జోన్ వంటివి ఉన్నాయి. 

అదే విధంగా, అటవీ అధికారులు దాదాపు 1.74 కోట్ల వ్యయంతో కోటప్పకొండ ఎకో-టూరిజంలో 25 సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం అని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా, ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్ తో ఏర్పాటు చేయబోయే హిల్ వ్యూ డెక్ పాయింట్, ట్రెక్కింగ్ మార్గాలు, ప్లాస్టిక్ రి సైక్లింగ్ అండ్ కంపోస్ట్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ నర్సరీ పెంపొందించడం, మొక్కల విక్రయం, బోటింగ్ ఏరియాలో కొత్త బోట్లను కల్పించడం, గిరిప్రదక్షిణ చుట్టూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను ఏర్పాటు చేయడం, ఘాట్ రోడ్డు గుండా ఉన్న డ్రిప్ సిస్టంని మెయింటెనెన్స్, అలాగే పాతకోటయ్య దేవాలయనికి సౌకర్యాలు ఉన్నాయి. కోటప్పకొండలో కొన్ని ప్రధాన ఆకర్షణలు ఇలా ఉన్నాయి.. ఘాట్ రోడ్డు, బ్రహ్మదేవుడి విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం, పగోడా ఫిష్ అక్వేరియం, పక్షుల వ్యూ పాయింట్, కలండి మడుగు, అలాగే బాతులు, జింకలు, ఆస్ట్రిచ్ ల కోసం ఏర్పాటు చేసిన ఎంక్లోజర్ లు. గతంలో ఇక్కడి అధికారులు, 2018-19 నుంచి 2022-23 కాలం వరకు దాదాపుగా 1.91 కోట్ల వ్యయంతో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అలాగే నెలకు సగటున 12,500 మంది సందర్శకులు వస్తున్నారని ఎకో-టూరిజం ఇనిషియేటివ్ రిజిస్టర్ చేసింది. దీనికి తోడుగా, అటవీ శాఖ వారు సత్తెమ్మతల్లి, దేవరంపాడు, గుత్తికొండ బిలం, భతృపాలెం, మాచెర్ల, దైడా, వినుకొండ, సంజీవకొండ, మన్నేపల్లి మరియు బొప్పూడి లాంటి ప్రదేశాలను ఎకో-టూరిజం హబ్బులుగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు మాట్లాడుతూ… ఎకో-టూరిజాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, దాని పై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు పలు ముఖ్యమైన ప్రదేశాల్లో అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.